ఆదికాండము 49 : 1 (IRVTE)
{యాకోబు తన కొడుకులపై పలికిన దీవెనలు} [PS] యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను. [QBR]
ఆదికాండము 49 : 2 (IRVTE)
యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. [PE][PS] మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి. [QBR]
ఆదికాండము 49 : 3 (IRVTE)
రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి, [QBR] నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి. [QBR]
ఆదికాండము 49 : 4 (IRVTE)
పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. [PE][PS] ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. [PE][PS] నువ్వు నా మంచం మీదికి ఎక్కావు. [QBR]
ఆదికాండము 49 : 5 (IRVTE)
షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు. [QBR]
ఆదికాండము 49 : 6 (IRVTE)
నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. [PE][PS] నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. [PE][PS] కోపంలో వారు మనుషులను చంపారు. [PE][PS] సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు. [QBR]
ఆదికాండము 49 : 7 (IRVTE)
వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. [PE][PS] అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. [PE][PS] ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను. [QBR]
ఆదికాండము 49 : 8 (IRVTE)
యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. [PE][PS] నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. [PE][PS] నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. [QBR]
ఆదికాండము 49 : 9 (IRVTE)
యూదా సింహం పిల్ల. [PE][PS] నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. [PE][PS] అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. [PE][PS] సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. [PE][PS] అతన్ని లేపడానికి తెగించేవాడెవడు? [QBR]
ఆదికాండము 49 : 10 (IRVTE)
షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. [PE][PS] అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. [PE][PS] రాజ్యాలు అతనికి లోబడతాయి. [QBR]
ఆదికాండము 49 : 11 (IRVTE)
ద్రాక్షావల్లికి తన గాడిదనూ, [QBR] మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, [QBR] ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు. [QBR]
ఆదికాండము 49 : 12 (IRVTE)
అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, [QBR] అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి. [QBR]
ఆదికాండము 49 : 13 (IRVTE)
జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. [PE][PS] అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. [PE][PS] అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది. [QBR]
ఆదికాండము 49 : 14 (IRVTE)
ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద. [QBR]
ఆదికాండము 49 : 15 (IRVTE)
అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు. [PE][PS] బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు. [QBR]
ఆదికాండము 49 : 16 (IRVTE)
దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా [QBR] తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. [QBR]
ఆదికాండము 49 : 17 (IRVTE)
దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, [QBR] రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు. [QBR]
ఆదికాండము 49 : 18 (IRVTE)
యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను. [QBR]
ఆదికాండము 49 : 19 (IRVTE)
దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. [QBR] అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు. [QBR]
ఆదికాండము 49 : 20 (IRVTE)
ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. [QBR] రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు. [QBR]
ఆదికాండము 49 : 21 (IRVTE)
నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. [QBR] అతనికి అందమైన పిల్లలుంటారు. [QBR]
ఆదికాండము 49 : 22 (IRVTE)
యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. [QBR] దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి. [QBR]
ఆదికాండము 49 : 23 (IRVTE)
విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. [QBR] అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు. [QBR]
ఆదికాండము 49 : 24 (IRVTE)
అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. [QBR] అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. [QBR] ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, [QBR] ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది. [QBR]
ఆదికాండము 49 : 25 (IRVTE)
నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన, [QBR] నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు, [QBR] కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి. [QBR]
ఆదికాండము 49 : 26 (IRVTE)
నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, [QBR] నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. [QBR] అవి యోసేపు తల మీద ఉంటాయి. [QBR] తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి. [QBR]
ఆదికాండము 49 : 27 (IRVTE)
బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. [QBR] అతడు ఉదయాన ఎరను మింగి, [QBR] దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.” యాకోబు మరణం, సమాధి [PE][PS]
ఆదికాండము 49 : 28 (IRVTE)
ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.
ఆదికాండము 49 : 29 (IRVTE)
తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను.
ఆదికాండము 49 : 30 (IRVTE)
హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు. [PE][PS]
ఆదికాండము 49 : 31 (IRVTE)
అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
ఆదికాండము 49 : 32 (IRVTE)
ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు.
ఆదికాండము 49 : 33 (IRVTE)
యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: