యెషయా గ్రంథము 60 : 1 (IRVTE)
{సీయోను పై ఉదయించిన మహిమ} [PS] లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. [QBR]
యెషయా గ్రంథము 60 : 2 (IRVTE)
భూమిని చీకటి కమ్మినా కటిక చీకటి రాజ్యాలను కమ్మినా యెహోవా నీ మీద ఉదయిస్తాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. [QBR]
యెషయా గ్రంథము 60 : 3 (IRVTE)
రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. [QBR]
యెషయా గ్రంథము 60 : 4 (IRVTE)
తలెత్తి చుట్టూ చూడు. వీళ్ళంతా మూకుమ్మడిగా నీ దగ్గరికి వస్తున్నారు. నీ కొడుకులు దూరంనుంచి వస్తారు. నీ కూతుళ్ళు చంకనెక్కి వస్తున్నారు. [QBR]
యెషయా గ్రంథము 60 : 5 (IRVTE)
నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ హృదయం ఆనందిస్తూ ఉప్పొంగుతుంది. సముద్ర సమృద్ధి నీ మీద కుమ్మరించడం జరుగుతుంది. రాజ్యాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. [QBR]
యెషయా గ్రంథము 60 : 6 (IRVTE)
ఒంటెల గుంపులూ మిద్యాను ఏఫాల నుంచి వచ్చిన పిల్ల ఒంటెలూ నీ దేశమంతటా వ్యాపిస్తాయి. వారంతా షేబ నుంచి వస్తారు. బంగారం, ధూపద్రవ్యం తీసుకువస్తారు. యెహోవా కీర్తిని ప్రకటిస్తూ ఉంటారు. [QBR]
యెషయా గ్రంథము 60 : 7 (IRVTE)
నీ కోసం కేదారు గొర్రెమందలన్నీ సమకూడతాయి. నెబాయోతు పొట్లేళ్లు నీ సేవలో ఉపయోగపడతాయి. అవి నా బలిపీఠం మీద బలులుగా అంగీకారమవుతాయి. నా గొప్ప మందిరాన్ని నేను అందంగా అలంకరిస్తాను. [QBR]
యెషయా గ్రంథము 60 : 8 (IRVTE)
మబ్బులాగా గువ్వలలాగా తమ గూటికి ఎగిరి వచ్చే వీళ్ళెవరు? [QBR]
యెషయా గ్రంథము 60 : 9 (IRVTE)
నీ దేవుడు యెహోవా పేరునుబట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరును బట్టి ఆయన నిన్ను ఘనపర్చాడు, [QBR] కాబట్టి నీ కొడుకులను, తమ వెండి బంగారాలను తీసుకురావడానికి, [QBR] ద్వీపవాసులు నా కోసం చూస్తారు. తర్షీషు ఓడలు మొదట వస్తాయి. [QBR]
యెషయా గ్రంథము 60 : 10 (IRVTE)
విదేశీయులు నీ గోడలు కడతారు. వారి రాజులు నీకు సేవ చేస్తారు. [QBR] ఎందుకంటే నేను ఆగ్రహంతో నిన్ను కొట్టినా అనుగ్రహంతో నీ మీద జాలిపడతాను. [QBR]
యెషయా గ్రంథము 60 : 11 (IRVTE)
రాజ్యాల సంపద నీదగ్గరికి తెచ్చేలా నీ ద్వారం తలుపులు రాత్రింబగళ్లు మూసివేయడం జరగదు. [QBR] ఆ ప్రజల ఊరేగింపులో వారి రాజులు ఉంటారు. [QBR]
యెషయా గ్రంథము 60 : 12 (IRVTE)
నిన్ను సేవించడానికి నిరాకరించే ప్రజలు గానీ రాజ్యం గానీ నాశనం అవుతుంది. ఆ రాజ్యాలు తప్పకుండా నాశనం అవుతాయి. [QBR]
యెషయా గ్రంథము 60 : 13 (IRVTE)
నా పరిశుద్ధాలయపు అలంకారం కోసం లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షాలూ సరళవృక్షాలూ గొంజిచెట్లూ నీ దగ్గరికి తెస్తారు. [QBR] నేను నా పాదాలు పెట్టుకునే స్థలాన్ని ఘనంగా చేస్తాను. [QBR]
యెషయా గ్రంథము 60 : 14 (IRVTE)
నిన్ను బాధించినవారి కొడుకులు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించినవారంతా వచ్చి నీ పాదాల మీద పడతారు. [QBR] యెహోవా పట్టణం అనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అనీ నీకు పేరు పెడతారు. [QBR]
యెషయా గ్రంథము 60 : 15 (IRVTE)
నిన్ను విడిచి పెట్టకుండా ఎవరూ నిన్ను ద్వేషించకుండా నీ ద్వారా ఎవరూ వెళ్ళకుండా ఉండడానికి బదులు [QBR] నిన్ను ఎప్పటికీ హుందాగా ఉండేలా తరతరాలకు సంతోష కారణంగా చేస్తాను. [QBR]
యెషయా గ్రంథము 60 : 16 (IRVTE)
రాజ్యాల పాలుకూడా నువ్వు తాగుతావు. రాజుల చనుపాలు తాగుతావు. [QBR] యెహోవానైన నేను నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడైన దేవుడిననీ నీ విమోచకుడిననీ నువ్వు తెలుసుకుంటావు. [QBR]
యెషయా గ్రంథము 60 : 17 (IRVTE)
నేను కంచుకు బదులు బంగారాన్నీ ఇనుముకు బదులు వెండినీ [QBR] చెక్కకు బదులు ఇత్తడినీ రాళ్ళకు బదులు ఇనుమునూ తెస్తాను. శాంతిని నీకు అధికారులుగా న్యాయాన్ని నీకు పరిపాలకులుగా నియమిస్తాను. [QBR]
యెషయా గ్రంథము 60 : 18 (IRVTE)
ఇకనుంచి నీ దేశంలో దుర్మార్గం అనే మాట వినబడదు. నీ సరిహద్దుల్లో నాశనం, ధ్వంసం అనే మాటలు వినబడవు. [QBR] నీ గోడలను విడుదల అనీ నీ ద్వారాలను స్తుతి అనీ అంటావు. [QBR]
యెషయా గ్రంథము 60 : 19 (IRVTE)
ఇక మీదట పగటివేళ సూర్య కాంతి నీకు వెలుగుగా ఉండదు. [QBR] వెన్నెల నీ మీద ప్రకాశింపదు. [QBR] యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దేవుడు నీకు శోభ. [QBR]
యెషయా గ్రంథము 60 : 20 (IRVTE)
నీ సూర్యుడు ఇక ఎన్నటికీ అస్తమించడు. నీ వెన్నెల తగ్గదు. [QBR] యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దుఃఖదినాలు అంతం అవుతాయి. [QBR]
యెషయా గ్రంథము 60 : 21 (IRVTE)
నీ ప్రజలంతా నీతిమంతులుగా ఉంటారు. దేశం ఎప్పటికీ వారి స్వాధీనంలో ఉంటుంది. [QBR] వారు నా ఘనత కోసం నేను నాటిన కొమ్మ. నేను చేసిన పని. [QBR]
యెషయా గ్రంథము 60 : 22 (IRVTE)
అల్పుడు వేయిమంది అవుతాడు. చిన్నవాడు బలమైన జనం అవుతాడు. [QBR] నేను యెహోవాను. తగిన కాలంలో వీటిని త్వరగా జరిగిస్తాను. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: