యెషయా గ్రంథము 62 : 1 (IRVTE)
{సీయోను పునరుద్ధరణ} [PS] సీయోను నీతి, సూర్యకాంతిలా కనబడే వరకూ దాని రక్షణ, దీపాలుగా వెలిగే వరకూ [QBR] సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము కోసం నేను ఊరుకోను. [QBR]
యెషయా గ్రంథము 62 : 2 (IRVTE)
రాజ్యాలు నీ నీతి చూస్తారు. రాజులంతా నీ మహిమను చూస్తారు. [QBR] యెహోవా కోరే కొత్త పేరు నీకు పెడతారు. [QBR]
యెషయా గ్రంథము 62 : 3 (IRVTE)
నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు. [QBR]
యెషయా గ్రంథము 62 : 4 (IRVTE)
నిన్ను ఇంకెప్పుడూ “విడువబడిన దానివి” అనీ, నీ దేశాన్ని “పాడైపోయినది” అనీ ఇక అనరు. [QBR] దాని బదులు నిన్ను “ప్రియమైనది [* ప్రియమైనది హెప్సీబా] ” అనీ, నీ దేశాన్ని “కళ్యాణి [† కళ్యాణి బ్యూలా] ” అనీ అంటారు. [QBR] ఎందుకంటే యెహోవా నిన్నుబట్టి ఆనందిస్తున్నాడు. నీ దేశానికి వివాహం జరుగుతుంది. [QBR]
యెషయా గ్రంథము 62 : 5 (IRVTE)
యువకుడు ఒక యువతిని పెళ్లిచేసుకున్నట్టు నీ కొడుకులు [‡ నీ కొడుకులు నీ సృష్టికర్త ] నిన్ను పెళ్లి చేసుకుంటారు. [QBR] పెళ్ళికొడుకు తన పెళ్ళికూతురుతో సంతోషించేలా నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు. [QBR]
యెషయా గ్రంథము 62 : 6 (IRVTE)
యెరూషలేమా, నీ గోడలమీద నేను కావలి వారిని ఉంచాను. [QBR] రాత్రి పగలూ వారు మౌనంగా ఉండరు. [QBR] యెహోవాకు గుర్తుచేస్తూ ఉండే మీరు విరామం తీసుకోవద్దు. [QBR]
యెషయా గ్రంథము 62 : 7 (IRVTE)
ఆయన యెరూషలేమును సుస్థిరం చేసే వరకు [QBR] లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించే వరకు ఆయన్ని వదలొద్దు. [QBR]
యెషయా గ్రంథము 62 : 8 (IRVTE)
తన కుడి చెయ్యి తోడనీ తన బలమైన హస్తం తోడనీ యెహోవా ఇలా ప్రమాణం చేశాడు, [QBR] “నేను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా ఇక ఎన్నడూ ఇవ్వను. నువ్వు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు తాగరు. [QBR]
యెషయా గ్రంథము 62 : 9 (IRVTE)
కోత కోసినవాళ్ళే దాన్ని తింటారు. యెహోవాను స్తుతిస్తారు. [QBR] ద్రాక్ష పళ్ళు కోసినవాళ్ళే నా పవిత్రాలయ ఆవరణాల్లో దాని రసం తాగుతారు.” [QBR]
యెషయా గ్రంథము 62 : 10 (IRVTE)
ద్వారాల గుండా రండి! రండి! ప్రజలకు దారి సిద్ధం చేయండి! [QBR] జాతీయ మార్గాన్ని కట్టండి! రాళ్ళు ఏరి పారవేయండి! [QBR] రాజ్యాల కోసం జండా సూచన ఎత్తండి! [QBR]
యెషయా గ్రంథము 62 : 11 (IRVTE)
వినండి. ప్రపంచమంతటికీ యెహోవా తెలియచేశాడు. [QBR] “సీయోను ఆడపడుచుతో ఇలా చెప్పండి. ఇదిగో, నీ రక్షకుడు వస్తున్నాడు! [QBR] ఇదిగో, ఆయన బహుమానం ఆయన దగ్గర ఉంది. తానిచ్చే జీతం ఆయన తీసుకు వస్తున్నాడు.” [QBR]
యెషయా గ్రంథము 62 : 12 (IRVTE)
“పరిశుద్ధప్రజలు” “యెహోవా విమోచించిన వారు” అని వీళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. “కోరతగినది” అనీ “తిరస్కారానికి గురి కాని పట్టణం” అనీ నిన్ను పిలుస్తారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: