ఆదికాండము 14 : 1 (IRVTE)
{అబ్రాము లోతును రక్షించడం} [PS] షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో
ఆదికాండము 14 : 2 (IRVTE)
ఆ రాజులు సొదొమ రాజు బెరాతో, గొమొర్రా రాజు బిర్షాతో, అద్మా రాజు షినాబుతో, సెబోయీయుల రాజు షెమేబెరుతో, బెల (దీన్ని సోయరు అని కూడా పిలుస్తారు) రాజుతో యుద్ధం చేశారు. [PE][PS]
ఆదికాండము 14 : 3 (IRVTE)
వీళ్ళందరూ కలిసి సిద్దీము (ఉప్పు సముద్రం) లోయలో ఏకంగా సమకూడారు.
ఆదికాండము 14 : 4 (IRVTE)
ఈ రాజులు పన్నెండు సంవత్సరాలు కదొర్లాయోమెరుకు లొంగి ఉన్నారు. పదమూడో సంవత్సరంలో తిరుగుబాటు చేశారు.
ఆదికాండము 14 : 5 (IRVTE)
పద్నాలుగో సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితోపాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోత్‌ కర్నాయిములో రెఫాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో ఏమీయులపై,
ఆదికాండము 14 : 6 (IRVTE)
శేయీరు పర్వత ప్రదేశంలో అరణ్యం వైపుగా ఉన్న ఏల్ పారాను వరకూ ఉన్న హోరీయులపై దాడి చేశారు. [PE][PS]
ఆదికాండము 14 : 7 (IRVTE)
తరువాత మళ్ళీ ఏన్మిష్పతుకు (దీన్ని కాదేషు అనికూడా పిలుస్తారు) వచ్చి అమాలేకీయుల దేశమంతటినీ హససోను తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా ఓడించారు. [PE][PS]
ఆదికాండము 14 : 8 (IRVTE)
అప్పుడు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, బెల (సోయరు) రాజులు బయలుదేరి సిద్దీము లోయలో
ఆదికాండము 14 : 9 (IRVTE)
ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు అనే నలుగురితో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేశారు. [PE][PS]
ఆదికాండము 14 : 10 (IRVTE)
ఆ సిద్దీము లోయలో తారు బంక గుంటలు ఎక్కువగా ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. మిగిలిన వాళ్ళు కొండలకు పారిపోయారు.
ఆదికాండము 14 : 11 (IRVTE)
అప్పుడు వాళ్ళు సొదొమ గొమొర్రాల ఆస్తి అంతటినీ వాళ్ళ భోజన పదార్ధాలన్నిటినీ దోచుకున్నారు.
ఆదికాండము 14 : 12 (IRVTE)
ఇంకా అబ్రాము సోదరుడి కొడుకు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతణ్ణి, అతని ఆస్తిని కూడా దోచుకుని తీసుకుపోయారు. [PE][PS]
ఆదికాండము 14 : 13 (IRVTE)
ఒకడు తప్పించుకుని వచ్చి హెబ్రీయుడైన అబ్రాముకు ఆ సంగతి తెలియజేశాడు. ఆ సమయంలో అతడు ఎష్కోలు, ఆనేరుల సోదరుడు మమ్రే అనే అమోరీయునికి చెందిన సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉన్నాడు. వీళ్ళు అబ్రాముతో పరస్పర సహాయం కోసం ఒప్పందం చేసుకున్నవాళ్ళు.
ఆదికాండము 14 : 14 (IRVTE)
తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నాడని అబ్రాము విని, తన ఇంట్లో పుట్టి, సుశిక్షితులైన మూడువందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని వెళ్లి దాను వరకూ ఆ రాజులను తరిమాడు. [PE][PS]
ఆదికాండము 14 : 15 (IRVTE)
రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా అ రాజులపై దాడి చేసి, దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకూ తరిమాడు.
ఆదికాండము 14 : 16 (IRVTE)
అతడు ఆస్తి మొత్తాన్ని, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకు వచ్చాడు. [PS]
ఆదికాండము 14 : 17 (IRVTE)
{మెల్కీసెదెకు అబ్రామును దీవించడం} [PS] అతడు కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కోడానికి రాజు లోయ అనే షావే లోయ వరకూ బయలుదేరి వచ్చాడు.
ఆదికాండము 14 : 18 (IRVTE)
అంతేగాక [* అంటే యెరూషలేము] షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. [PE][PS]
ఆదికాండము 14 : 19 (IRVTE)
అతడు అబ్రామును ఆశీర్వదించి “ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగు గాక.
ఆదికాండము 14 : 20 (IRVTE)
నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక” అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు. [PE][PS]
ఆదికాండము 14 : 21 (IRVTE)
సొదొమ రాజు “మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకో” అని అబ్రాముతో అన్నాడు.
ఆదికాండము 14 : 22 (IRVTE)
అబ్రాము “దేవుడైన యెహోవా అబ్రామును ధనవంతుణ్ణి చేశాను, అని నువ్వు చెప్పకుండా ఉండేలా, ఒక్క నూలు పోగైనా, చెప్పుల పట్టీ అయినా నీ వాటిలోనుండి తీసుకోను.
ఆదికాండము 14 : 23 (IRVTE)
ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా దగ్గర నా చెయ్యి ఎత్తి ఒట్టు పెట్టుకున్నాను.
ఆదికాండము 14 : 24 (IRVTE)
ఈ యువకులు తిన్నది గాక, నాతోపాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్లకు ఏ వాటా రావాలో ఆ వాటాలు మాత్రం వాళ్ళను తీసుకోనివ్వు” అని సొదొమ రాజుతో చెప్పాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: