హెబ్రీయులకు 3 : 1 (IRVTE)
కాబట్టి, పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులూ, పరిశుద్ధులూ అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపొస్తలుడూ, ప్రధాన యాజకుడూ అయిన యేసును గూర్చి ఆలోచించండి.
హెబ్రీయులకు 3 : 2 (IRVTE)
దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
హెబ్రీయులకు 3 : 3 (IRVTE)
మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయన యోగ్యుడిగా లెక్కలోకి వచ్చాడు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దాన్ని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం.
హెబ్రీయులకు 3 : 4 (IRVTE)
ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించిన వాడు దేవుడే.
హెబ్రీయులకు 3 : 5 (IRVTE)
దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు.
హెబ్రీయులకు 3 : 6 (IRVTE)
కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు. హెచ్చరిక. ఈజిప్టు విడిచి వచ్చిన తరం అపనమ్మకం వల్లనే కనాను విశ్రాంతిలోకి ప్రవేశించలేక పోయారు [PE][PS]
హెబ్రీయులకు 3 : 7 (IRVTE)
కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, [QBR] “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే [QBR]
హెబ్రీయులకు 3 : 8 (IRVTE)
అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు [QBR] తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా [QBR] మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. [QBR]
హెబ్రీయులకు 3 : 9 (IRVTE)
నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా [QBR] మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు. [QBR]
హెబ్రీయులకు 3 : 10 (IRVTE)
కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను. [QBR] కాబట్టి నేను కోపంతో ‘వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు. [PE][PS]
హెబ్రీయులకు 3 : 11 (IRVTE)
వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని కోపంగా శపథం చేశాను.” [PE][PS]
హెబ్రీయులకు 3 : 12 (IRVTE)
సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి.
హెబ్రీయులకు 3 : 13 (IRVTE)
పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి.
హెబ్రీయులకు 3 : 14 (IRVTE)
ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకూ ఆయనపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాం.
హెబ్రీయులకు 3 : 15 (IRVTE)
దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు. [QBR] “ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే, [QBR] ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు [QBR] మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.” [PE][PS]
హెబ్రీయులకు 3 : 16 (IRVTE)
దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? మోషే ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన వారే కదా!
హెబ్రీయులకు 3 : 17 (IRVTE)
దేవుడు నలభై ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా! వారి మృతదేహాలు అరణ్యంలో రాలి పోయాయి.
హెబ్రీయులకు 3 : 18 (IRVTE)
తనకు అవిధేయులైన వారిని గూర్చి కాకుంటే తన విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రమాణం చేశాడు?
హెబ్రీయులకు 3 : 19 (IRVTE)
దీన్నిబట్టి, అవిశ్వాసం మూలానే వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేక పోయారని మనం చూశాము. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: