ఆదికాండము 15 : 1 (IRVTE)
దేవుడు అబ్రాముతో నిబంధన చెయ్యడం ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. “అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని” అన్నాడు.
ఆదికాండము 15 : 2 (IRVTE)
అబ్రాము “ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా!
ఆదికాండము 15 : 3 (IRVTE)
నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు” అన్నాడు.
ఆదికాండము 15 : 4 (IRVTE)
యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి “ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు” అన్నాడు.
ఆదికాండము 15 : 5 (IRVTE)
ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు.
ఆదికాండము 15 : 6 (IRVTE)
అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన * ఇక్కడ నీతి నే మాట మొదటి సరి కనిపిస్తున్నది. గలతి 3:6; రోమ్ 4:3; యాకోబు 3:26 చూడండి అతనికి నీతిగా పరిగణించాడు.
ఆదికాండము 15 : 7 (IRVTE)
యెహోవా “నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పినప్పుడు
ఆదికాండము 15 : 8 (IRVTE)
అతడు “ప్రభూ యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
ఆదికాండము 15 : 9 (IRVTE)
ఆయన “మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా” అని అతనితో చెప్పాడు.
ఆదికాండము 15 : 10 (IRVTE)
అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు.
ఆదికాండము 15 : 11 (IRVTE)
ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు.
ఆదికాండము 15 : 12 (IRVTE)
చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది.
ఆదికాండము 15 : 13 (IRVTE)
ఆయన “దీన్ని కచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు.
ఆదికాండము 15 : 14 (IRVTE)
వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు.
ఆదికాండము 15 : 15 (IRVTE)
కాని, నువ్వు నీ తండ్రుల దగ్గరికి ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో నువ్వు మరణించగా నిన్ను పాతిపెడతారు.
ఆదికాండము 15 : 16 (IRVTE)
అమోరీయుల అక్రమం ఇంకా హద్డు మీరలేదు గనుక, నీ నాలుగవ తరం మనుషులు ఇక్కడికి తిరిగి వస్తారని కచ్చితంగా తెలుసుకో” అని అబ్రాముతో చెప్పాడు.
ఆదికాండము 15 : 17 (IRVTE)
సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న కాగడా దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి.
ఆదికాండము 15 : 18 (IRVTE)
ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.
ఆదికాండము 15 : 19 (IRVTE)
కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను,
ఆదికాండము 15 : 20 (IRVTE)
హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను,
ఆదికాండము 15 : 21 (IRVTE)
అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ వారసులకు దాసులుగా చేస్తాను” అని అబ్రాముతో నిబంధన చేశాడు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21