ఆదికాండము 30 : 1 (IRVTE)
రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగక పోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో “నాకు గర్భఫలమియ్యి. లేకపోతే నేను చచ్చిపోతాను” అంది.
ఆదికాండము 30 : 2 (IRVTE)
యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. అతడు “నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేను ఉన్నానా?” అన్నాడు.
ఆదికాండము 30 : 3 (IRVTE)
అందుకు ఆమె “నా దాసి బిల్హా ఉంది గదా, ఆమెతో రాత్రి గడుపు. ఆమె నా కోసం పిల్లలను కంటుంది. ఆ విధంగా ఆమె వలన నాకు కూడా పిల్లలు కలుగుతారు” అని చెప్పి
ఆదికాండము 30 : 4 (IRVTE)
తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో లైంగికంగా కలిశాడు. [PE][PS]
ఆదికాండము 30 : 5 (IRVTE)
అప్పుడు బిల్హా గర్భవతి అయ్యి యాకోబుకు ఒక కొడుకుని కన్నది.
ఆదికాండము 30 : 6 (IRVTE)
అప్పుడు రాహేలు “దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు” అనుకుని అతనికి “దాను” అని పేరు పెట్టింది.
ఆదికాండము 30 : 7 (IRVTE)
రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
ఆదికాండము 30 : 8 (IRVTE)
అప్పుడు రాహేలు “దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను” అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. [PE][PS]
ఆదికాండము 30 : 9 (IRVTE)
లేయా తనకు కానుపు ఉడిగిపోవడం చూసి తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.
ఆదికాండము 30 : 10 (IRVTE)
జిల్పా యాకోబుకు కొడుకుని కన్నది.
ఆదికాండము 30 : 11 (IRVTE)
అప్పుడు లేయా “ఇది అదృష్టమే గదా” అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది.
ఆదికాండము 30 : 12 (IRVTE)
లేయా దాసి జిల్పా యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
ఆదికాండము 30 : 13 (IRVTE)
లేయా “నేను భాగ్యవంతురాలిని. స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా” అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది. [PE][PS]
ఆదికాండము 30 : 14 (IRVTE)
గోదుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో [* ఈ మూలిక సువాసనలీనుతూ ఉంటుంది. తిన్న వారిలో లైంగిక సామర్థ్యం పెంచుతుందని, స్త్రీలలో గర్భం ధరించే సామర్థ్యం పెంచుతుందని భావిస్తారు.] మంత్రమూలిక వేర్లు చూసి తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు “నీ కొడుకు తెచ్చిన మంత్రమూలికల్లో కొన్ని నాకు ఇవ్వు” అని లేయాతో అంది.
ఆదికాండము 30 : 15 (IRVTE)
అందుకామె “నా భర్తను తీసుకున్నావు కదా, అది చాలదా? ఇప్పుడు నా కొడుకు తెచ్చిన మూలికలు కూడా తీసుకుంటావా” అంది. అందుకు రాహేలు “అలాగైతే నీ కొడుకు తెచ్చిన మూలికల నిమిత్తం నీ భర్త ఈ రాత్రి నీతో గడుపుతాడు” అని చెప్పింది. [PE][PS]
ఆదికాండము 30 : 16 (IRVTE)
ఆ సాయంకాలం యాకోబు పొలం నుండి వచ్చేటప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్లి “నువ్వు నా దగ్గరికి రావాలి. నా కొడుకు తెచ్చిన మంత్రమూలికలతో నిన్ను కొన్నాను” అని చెప్పింది. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో ఉన్నాడు.
ఆదికాండము 30 : 17 (IRVTE)
దేవుడు లేయా మనవి విన్నాడు, ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు అయిదవ కొడుకుని కన్నది.
ఆదికాండము 30 : 18 (IRVTE)
లేయా “నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు” అనుకుని అతనికి “ [† ప్రతిఫలం] ఇశ్శాఖారు” అని పేరు పెట్టింది.
ఆదికాండము 30 : 19 (IRVTE)
లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది.
ఆదికాండము 30 : 20 (IRVTE)
అప్పుడు లేయా “దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు. నా భర్తకు ఆరుగురు కొడుకులను కన్నాను. కాబట్టి అతడు ఇకపై నాతో కాపురం చేస్తాడు” అనుకుని అతనికి “ [‡ ప్రతిష్ట] జెబూలూను” అని పేరు పెట్టింది.
ఆదికాండము 30 : 21 (IRVTE)
ఆ తరువాత ఆమె ఒక కూతురిని కని ఆమెకు దీనా అనే పేరు పెట్టింది. [PE][PS]
ఆదికాండము 30 : 22 (IRVTE)
దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని, ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడు.
ఆదికాండము 30 : 23 (IRVTE)
అప్పుడామె గర్భవతి అయ్యి కొడుకును కని “దేవుడు నా నింద తొలగించాడు” అనుకుంది.
ఆదికాండము 30 : 24 (IRVTE)
ఇంకా ఆమె “యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక” అనుకుని అతనికి “యోసేపు” అనే పేరు పెట్టింది. [PE][PS]
ఆదికాండము 30 : 25 (IRVTE)
రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో “నన్ను పంపివెయ్యి. నా స్థలానికి, నా దేశానికి తిరిగి వెళ్తాను.
ఆదికాండము 30 : 26 (IRVTE)
నా భార్యలను, నా పిల్లలను నా కప్పగించు. నేను వెళ్ళిపోతాను, వారి కోసం నీకు సేవ చేశాను. నేను సేవ చేసిన విధానం నీకు తెలుసు కదా” అని చెప్పాడు.
ఆదికాండము 30 : 27 (IRVTE)
అందుకు లాబాను అతనితో “నీ దయ నా మీద ఉంటే నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను.
ఆదికాండము 30 : 28 (IRVTE)
నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పు, అది నీకు ఇస్తాను” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 30 : 29 (IRVTE)
యాకోబు అతణ్ణి చూసి “నేను నీకేవిధంగా సేవ చేశానో, నీ మందలు నా దగ్గర ఎలా ఉండేవో అది నీకు తెలుసు.
ఆదికాండము 30 : 30 (IRVTE)
నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంత ఇంటివారి కోసం ఎప్పుడు సంపాదించుకుంటాను?” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 30 : 31 (IRVTE)
అప్పుడు లాబాను “నేను నీకేమివ్వాలి?” అని అడిగాడు. అందుకు యాకోబు “నువ్వు నాకేమీ ఇయ్యవద్దు, నువ్వు నాకోసం నేను చెప్పిన విధంగా చేస్తే, నేను తిరిగి నీ మందను మేపుతూ వాటి బాగోగులు చూస్తాను.
ఆదికాండము 30 : 32 (IRVTE)
ఈ రోజు నేను నీ మంద అంతటిలో నడచి చూసి పొడలైనా మచ్చలైనా గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానినీ, మేకల్లో మచ్చలైనా, పొడలైనా గలవాటినీ వేరు చేస్తున్నాను. అలాటివన్నీ నాకు జీతమౌతాయి.
ఆదికాండము 30 : 33 (IRVTE)
ఇక ముందు నాకు రావలసిన జీతం గూర్చి నువ్వు చూడడానికి వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం అవుతుంది. మేకల్లో పొడలూ మచ్చలూ లేనివీ, గొర్రెపిల్లల్లో నల్లగా లేనివీ నా దగ్గర ఉంటే నేను దొంగిలించానని చెప్పవచ్చు” అన్నాడు.
ఆదికాండము 30 : 34 (IRVTE)
అందుకు లాబాను “మంచిది, నీ మాట ప్రకారమే కానివ్వు” అన్నాడు. [PE][PS]
ఆదికాండము 30 : 35 (IRVTE)
ఆ రోజు లాబాను చారలూ, మచ్చలూ ఉన్న మేకపోతులనూ, పొడలూ మచ్చలూ గల ఆడ మేకలనూ కొంచెం తెలుపు గల ప్రతిదానినీ గొర్రెపిల్లల్లో నల్లవాటినీ అన్నిటినీ వేరుచేసి తన కొడుకులకు అప్పగించాడు.
ఆదికాండము 30 : 36 (IRVTE)
తనకూ యాకోబుకూ మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబానుకు చెందిన మిగిలిన మందను యాకోబు మేపుతూ ఉన్నాడు. [PE][PS]
ఆదికాండము 30 : 37 (IRVTE)
యాకోబు గంగ రావి, బాదం, సాల చెట్ల చువ్వలు తీసుకు ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు.
ఆదికాండము 30 : 38 (IRVTE)
మందలు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలవల్లో, నీటి గాళ్ళలో, వాటి ముందు పెట్టాడు. [PE][PS]
ఆదికాండము 30 : 39 (IRVTE)
అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి.
ఆదికాండము 30 : 40 (IRVTE)
యాకోబు ఆ గొర్రెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి వైపుకు, లాబాను మందల్లో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు.
ఆదికాండము 30 : 41 (IRVTE)
మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో ఆ చువ్వలు పెట్టాడు.
ఆదికాండము 30 : 42 (IRVTE)
మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకూ బలమైనవి యాకోబుకూ వచ్చాయి. [PE][PS]
ఆదికాండము 30 : 43 (IRVTE)
ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: