యిర్మీయా 22 : 1 (IRVTE)
{దుష్ట రాజుల శ్రమ} [PS] యెహోవా ఇలా చెబుతున్నాడు “నువ్వు యూదా రాజు రాజనగరుకు వెళ్లి అక్కడ ఈ మాట ప్రకటించు. [QBR]
యిర్మీయా 22 : 2 (IRVTE)
‘దావీదు సింహాసనం మీద కూర్చున్న యూదా రాజా, నువ్వూ, ఈ ద్వారాలగుండా ప్రవేశించే నీ సిబ్బందీ, నీ ప్రజలూ యెహోవా మాట వినండి.’ [QBR]
యిర్మీయా 22 : 3 (IRVTE)
యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘మీరు నీతి న్యాయాలను అనుసరించి ప్రవర్తించండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. విదేశీయులనూ తండ్రిలేని వారినీ విధవరాళ్ళనూ బాధించవద్దు. వాళ్ళ మీద హింసాకాండ చేయవద్దు. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందింపవద్దు. [QBR]
యిర్మీయా 22 : 4 (IRVTE)
మీరు వీటిని జాగ్రత్తగా పాటిస్తే, దావీదు సింహాసనం మీద కూర్చునే రాజులు రథాలూ గుర్రాలూ ఎక్కి ఈ పట్టణ ద్వారాలగుండా ప్రవేశిస్తారు. వారి వెంట వారి సిబ్బందీ వారి ప్రజలూ వస్తారు. [QBR]
యిర్మీయా 22 : 5 (IRVTE)
మీరు ఈ మాటలు వినకపోతే ఈ పట్టణం పాడైపోతుంది.’ ఇది యెహోవా వాక్కు.” [QBR]
యిర్మీయా 22 : 6 (IRVTE)
యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. “నాకు నువ్వు గిలాదులాగా ఉన్నావు, లెబానోను పర్వత శిఖరంలాగా ఉన్నావు. అయినా నిన్ను ఎడారిగా నివాసులు లేని పట్టణంగా చేస్తాను. [QBR]
యిర్మీయా 22 : 7 (IRVTE)
నీ మీదికి రావడానికి నాశనం చేసేవాళ్ళను ఎన్నుకున్నాను. తమ ఆయుధాలను పట్టుకుని వాళ్ళు వస్తారు. నీ మంచి దేవదారు మ్రానులను నరికేసి మంటల్లో కాల్చివేస్తారు.” [QBR]
యిర్మీయా 22 : 8 (IRVTE)
అనేక దేశాలవాళ్ళు ఈ పట్టణపు దారిలో నడుస్తారు. “ఈ గొప్ప పట్టణాన్ని యెహోవా ఎందుకు ఇలా చేశాడు?” అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. [QBR]
యిర్మీయా 22 : 9 (IRVTE)
“ఎందుకంటే వాళ్ళు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి ఇతర దేవుళ్ళను పూజించి వాటికి మొక్కారు” అని జవాబు చెప్పుకుంటారు. [QBR]
యిర్మీయా 22 : 10 (IRVTE)
చనిపోయిన వాళ్ళను గురించి ఏడవవద్దు, వాళ్ళ గురించి అంగలార్చవద్దు. బందీలుగా వెళ్లిపోతున్నవాళ్ళ గురించి మీరు తప్పకుండా ఏడవాలి. ఎందుకంటే వాళ్ళు ఇక ఎన్నటికీ తిరిగిరారు. తమ జన్మభూమిని ఇక చూడరు. [QBR]
యిర్మీయా 22 : 11 (IRVTE)
తన తండ్రి యోషీయాకు బదులు పరిపాలన చేసి, ఈ స్థలంలోనుంచి వెళ్లిపోయిన యూదా రాజు యోషీయా కొడుకు షల్లూము గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. “అతడు ఇక్కడికి ఎప్పటికీ తిరిగి రాడు. [QBR]
యిర్మీయా 22 : 12 (IRVTE)
ఈ దేశాన్ని ఇంకెప్పుడూ అతడు చూడడు. వారు అతణ్ణి బందీగా తీసుకుపోయిన స్థలంలోనే అతడు చస్తాడు.” [QBR]
యిర్మీయా 22 : 13 (IRVTE)
అక్రమంగా తన ఇంటినీ, అన్యాయంగా తన మేడగదులనూ కట్టించుకునే వాడికి బాధ. జీతమివ్వకుండా తన పొరుగువాడి చేత ఊరికే పని చేయించుకునే వాడికి బాధ. [QBR]
యిర్మీయా 22 : 14 (IRVTE)
“నేను విశాలమైన మేడ గదులున్న పెద్ద ఇంటిని కట్టించుకుంటాను, అనుకునే వాళ్లకు బాధ. అతడు పెద్ద పెద్ద కిటికీలు చేయించుకుని దేవదారు పలకలతో పొదిగి, ఎర్ర రంగుతో అలంకరిస్తాడు.” [QBR]
యిర్మీయా 22 : 15 (IRVTE)
నువ్వు దేవదారు పలకల ఇంటిని కట్టించుకుని రాజువవుతావా? నీ తండ్రి కూడా తింటూ తాగుతూ నీతిన్యాయాలను అనుసరించలేదా? అప్పుడు అతడు బాగానే ఉన్నాడు. [QBR]
యిర్మీయా 22 : 16 (IRVTE)
అతడు పేదలకూ అక్కరలో ఉన్నవారికీ న్యాయం జరిగిస్తూ సుఖంగా బతికాడు. అలా చేయడమే నన్ను తెలుసుకోవడం కాదా? ఇది యెహోవా వాక్కు. [QBR]
యిర్మీయా 22 : 17 (IRVTE)
అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది. [QBR]
యిర్మీయా 22 : 18 (IRVTE)
కాబట్టి యోషీయా కొడుకు యెహోయాకీము అనే యూదా రాజు గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రజలు, అయ్యో నా సోదరా! అయ్యో నా సోదరీ” అని అతని గురించి ఏడవరు. “అయ్యో, యజమానీ! అయ్యో, ఘనుడా” అని అతని కోసం ఏడవరు. [QBR]
యిర్మీయా 22 : 19 (IRVTE)
అతణ్ణి యెరూషలేము ద్వారాల బయటికి ఈడ్చుకుపోయి అక్కడ పారేసి, గాడిదను పాతిపెట్టినట్టు పాతిపెడతారు. [QBR]
యిర్మీయా 22 : 20 (IRVTE)
లెబానోను పర్వతాలు ఎక్కి కేకలు వెయ్యి. బాషానులో నీ గొంతు పెద్దది చెయ్యి. అబారీము పర్వతాలనుంచి కేకలు వెయ్యి. ఎందుకంటే నీ స్నేహితులంతా నాశనమవుతారు. [QBR]
యిర్మీయా 22 : 21 (IRVTE)
నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడాను. అయితే “నేను వినను” అని నువ్వన్నావు. చిన్నప్పటినుంచి నువ్వు నా మాట వినకుండా ఉండడం నీకు అలవాటే. [QBR]
యిర్మీయా 22 : 22 (IRVTE)
నీ కాపరులంతా గాలికి కొట్టుకుపోతారు. నీ స్నేహితులంతా బందీలుగా వెళ్ళిపోతారు. అప్పుడు నీ దుర్మార్గమంతటి బట్టి నువ్వు కచ్చితంగా అవమానం పొంది సిగ్గుపడతావు. [QBR]
యిర్మీయా 22 : 23 (IRVTE)
రాజువైన నువ్వు, లెబానోను అడవిలోని ఇంటిలో నివసిస్తున్న నువ్వు, దేవదారు వృక్షాల్లో గూడు కట్టుకున్నా, ప్రసవిస్తూ ఉన్న స్త్రీకి కలిగే వేదనల్లాటివి నీకు కలుగుతాయి. నువ్వెంత మూలుగుతావో! [QBR]
యిర్మీయా 22 : 24 (IRVTE)
యెహోవా చెప్పేదేమిటంటే. “యూదా రాజు యెహోయాకీము కొడుకు యెహోయాకీను నా కుడి చేతికి రాజముద్రగా ఉన్నా అక్కడ నుంచి నిన్ను పెరికివేస్తాను. [QBR]
యిర్మీయా 22 : 25 (IRVTE)
నీ ప్రాణం తీయడానికి చూస్తున్న వారి చేతికి, నువ్వు భయపడుతున్న బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగిస్తాను. [QBR]
యిర్మీయా 22 : 26 (IRVTE)
నిన్నూ, నిన్ను కన్న మీ అమ్మనూ మీ జన్మభూమి కాని వేరే దేశంలోకి విసిరివేస్తాను. మీరు అక్కడే చస్తారు. [QBR]
యిర్మీయా 22 : 27 (IRVTE)
వాళ్ళు తిరిగి రావాలని ఎంతో ఆశపడే దేశానికి వాళ్ళు తిరిగి రారు.” [QBR]
యిర్మీయా 22 : 28 (IRVTE)
ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? యెహోయాకీను పనికిమాలిన కుండా? అతన్నీ అతని సంతానాన్నీ తమకు తెలియని దేశంలోకి వాళ్ళెందుకు తోసేశారు? [QBR]
యిర్మీయా 22 : 29 (IRVTE)
దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట విను. [QBR]
యిర్మీయా 22 : 30 (IRVTE)
యెహోవా ఇలా చెబుతున్నాడు “సంతానం లేనివాడనీ తన రోజుల్లో అతడు వర్ధిల్లడనీ ఈ మనిషి గురించి రాయండి. అతని సంతానంలో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడూ దావీదు సింహాసనం ఎక్కడు. ఇక మీదట ఎవడూ యూదాలో రాజుగా ఉండడు.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: