హొషేయ 12 : 2 (IRVTE)
ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. తూర్పు గాలి వెంట పరిగెడుతున్నాడు. మానక అబద్ధమాడుతూ బలాత్కారం చేస్తున్నాడు. ప్రజలు అష్షూరీయులతో సంధి చేస్తారు. ఐగుప్తునకు ఒలీవనూనె పంపిస్తారు.
హొషేయ 12 : 3 (IRVTE)
యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు. యాకోబు సంతతి వారు చేసిన దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు.
హొషేయ 12 : 4 (IRVTE)
తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు* అది. 25:26 .
హొషేయ 12 : 5 (IRVTE)
అతడు దూతతో పోరాడి గెలిచాడు. అతడు కన్నీటితో అతని అనుగ్రహానికై బతిమాలాడు. బేతేలులో అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ ఆయన అతనితో మాట్లాడాడు† అది. 32:22-28 .
హొషేయ 12 : 6 (IRVTE)
ఈయన యెహోవా, సేనల ప్రభువు. “యెహోవా” అని ఆయన్ను పిలవాలి.
హొషేయ 12 : 7 (IRVTE)
కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగాలి. నిబంధన నమ్మకత్వాన్ని, న్యాయాన్ని అనుసరించు. నీ దేవుని కోసం ఎడతెగక కనిపెట్టు.
హొషేయ 12 : 8 (IRVTE)
కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు. దగా చెయ్యడమే వారికి ఇష్టం.
హొషేయ 12 : 9 (IRVTE)
“నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది. నేను సంపాదించుకున్న దానిలో దేనిని బట్టీ శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరూ చూపలేరు” అని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు.
హొషేయ 12 : 10 (IRVTE)
“అయితే ఐగుప్తుదేశంలో నుండి మీరు వచ్చినది మొదలు యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. నియామక దినాల్లో మీరు డేరాల్లో కాపురమున్నట్టు నేను మళ్లీ మిమ్మల్ని డేరాల్లో నివసింపజేస్తాను.
హొషేయ 12 : 11 (IRVTE)
ప్రవక్తలతో నేను మాటలాడాను. విస్తారమైన దర్శనాలు నేనిచ్చాను. ఉపమానరీతిగా అనేకసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడాను.
హొషేయ 12 : 12 (IRVTE)
గిలాదులో దుర్మార్గం ఉన్నట్టయితే, అక్కడి ప్రజలు పనికిమాలిన వారు. గిల్గాలులో ప్రజలు ఎడ్లను బలులుగా అర్పిస్తారు. వారి బలిపీఠాలు దున్నిన చేని చాళ్ళపై ఉన్న రాళ్లకుప్పల్లాగా ఉన్నాయి.
హొషేయ 12 : 13 (IRVTE)
యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి వెళ్లిపోయాడు. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాడు. భార్య కావాలని అతడు గొర్రెలు కాచాడు.
హొషేయ 12 : 14 (IRVTE)
ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు. ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు. ఎఫ్రాయిము యెహోవాకు ఘోరమైన కోపం పుట్టించాడు. కాబట్టి అతని యజమాని అతని మీద రక్తాపరాధం మోపుతాడు. అతని సిగ్గులేని పనులను బట్టి అతన్ని అవమానపరుస్తాను.”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14