ఆదికాండము 27 : 1 (IRVTE)
{ఇస్సాకు యకోబును దీవించడం} [PS] ఇస్సాకు బాగా ముసలి వాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో “నా కొడుకా” అని పిలిచాడు. అతడు “చిత్తం నాన్నగారూ” అన్నాడు.
ఆదికాండము 27 : 2 (IRVTE)
అప్పుడు ఇస్సాకు “చూడు, నేను ముసలివాణ్ణి. ఎప్పుడు చనిపోతానో తెలియదు. [PE][PS]
ఆదికాండము 27 : 3 (IRVTE)
కాబట్టి నువ్వు నీ ఆయుధాలు అమ్ముల పొదినీ, విల్లునీ తీసుకుని అడవికి వెళ్ళి అక్కడ నాకోసం వేటాడి మాంసం తీసుకురా.
ఆదికాండము 27 : 4 (IRVTE)
దాన్ని నాకోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకు వస్తే నేను చనిపోక ముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 27 : 5 (IRVTE)
ఇస్సాకు తన కొడుకు ఏశావుతో ఇలా చెప్తుంటే రిబ్కా వీరికి తెలియకుండా చాటు నుండి వింటూ ఉంది. ఏశావు వేటాడి మాంసం తీసుకు రావడానికి అడవికి వెళ్ళాడు.
ఆదికాండము 27 : 6 (IRVTE)
అప్పుడు రిబ్కా తన కొడుకు యాకోబుతో “జాగ్రత్తగా విను. మీ నాన్న నీ అన్నతో మాట్లాడటం నేను విన్నాను. ఆయన నీ అన్నతో
ఆదికాండము 27 : 7 (IRVTE)
‘నేను చనిపోక ముందు భోజనం చేసి యెహోవా సముఖంలో నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నువ్వు వేటాడి మాంసం తెచ్చి నాకోసం రుచిగా వండి తీసుకురా’ అన్నాడు. [PE][PS]
ఆదికాండము 27 : 8 (IRVTE)
కొడుకా, కాబట్టి ఇప్పుడు నా మాట విను. నేను నీకు చెప్పింది చెయ్యి.
ఆదికాండము 27 : 9 (IRVTE)
నువ్వు మంద దగ్గరికి వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను పట్టుకుని రా. నేను వాటితో మీ నాన్నఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను.
ఆదికాండము 27 : 10 (IRVTE)
నీ నాన్న చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేలా దాన్ని నువ్వు ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళు” అంది. [PE][PS]
ఆదికాండము 27 : 11 (IRVTE)
దానికి యాకోబు తన తల్లితో “నా అన్న ఏశావుకు ఒళ్ళంతా జుట్టు ఉంది. నేను నున్నగా ఉంటాను.
ఆదికాండము 27 : 12 (IRVTE)
ఒకవేళ మా నాన్న నన్ను తడిమి చూశాడనుకో. అప్పుడు నేను అతని దృష్టికి ఒక మోసగాడిలా ఉంటాను. అప్పుడిక నా మీదికి ఆశీర్వాదం స్థానంలో శాపం వస్తుంది” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 27 : 13 (IRVTE)
కానీ అతని తల్లి “కొడుకా, ఆ శాపం నాపైకి వస్తుంది గాక! నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరికి తీసుకుని రా” అని చెప్పింది.
ఆదికాండము 27 : 14 (IRVTE)
కాబట్టి యాకోబు రెండు మేక పిల్లలను పట్టుకుని వాటిని తన తల్లి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆమె వాటితో అతని తండ్రి ఇష్టపడే విధంగా రుచికరంగా వండి భోజనం సిద్ధం చేసింది. [PE][PS]
ఆదికాండము 27 : 15 (IRVTE)
రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏశావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి.
ఆదికాండము 27 : 16 (IRVTE)
ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేక పిల్లల చర్మాన్ని అతని మెడ పైని నున్నని భాగంలో కప్పింది.
ఆదికాండము 27 : 17 (IRVTE)
తాను వండి సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలనూ రొట్టెనూ తన కొడుకైన యాకోబు చేతికిచ్చింది. [PE][PS]
ఆదికాండము 27 : 18 (IRVTE)
అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు “కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?” అని అడిగాడు.
ఆదికాండము 27 : 19 (IRVTE)
దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 27 : 20 (IRVTE)
అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో “నా కొడుకా అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అన్నాడు. దానికి యాకోబు “నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు. అందుకే ఇంత త్వరగా దొరికింది” అన్నాడు.
ఆదికాండము 27 : 21 (IRVTE)
అప్పుడు ఇస్సాకు “నా కొడుకా, నువ్వు ఏశావువి అవునో కాదో తడిమి చూస్తా. దగ్గరికి రా” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 27 : 22 (IRVTE)
యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు. “స్వరం యాకోబుది కానీ చేతులు ఏశావు చేతులే” అన్నాడు.
ఆదికాండము 27 : 23 (IRVTE)
యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తు పట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతణ్ణి ఆశీర్వదించాడు. [PE][PS]
ఆదికాండము 27 : 24 (IRVTE)
“నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?” అని అడిగాడు. యాకోబు “అవును నేనే” అన్నాడు.
ఆదికాండము 27 : 25 (IRVTE)
అప్పుడు ఇస్సాకు “ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు. [PE][PS]
ఆదికాండము 27 : 26 (IRVTE)
అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు “నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు.
ఆదికాండము 27 : 27 (IRVTE)
యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. [QBR] “చూడు, నా కొడుకు సువాసన, [QBR] యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది. [QBR]
ఆదికాండము 27 : 28 (IRVTE)
ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ, [QBR] భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ, [QBR] ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక! [QBR]
ఆదికాండము 27 : 29 (IRVTE)
మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! [QBR] జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! [QBR] నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. [QBR] నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! [QBR] నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! [QBR] నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.” [PE][PS]
ఆదికాండము 27 : 30 (IRVTE)
ఇలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తరువాత యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అతని అన్న వేట నుండి తిరిగి వచ్చాడు.
ఆదికాండము 27 : 31 (IRVTE)
అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. “నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అని తండ్రితో అన్నాడు. [PE][PS]
ఆదికాండము 27 : 32 (IRVTE)
అతని తండ్రి అయిన ఇస్సాకు “నువ్వు ఎవరివి?” అని అడిగాడు. అతడు “నేను నీ కొడుకుని. ఏశావు అనే నీ పెద్ద కొడుకుని” అన్నాడు.
ఆదికాండము 27 : 33 (IRVTE)
దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. “అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరికి పట్టుకు వచ్చినదెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతణ్ణి ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు.” [PE][PS]
ఆదికాండము 27 : 34 (IRVTE)
ఏశావు తన తండ్రి మాటలు విని ఎంతో వేదనతో పెద్ద కేక పెట్టాడు. ఏడ్చాడు. తన తండ్రితో “నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు” అన్నాడు.
ఆదికాండము 27 : 35 (IRVTE)
ఇస్సాకు “నీ తమ్ముడు మోసంతో వేషం వేసుకుని వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడు” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 27 : 36 (IRVTE)
ఏశావు ఇలా అన్నాడు. “ [* అంటే మడిమ పట్టుకుని లాగే వాడు. మోసగాడు.] యాకోబు అనే పేరు వాడికి చక్కగా సరిపోయింది. వాడు నన్ను రెండు సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వపు జన్మహక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావలసిన ఆశీర్వాదం తీసుకు పోయాడు.” ఇలా చెప్పి ఏశావు తన తండ్రిని “నాకోసం ఇక ఏ ఆశీర్వాదమూ మిగల్చలేదా?” అని అడిగాడు.
ఆదికాండము 27 : 37 (IRVTE)
అందుకు ఇస్సాకు “చూడు, అతణ్ణి నీకు యజమానిగా నియమించాను. అతని బంధువులందరినీ అతనికి సేవకులుగా ఇచ్చాను. ధాన్యాన్నీ కొత్త ద్రాక్షారసాన్నీ అతనకి ఇచ్చాను? ఇవి కాక నీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి?” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 27 : 38 (IRVTE)
ఏశావు తన తండ్రితో “నాన్నా, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమూ లేదా? నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు” అంటూ గట్టిగా ఏడ్చాడు. [PE][PS]
ఆదికాండము 27 : 39 (IRVTE)
అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు. [QBR] “చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. [PE][PS] పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు. [PE][PS]
ఆదికాండము 27 : 40 (IRVTE)
నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. [PE][PS] నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. [PE][PS] కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.” [PE][PS]
ఆదికాండము 27 : 41 (IRVTE)
యకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు. “నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను.”
ఆదికాండము 27 : 42 (IRVTE)
తన పెద్దకొడుకు ఏశావు పలికిన ఈ మాటలను గూర్చి రిబ్కా వింది. ఆమె తన చిన్నకొడుకు యాకోబును పిలిపించింది. అతనితో “చూడు, నీ అన్న ఏశావు నిన్ను చంపుతాను అనుకుంటూ తనను తాను ఓదార్చుకుంటున్నాడు. [PE][PS]
ఆదికాండము 27 : 43 (IRVTE)
కాబట్టి కొడుకా, నా మాట విను. హారానులో ఉన్న నా సోదరుడు లాబాను దగ్గరికి పారిపో.
ఆదికాండము 27 : 44 (IRVTE)
నీ అన్న కోపం చల్లారే వరకూ కొద్ది రోజులు అక్కడే అతనితోనే ఉండు.
ఆదికాండము 27 : 45 (IRVTE)
నీ అన్న కోపం పూర్తిగా చల్లారిపోయి, నువ్వు అతనికి చేసిన దాన్ని అతడు మర్చిపోయే వరకూ అక్కడ ఉండు. అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపిస్తాను. ఒక్క రోజులోనే నేను మీ ఇద్దరినీ పోగొట్టుకోవడం ఎందుకు?” అంది. [PE][PS]
ఆదికాండము 27 : 46 (IRVTE)
రిబ్కా ఇస్సాకుతో “ఏశావు పెళ్ళాడిన హేతు జాతి స్త్రీల వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశపు అమ్మాయిలైన హేతు కుమార్తెల్లో వీళ్ళలాంటి మరో అమ్మాయిని యాకోబు కూడా పెళ్ళి చేసుకుంటే ఇక నేను బతికి ఏం ప్రయోజనం?” అంది. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46

BG:

Opacity:

Color:


Size:


Font: