ఆదికాండము 35 : 1 (IRVTE)
{దేవుడు బేతెల్ లో దీవించడం} [PS] దేవుడు యాకోబుతో “నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు” అని చెప్పాడు.
ఆదికాండము 35 : 2 (IRVTE)
యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో “మీ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకుని, మీ వస్త్రాలు మార్చుకోండి.
ఆదికాండము 35 : 3 (IRVTE)
మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను” అని చెప్పాడు. [PE][PS]
ఆదికాండము 35 : 4 (IRVTE)
వారు తమ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళన్నిటినీ తమ చెవి పోగులనూ యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు.
ఆదికాండము 35 : 5 (IRVTE)
వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమ లేదు. [PE][PS]
ఆదికాండము 35 : 6 (IRVTE)
యాకోబు, అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు.
ఆదికాండము 35 : 7 (IRVTE)
అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి [* బేతేలు దేవుడు.] ఏల్‌ బేతేలు అని పేరు పెట్టారు.
ఆదికాండము 35 : 8 (IRVTE)
రిబ్కా దాది దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టి, దానికి [† ఒక విధమైన సింధూర వృక్షం. దీనికి ఏడుపు వృక్షం.] అల్లోన్ బాకూత్‌ అనే పేరు పెట్టారు. [PE][PS]
ఆదికాండము 35 : 9 (IRVTE)
యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు.
ఆదికాండము 35 : 10 (IRVTE)
అప్పుడు దేవుడు అతనితో “నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు” అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
ఆదికాండము 35 : 11 (IRVTE)
దేవుడు “నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జాతుల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.
ఆదికాండము 35 : 12 (IRVTE)
నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను” అని అతనితో చెప్పాడు.
ఆదికాండము 35 : 13 (IRVTE)
దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు. [PE][PS]
ఆదికాండము 35 : 14 (IRVTE)
దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దాని మీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు.
ఆదికాండము 35 : 15 (IRVTE)
తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. బెన్యామిను జననం, రాహేలు మరణం [PE][PS]
ఆదికాండము 35 : 16 (IRVTE)
వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.
ఆదికాండము 35 : 17 (IRVTE)
ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో “భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు” అంది.
ఆదికాండము 35 : 18 (IRVTE)
రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు [‡ నా యాతన పుత్రుడు.] బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి [§ నా కుడి చేతి పుత్రుడు.] బెన్యామీను అని పేరు పెట్టాడు.
ఆదికాండము 35 : 19 (IRVTE)
ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.
ఆదికాండము 35 : 20 (IRVTE)
యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకూ రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది. [PE][PS]
ఆదికాండము 35 : 21 (IRVTE)
ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్‌ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.
ఆదికాండము 35 : 22 (IRVTE)
ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది. [PE][PS]
ఆదికాండము 35 : 23 (IRVTE)
యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.
ఆదికాండము 35 : 24 (IRVTE)
యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు.
ఆదికాండము 35 : 25 (IRVTE)
రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.
ఆదికాండము 35 : 26 (IRVTE)
లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.
ఆదికాండము 35 : 27 (IRVTE)
అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను. [PS]
ఆదికాండము 35 : 28 (IRVTE)
{ఇస్సాకు మరణం} [PS] ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.
ఆదికాండము 35 : 29 (IRVTE)
ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: