ఆదికాండము 36 : 1 (IRVTE)
{ఏశావు వంశావళి} (1దిన 1:34-37) [PS] ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది.
ఆదికాండము 36 : 2 (IRVTE)
ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా,
ఆదికాండము 36 : 3 (IRVTE)
ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన బాశెమతు అనే కనాను యువతులను పెళ్ళి చేసుకున్నాడు.
ఆదికాండము 36 : 4 (IRVTE)
ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు.
ఆదికాండము 36 : 5 (IRVTE)
అహోలీబామా యూషును, యాలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు.
ఆదికాండము 36 : 6 (IRVTE)
ఏశావు తన భార్యలనూ కుమారులనూ కూతుళ్ళనూ తన ఇంటివారందరినీ తన మందలనూ పశువులనూ తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు.
ఆదికాండము 36 : 7 (IRVTE)
వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేక పోయారు. వారి పశువులు అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు.
ఆదికాండము 36 : 8 (IRVTE)
కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము. [PS]
ఆదికాండము 36 : 9 (IRVTE)
{శేయీరు జాతులు} [PS] శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది.
ఆదికాండము 36 : 10 (IRVTE)
ఏశావు కొడుకుల పేర్లు, ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీఫజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు.
ఆదికాండము 36 : 11 (IRVTE)
ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా.
ఆదికాండము 36 : 12 (IRVTE)
ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏశావు భార్య అయిన ఆదాకు మనుమలు. [PE][PS]
ఆదికాండము 36 : 13 (IRVTE)
రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతుకు మనుమలు.
ఆదికాండము 36 : 14 (IRVTE)
ఏశావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహొలీబామా. ఈమె ఏశావుకు కన్న కొడుకులు యూషు, యాలాము, కోరహు. [PE][PS]
ఆదికాండము 36 : 15 (IRVTE)
ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు,
ఆదికాండము 36 : 16 (IRVTE)
కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు.
ఆదికాండము 36 : 17 (IRVTE)
ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య బాశెమతు మనుమలు. [PE][PS]
ఆదికాండము 36 : 18 (IRVTE)
ఇక ఏశావు భార్య, అనా కూతురు అయిన అహొలీబామా కొడుకులు యూషు, యగ్లాము, కోరహు. వీరు అహొలీబామా పుత్రసంతానపు నాయకులు.
ఆదికాండము 36 : 19 (IRVTE)
వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు. [PE][PS]
ఆదికాండము 36 : 20 (IRVTE)
ఎదోము దేశంలో ఆదినుండీ నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
ఆదికాండము 36 : 21 (IRVTE)
దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు. [PE][PS]
ఆదికాండము 36 : 22 (IRVTE)
లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా.
ఆదికాండము 36 : 23 (IRVTE)
శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము.
ఆదికాండము 36 : 24 (IRVTE)
సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలను మేపుతూ ఉండగా మొదటి సారిగా అరణ్యంలో [* అడవి గాడిదలు] ఉష్ణధారలు కనుగొన్నాడు. [PE][PS]
ఆదికాండము 36 : 25 (IRVTE)
అనా కొడుకు దిషోను, కూతురు అహొలీబామా.
ఆదికాండము 36 : 26 (IRVTE)
దిషోను కొడుకులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను,
ఆదికాండము 36 : 27 (IRVTE)
ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను.
ఆదికాండము 36 : 28 (IRVTE)
దీషాను కొడుకులు ఊజు, అరాను. [PE][PS]
ఆదికాండము 36 : 29 (IRVTE)
హోరీయుల నాయకులు ఎవరంటే, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
ఆదికాండము 36 : 30 (IRVTE)
దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు. [PS]
ఆదికాండము 36 : 31 (IRVTE)
{ఎదోము రాజులు} (1దిన 1:43-54) [PS] ఇశ్రాయేలీయుల మీద ఏ రాజూ పరిపాలన చేయక ముందే, ఎదోమును పరిపాలించిన రాజులు ఎవరంటే,
ఆదికాండము 36 : 32 (IRVTE)
బెయోరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా.
ఆదికాండము 36 : 33 (IRVTE)
బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు రాజయ్యాడు.
ఆదికాండము 36 : 34 (IRVTE)
యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడు హుషాము రాజయ్యాడు.
ఆదికాండము 36 : 35 (IRVTE)
హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బదదు కొడుకు హదదు రాజయ్యాడు. అతని ఊరు అవీతు.
ఆదికాండము 36 : 36 (IRVTE)
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన శమ్లా రాజయ్యాడు. [PE][PS]
ఆదికాండము 36 : 37 (IRVTE)
శమ్లా చనిపోయిన తరువాత నదీతీర ప్రాంతమైన రహెబోతుకు చెందిన షావూలు రాజయ్యాడు.
ఆదికాండము 36 : 38 (IRVTE)
షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బయల్‌ హానాను రాజయ్యాడు.
ఆదికాండము 36 : 39 (IRVTE)
అక్బోరు కొడుకు బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదరు రాజయ్యాడు. అతని ఊరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు మనుమరాలు అయిన మత్రేదు కూతురు. [PE][PS]
ఆదికాండము 36 : 40 (IRVTE)
వారివారి తెగల ప్రకారం వారివారి ప్రాంతాల్లో వారివారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే, తిమ్నా, అల్వా, యతేతు,
ఆదికాండము 36 : 41 (IRVTE)
అహొలీబామా, ఏలా, పీనోను,
ఆదికాండము 36 : 42 (IRVTE)
కనజు, తేమాను, మిబ్సారు,
ఆదికాండము 36 : 43 (IRVTE)
మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమతమ నివాస స్థలాల ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: