ఆదికాండము 25 : 1 (IRVTE)
{అబ్రాహాము ఇతర సంతతి} (1దిన 1:32-33) [PS] అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా.
ఆదికాండము 25 : 2 (IRVTE)
ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనేవాళ్ళు పుట్టారు.
ఆదికాండము 25 : 3 (IRVTE)
యొక్షాను షేబ, దెదానులకు జన్మనిచ్చాడు. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనే జాతులు ఈ దెదాను సంతానమే.
ఆదికాండము 25 : 4 (IRVTE)
మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు. [PE][PS]
ఆదికాండము 25 : 5 (IRVTE)
వీళ్ళందరూ కెతురా సంతానం. అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు.
ఆదికాండము 25 : 6 (IRVTE)
అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు. అబ్రాహాము మరణం, సమాధి [PE][PS]
ఆదికాండము 25 : 7 (IRVTE)
అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు.
ఆదికాండము 25 : 8 (IRVTE)
అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు. [PE][PS]
ఆదికాండము 25 : 9 (IRVTE)
అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది.
ఆదికాండము 25 : 10 (IRVTE)
అబ్రాహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు.
ఆదికాండము 25 : 11 (IRVTE)
అబ్రాహాము చనిపోయిన తరువాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బెయేర్‌ లహాయి రోయి దగ్గర నివాసమున్నాడు. [PS]
ఆదికాండము 25 : 12 (IRVTE)
{ఇష్మా యేలు వంశావళి} [PS] ఐగుప్తీయురాలూ శారా దాసీ అయిన హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలు వంశావళి ఇది. [PE][PS]
ఆదికాండము 25 : 13 (IRVTE)
ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నేబాయోతూ, కేదారు, అద్బయేలూ, మిబ్శామూ,
ఆదికాండము 25 : 14 (IRVTE)
మిష్మా, దూమానమశ్శా,
ఆదికాండము 25 : 15 (IRVTE)
హదరూ, తేమా, యెతూరూ, నాపీషూ, కెదెమా.
ఆదికాండము 25 : 16 (IRVTE)
ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ, కోటల ప్రకారమూ వంశావళుల ప్రకారమూ వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం పన్నెండు మంది రాజులు. [PE][PS]
ఆదికాండము 25 : 17 (IRVTE)
ఇష్మాయేలు నూట ముప్ఫై ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.
ఆదికాండము 25 : 18 (IRVTE)
వీళ్ళు అష్షూరుకు వెళ్ళే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకూ నివసిస్తుండే వాళ్ళు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు [* తూర్పు దిక్కున] విరోధంగా జీవించేవారు. [PE][PS]
ఆదికాండము 25 : 19 (IRVTE)
అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి.
ఆదికాండము 25 : 20 (IRVTE)
ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కాను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు. ఏశావు, యాకోబుల జననం [PE][PS]
ఆదికాండము 25 : 21 (IRVTE)
ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది.
ఆదికాండము 25 : 22 (IRVTE)
ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది. [PE][PS]
ఆదికాండము 25 : 23 (IRVTE)
అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు. [QBR] “రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. [PE][PS] రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. [PE][PS] ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. [PE][PS] పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.” [PE][PS]
ఆదికాండము 25 : 24 (IRVTE)
ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
ఆదికాండము 25 : 25 (IRVTE)
మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి [† అంటే ఒళ్లంతా వెంట్రుకలు గల వాడు.] ఏశావు అనే పేరు పెట్టారు.
ఆదికాండము 25 : 26 (IRVTE)
తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు. [PS]
ఆదికాండము 25 : 27 (IRVTE)
{ఏశావు తన జేష్టత్వం హక్కు వదులుకోవడం} [PS] ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు.
ఆదికాండము 25 : 28 (IRVTE)
ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం. [PE][PS]
ఆదికాండము 25 : 29 (IRVTE)
యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు.
ఆదికాండము 25 : 30 (IRVTE)
ఏశావు యాకోబును “దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను” అని అడిగాడు. అందుకే అతనికి [‡ అంటే ఎర్రని] ఏదోము అనే పేరు వచ్చింది. [PE][PS]
ఆదికాండము 25 : 31 (IRVTE)
అందుకు యాకోబు “ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చెయ్యి” అన్నాడు.
ఆదికాండము 25 : 32 (IRVTE)
అప్పుడు ఏశావు “చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?” అన్నాడు.
ఆదికాండము 25 : 33 (IRVTE)
యాకోబు “ముందు ప్రమాణం చెయ్యి” అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు.
ఆదికాండము 25 : 34 (IRVTE)
యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: