యెషయా గ్రంథము 42 : 1 (IRVTE)
{#1యెహోవా సేవకులు } [QS]ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు. [QE][QS]ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు. [QE]
యెషయా గ్రంథము 42 : 2 (IRVTE)
[QS]ఆయన కేకలు వేయడు, అరవడు. ఆయన స్వరం వీధుల్లో వినబడదు. [QE]
యెషయా గ్రంథము 42 : 3 (IRVTE)
[QS]నలిగిన రెల్లును ఆయన విరవడు. రెపరెపలాడుతున్న వత్తిని ఆర్పడు. [QE][QS]ఆయన న్యాయాన్ని నమ్మకంగా అమలుచేస్తాడు. [QE]
యెషయా గ్రంథము 42 : 4 (IRVTE)
[QS]భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకూ ఆయన అలసిపోడు, నిరాశ చెందడు. [QE][QS]సముద్ర ద్వీపాలు అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తాయి. [QE]
యెషయా గ్రంథము 42 : 5 (IRVTE)
[QS]ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి, [QE][QS]దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, [QE]
యెషయా గ్రంథము 42 : 6 (IRVTE)
[QS]“గుడ్డివారి కళ్ళు తెరవడానికీ బందీలను చెరలో నుండి బయటికి తేవడానికీ చీకటి గుహల్లో నివసించే వారిని వెలుగులోకి తేవడానికీ ఆయన వస్తాడు. [QE]
యెషయా గ్రంథము 42 : 7 (IRVTE)
[QS]యెహోవా అనే నేనే నీతి గురించి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను. [QE][QS]నిన్ను నిలబెట్టి ప్రజలకు ఒక నిబంధనగా యూదేతర జాతులకు వెలుగుగా నియమించాను. [QE]
యెషయా గ్రంథము 42 : 8 (IRVTE)
[QS]నేనే యెహోవాను. నా పేరు ఇదే. నా మహిమను మరెవరితోనూ పంచుకోను. నాకు చెందాల్సిన ఘనతను విగ్రహాలకు చెందనియ్యను. [QE]
యెషయా గ్రంథము 42 : 9 (IRVTE)
[QS]గతంలో చెప్పిన విషయాలు జరిగాయి కదా, ఇదిగో కొత్త సంగతులు మీకు చెబుతున్నాను. అవి జరగక ముందే వాటిని మీకు వెల్లడి చేస్తున్నాను.” [QE]
యెషయా గ్రంథము 42 : 10 (IRVTE)
[QS]సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి. [QE][QS]భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి. [QE]
యెషయా గ్రంథము 42 : 11 (IRVTE)
[QS]ఎడారీ, పట్టణాలూ, కేదారు ప్రాంతంలోని గ్రామాలూ సంతోషంతో కేకలు వేస్తాయి. [QE][QS]సెల ప్రాంతవాసులు పాటలు పాడతారు. పర్వతశిఖరాల నుండి వారు కేకలు వేస్తారు. [QE]
యెషయా గ్రంథము 42 : 12 (IRVTE)
[QS]ద్వీపాల్లో వారు యెహోవా మహిమా ప్రభావాలు గలవాడని కొనియాడతారు. [QE]
యెషయా గ్రంథము 42 : 13 (IRVTE)
[QS]యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. [QE][QS]తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు. [QE]
యెషయా గ్రంథము 42 : 14 (IRVTE)
[QS]చాలాకాలం నుండి నేను మౌనంగా ఉన్నాను. నన్ను నేను అణచుకుంటూ మాట్లాడకుండా ఉన్నాను. [QE][QS]ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలాగా నేను బలవంతంగా ఊపిరి తీస్తూ ఒగరుస్తూ ఉన్నాను. [QE]
యెషయా గ్రంథము 42 : 15 (IRVTE)
[QS]పర్వతాలూ కొండలూ పాడైపోయేలా, వాటి మీద ఉన్న చెట్లన్నిటినీ ఎండిపోయేలా చేస్తాను. [QE][QS]నదులను ద్వీపాలుగా మారుస్తాను. నీటి మడుగులు ఆరిపోయేలా చేస్తాను. [QE]
యెషయా గ్రంథము 42 : 16 (IRVTE)
[QS]గుడ్డివారిని వారికి తెలియని దారిలో తీసుకువస్తాను. వారు నడవని మార్గాల్లో వారిని నడిపిస్తాను. [QE][QS]వారి చీకటిని వెలుగుగా, వంకరదారులను తిన్నగా చేస్తాను. ఈ పనులన్నీ నేను చేస్తాను. వారిని నేను విడిచిపెట్టను. [QE]
యెషయా గ్రంథము 42 : 17 (IRVTE)
[QS]చెక్కిన విగ్రహాలపై నమ్మకముంచి, పోతవిగ్రహాలతో, “మీరే మా దేవుళ్ళు” అని చెప్పేవారు వెనక్కి మళ్ళి సిగ్గు పడతారు. [QE]
యెషయా గ్రంథము 42 : 18 (IRVTE)
{#1ఇశ్రాయేలకు గ్రుడ్డితనం, చెవిటితనం } [QS]చెవిటివారు వినండి, గుడ్డివారు మీరు గ్రహించగలిగేలా చూడండి. [QE]
యెషయా గ్రంథము 42 : 19 (IRVTE)
[QS]నా సేవకుడు తప్ప గుడ్డివాడు మరెవడు? నేను పంపిన నా దూత తప్ప చెవిటివాడు మరెవడు? నాతో నిబంధనలో ఉన్నవానికంటే, యెహోవా సేవకుని కంటే గుడ్డివాడు ఎవడు? [QE]
యెషయా గ్రంథము 42 : 20 (IRVTE)
[QS]నువ్వు చాలా విషయాలు చూస్తున్నావు గానీ గ్రహించలేకపోతున్నావు. చెవులు తెరిచే ఉన్నాయి గానీ వినడం లేదు. [QE]
యెషయా గ్రంథము 42 : 21 (IRVTE)
[QS]యెహోవా తన నీతికీ తన ధర్మశాస్త్రానికీ ఘనతామహిమలు కలగడంలో సంతోషించాడు. [QE]
యెషయా గ్రంథము 42 : 22 (IRVTE)
[QS]అయితే ఈ ప్రజలు దోపిడీకి గురయ్యారు. వారంతా గుహల్లో చిక్కుకుపోయారు, వారిని బంధకాల్లో ఉంచారు. [QE][QS]వారు దోపుడు పాలైనప్పుడు వారినెవరూ విడిపించలేదు. అపహరణకు గురైనప్పుడు “వారిని తిరిగి తీసుకురండి” అని ఎవరూ చెప్పలేదు. [QE]
యెషయా గ్రంథము 42 : 23 (IRVTE)
[QS]మీలో దీన్ని ఎవడు వింటాడు? భవిష్యత్తులోనైనా ఎవడు ఆలకించి వింటాడు? [QE]
యెషయా గ్రంథము 42 : 24 (IRVTE)
[QS]వారు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మార్గాల్లో నడుచుకోలేదు. ఆయన ఉపదేశాన్ని తిరస్కరించారు. అందుకు యెహోవాయే యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించాడు. ఇశ్రాయేలును దోచుకునేవారికి అప్పగించాడు. [QE]
యెషయా గ్రంథము 42 : 25 (IRVTE)
[QS]దాని కారణంగానే ఆయన వారిమీద తన కోపాగ్నినీ యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించాడు. [QE][QS]అది వారి చుట్టూ అగ్నిని రాజబెట్టింది గానీ వారు గ్రహించలేదు. అది వారిని కాల్చింది గానీ వారు దాన్ని పట్టించుకోలేదు. [QE]
❮
❯