యిర్మీయా 20 : 1 (IRVTE)
ఇమ్మేరు కొడుకు పషూరు యాజకుడు. యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు. యిర్మీయా ఆ ప్రవచనాలను పలుకుతుంటే విన్నాడు. [PE][PS]
యిర్మీయా 20 : 2 (IRVTE)
కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు. [PE][PS]
యిర్మీయా 20 : 3 (IRVTE)
మరుసటి రోజు పషూరు యిర్మీయాను బొండ నుంచి బయటకు రప్పించాడు. అప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు. “యెహోవా నీకు పషూరు అని పేరు పెట్టడు. ‘మాగోర్ మిస్సాబీబ్‌ [* మాగోర్ మిస్సాబీబ్‌ నలుదిక్కులా భయం] ’ అని పెడతాడు.” [QBR]
యిర్మీయా 20 : 4 (IRVTE)
యెహోవా ఈ మాట చెబుతున్నాడు. “నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు. [QBR]
యిర్మీయా 20 : 5 (IRVTE)
ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు. [QBR]
యిర్మీయా 20 : 6 (IRVTE)
పషూరు! నువ్వూ నీ ఇంట్లో నివాసముంటున్న వాళ్ళంతా బందీలుగా పోతారు. నువ్వు బబులోను వెళ్లి అక్కడే చస్తావు. నీ ప్రవచనాలతో నువ్వు మోసపుచ్చిన నీ స్నేహితులందరినీ బబులోనులో పాతిపెడతారు.
యిర్మీయా 20 : 7 (IRVTE)
{యిర్మీయా ఫిర్యాదు} [PS] యెహోవా, నువ్వు నన్ను ప్రేరేపించావు. నీ ప్రేరేపణకు నేను లొంగిపోయాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. [QBR]
యిర్మీయా 20 : 8 (IRVTE)
ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ ‘దుర్మార్గం, నాశనం’ అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది. [QBR]
యిర్మీయా 20 : 9 (IRVTE)
‘ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను’ అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు. [QBR]
యిర్మీయా 20 : 10 (IRVTE)
చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు. [QBR]
యిర్మీయా 20 : 11 (IRVTE)
అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది. [QBR]
యిర్మీయా 20 : 12 (IRVTE)
సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు. [QBR]
యిర్మీయా 20 : 13 (IRVTE)
యెహోవాకు పాట పాడండి! యెహోవాను స్తుతించండి! దుర్మార్గుల చేతిలోనుంచి అణగారిన వారి ప్రాణాన్ని ఆయన తప్పించాడు. [QBR]
యిర్మీయా 20 : 14 (IRVTE)
నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక. [QBR]
యిర్మీయా 20 : 15 (IRVTE)
‘నీకు బాబు పుట్టాడు’ అని నా తండ్రికి కబురు తెచ్చి అతనికి ఆనందం తెచ్చినవాడు శాపానికి గురి అవుతాడు గాక. [QBR]
యిర్మీయా 20 : 16 (IRVTE)
ఏమీ జాలి లేక యెహోవా నాశనం చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక! ఉదయాన ఆర్త ధ్వనినీ మధ్యాహ్నం యుద్ధ ధ్వనినీ అతడు వినుగాక! [QBR]
యిర్మీయా 20 : 17 (IRVTE)
యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు. [QBR]
యిర్మీయా 20 : 18 (IRVTE)
కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: