యిర్మీయా 28 : 1 (IRVTE)
అబద్ధ ప్రవక్త హనన్యా యూదా రాజు సిద్కియా పరిపాలన మొదట్లో నాలుగో సంవత్సరం అయిదో నెలలో గిబియోనువాడు, అజ్జూరు ప్రవక్త కొడుకు హనన్యా యాజకుల ఎదుట, ప్రజలందరి ఎదుట యెహోవా మందిరంలో నాతో ఇలా అన్నాడు,
యిర్మీయా 28 : 2 (IRVTE)
“ఇశ్రాయేలు దేవుడు, సేనల అధిపతి యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘నేను బబులోను రాజు కాడిని విరిచేశాను.
యిర్మీయా 28 : 3 (IRVTE)
రెండేళ్లలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలంలో నుంచి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా మందిరంలోని పాత్రలన్నీ ఇక్కడికి మళ్ళీ తెప్పిస్తాను.
యిర్మీయా 28 : 4 (IRVTE)
బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కొడుకు యూదా రాజు యెకొన్యాను, బబులోనుకు బందీలుగా తీసుకుపోయిన యూదులందరినీ ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.’ ఇదే యెహోవా వాక్కు.”
యిర్మీయా 28 : 5 (IRVTE)
అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యాజకుల ఎదుట, యెహోవా మందిరంలో నిలబడి ఉన్న ప్రజలందరి ఎదుట హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు,
యిర్మీయా 28 : 6 (IRVTE)
“యెహోవా దీనిని చేస్తాడు గాక! యెహోవా మందిరపు పాత్రలన్నీ బందీలుగా తీసుకుపోయిన వారందరినీ యెహోవా బబులోనులో నుంచి ఈ స్థలానికి తెప్పించి నువ్వు ప్రకటించిన మాటలను నెరవేరుస్తాడు గాక!
యిర్మీయా 28 : 7 (IRVTE)
అయినా నువ్వు వింటుండగా ఈ ప్రజలందరూ వింటుండగా నేను చెబుతున్న మాట విను.
యిర్మీయా 28 : 8 (IRVTE)
నాకూ నీకూ ముందున్న ప్రవక్తలు, అనేక దేశాలకూ గొప్ప రాజ్యాలకూ వ్యతిరేకంగా యుద్ధాలు జరుగుతాయనీ కీడు సంభవిస్తుందనీ అంటురోగాలు వస్తాయనీ ఎప్పటినుంచో ప్రవచిస్తూ ఉన్నారు.
యిర్మీయా 28 : 9 (IRVTE)
అయితే క్షేమం కలుగుతుందని ప్రకటించే ప్రవక్త మాట నెరవేరితే అతన్ని నిజంగా యెహోవాయే పంపాడని తెలుసుకోవచ్చు,” అని యిర్మీయా ప్రవక్త చెప్పాడు.
యిర్మీయా 28 : 10 (IRVTE)
అయితే హనన్యా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త మెడ మీదనుంచి ఆ కాడిని తీసి దాన్ని విరిచేశాడు.
యిర్మీయా 28 : 11 (IRVTE)
ప్రజలందరి ఎదుట హనన్యా ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘రెండేళ్ళలో నేను బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని రాజ్యాలన్నిటి మెడమీద నుంచి తొలగించి దానిని విరిచివేస్తాను.’ ” అప్పుడు యిర్మీయా ప్రవక్త తన దారిన వెళ్లిపోయాడు.
యిర్మీయా 28 : 12 (IRVTE)
హనన్యా, యిర్మీయా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తరువాత యెహోవా దగ్గర నుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది.
యిర్మీయా 28 : 13 (IRVTE)
“నువ్వు పోయి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెబుతున్నాడు, నువ్వు కొయ్య కాడిని విరిచావు గదా! దానికి బదులు ఇనుప కాడిని నేను చేయిస్తాను.’
యిర్మీయా 28 : 14 (IRVTE)
ఇశ్రాయేలు దేవుడు సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. ‘ఈ ప్రజలంతా బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవ చేయాలని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచాను. కాబట్టి వాళ్ళు అతనికి సేవ చేస్తారు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించాను.’ ”
యిర్మీయా 28 : 15 (IRVTE)
అప్పుడు యిర్మీయా ప్రవక్త, హనన్యాతో ఇలా అన్నాడు. “హనన్యా, విను. యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజల చేత అబద్ధాలను నమ్మించావు.
యిర్మీయా 28 : 16 (IRVTE)
కాబట్టి యెహోవా ఈ మాట చెబుతున్నాడు, ‘నేను నిన్ను భూమి మీద లేకుండా చేయబోతున్నాను. యెహోవా మీద నమ్మకం ఉంచకుండా చేయడానికి నువ్వు ప్రజలను ప్రేరేపించావు. కాబట్టి ఈ సంవత్సరమే నువ్వు చనిపోతావు’ ” అని చెప్పాడు.
యిర్మీయా 28 : 17 (IRVTE)
ఆ సంవత్సరం ఏడో నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17