ఆదికాండము 5 : 1 (IRVTE)
ఆదాము సంతతి
1దిన 1:1-4
ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
ఆదికాండము 5 : 2 (IRVTE)
వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
ఆదికాండము 5 : 3 (IRVTE)
ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
ఆదికాండము 5 : 4 (IRVTE)
షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
ఆదికాండము 5 : 5 (IRVTE)
ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
ఆదికాండము 5 : 6 (IRVTE)
షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.
ఆదికాండము 5 : 7 (IRVTE)
ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
ఆదికాండము 5 : 8 (IRVTE)
షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
ఆదికాండము 5 : 9 (IRVTE)
ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
ఆదికాండము 5 : 10 (IRVTE)
కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
ఆదికాండము 5 : 11 (IRVTE)
ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
ఆదికాండము 5 : 12 (IRVTE)
కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
ఆదికాండము 5 : 13 (IRVTE)
మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
ఆదికాండము 5 : 14 (IRVTE)
కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
ఆదికాండము 5 : 15 (IRVTE)
మహలలేలుకు* అంటే దేవునికి స్తుతి అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.
ఆదికాండము 5 : 16 (IRVTE)
యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
ఆదికాండము 5 : 17 (IRVTE)
మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
ఆదికాండము 5 : 18 (IRVTE)
యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.
ఆదికాండము 5 : 19 (IRVTE)
హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
ఆదికాండము 5 : 20 (IRVTE)
యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.
ఆదికాండము 5 : 21 (IRVTE)
హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.
ఆదికాండము 5 : 22 (IRVTE)
మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
ఆదికాండము 5 : 23 (IRVTE)
హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
ఆదికాండము 5 : 24 (IRVTE)
హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
ఆదికాండము 5 : 25 (IRVTE)
మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
ఆదికాండము 5 : 26 (IRVTE)
మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
ఆదికాండము 5 : 27 (IRVTE)
మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
ఆదికాండము 5 : 28 (IRVTE)
లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.
ఆదికాండము 5 : 29 (IRVTE)
“భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
ఆదికాండము 5 : 30 (IRVTE)
లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
ఆదికాండము 5 : 31 (IRVTE)
లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
ఆదికాండము 5 : 32 (IRVTE)
ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32