హెబ్రీయులకు 8 : 1 (IRVTE)
ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు.
హెబ్రీయులకు 8 : 2 (IRVTE)
మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన సేవకుడుగా ఉన్నాడు. [PE][PS]
హెబ్రీయులకు 8 : 3 (IRVTE)
ప్రధాన యాజకుణ్ణి కానుకలూ, బలులూ అర్పించడానికి నియమిస్తారు. కాబట్టి అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి.
హెబ్రీయులకు 8 : 4 (IRVTE)
ఇప్పుడు క్రీస్తు భూమి మీదే ఉంటే యాజకుడిగా ఉండనే ఉండడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారున్నారు.
హెబ్రీయులకు 8 : 5 (IRVTE)
మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు, “పర్వతం పైన నీకు నేను చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి” అని దేవుడు హెచ్చరించాడు. కాబట్టి యాజకులు సేవ చేస్తున్న గుడారం పరలోకంలో ఉండే వాటికి నకలుగా, నీడగా ఉంది. [PS]
హెబ్రీయులకు 8 : 6 (IRVTE)
{క్రీస్తు మరింత శ్రేష్ఠమైన నిబంధనకు మధ్యవర్తి} [PS] కానీ ఇప్పుడు క్రీస్తు మరింత మేలైన పరిచర్యను పొందాడు. ఎందుకంటే శ్రేష్ఠమైన వాగ్దానాలపై ఏర్పడిన శ్రేష్ఠమైన ఒప్పందానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. [PS]
హెబ్రీయులకు 8 : 7 (IRVTE)
{కొత్త నిబంధన పాత నిబంధన కన్నా శ్రేష్ఠమైనది} [PS] ఎందుకంటే మొదటి ఒప్పందం లోపం లేనిదైతే రెండవ ఒప్పందానికి అవకాశం ఉండదు.
హెబ్రీయులకు 8 : 8 (IRVTE)
ప్రజల్లో దోషాలు కనిపించినప్పుడు దేవుడు ఇలా అన్నాడు, [QBR] “చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో [QBR] నేను కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి. [QBR]
హెబ్రీయులకు 8 : 9 (IRVTE)
ఐగుప్తు దేశం నుండి వారి పూర్వీకులను చెయ్యి పట్టుకుని [QBR] బయటకు రప్పించిన రోజున వారితో నేను చేసిన ఒప్పందం వంటిది కాదిది. [QBR] ఎందుకంటే వారు ఆ ఒప్పందంలో కొనసాగలేదు. [QBR] నేనూ ఇక వారిమీద మనసు పెట్టడం మానేశాను.”
హెబ్రీయులకు 8 : 10 (IRVTE)
ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, [QBR] “ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది. [QBR] వారి మనసుల్లో నా శాసనాలు ఉంచుతాను. [QBR] అలాగే వారి హృదయాలపై వాటిని రాస్తాను. [QBR] నేను వారి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు. [QBR]
హెబ్రీయులకు 8 : 11 (IRVTE)
‘ప్రభువును తెలుసుకో’ అంటూ వారిలో ఎవడూ తన ఇరుగు పొరుగు వాళ్లకి గానీ [QBR] తన సోదరునికి గానీ ఉపదేశం చేయడు. [QBR] ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుండి గొప్పవాడి వరకూ [QBR] అందరూ నన్ను తెలుసుకుంటారు. [QBR]
హెబ్రీయులకు 8 : 12 (IRVTE)
నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను. [QBR] వారి పాపాలను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.” [PE][PS]
హెబ్రీయులకు 8 : 13 (IRVTE)
ఆయన ‘కొత్త ఒప్పందం’ అని చెప్పడం వల్ల, మొదటి ఒప్పందాన్ని పాతదిగా చేశాడు. దేన్నైతే ఆయన పాతది అని ప్రకటించాడో అది మాసిపోవడానికి సిద్ధంగా ఉంది. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: