యిర్మీయా 50 : 1 (IRVTE)
{బబులోనును గూర్చి ప్రవచనం} (51:15-19; యిర్మీ 10:12-16) [PS] కల్దీయుల దేశమైన బబులోనును గూర్చి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చేసిన ప్రకటన. [QBR]
యిర్మీయా 50 : 2 (IRVTE)
దేశాల్లో, జాతుల్లో ప్రకటించండి. అందరూ వినేలా చేయండి. వాళ్ళు వినడానికి సూచనగా ఒక జెండాను ఎత్తి ఉంచండి. దాన్ని కనబడనివ్వండి. [QBR] ఇలా చెప్పండి. “బబులోనును ఆక్రమించుకున్నారు. బేలు దేవుడికి అవమానం కలిగింది. మెరోదకు దేవుడికి వ్యాకులం కలిగింది. వాళ్ళ విగ్రహాలకు అవమానం కలిగింది., వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు పతనమయ్యాయి. [QBR]
యిర్మీయా 50 : 3 (IRVTE)
దాని భూమిని నాశనం చేయడానికి దానికి వ్యతిరేకంగా ఉత్తర దిక్కునుండి ఒక జనం లేచింది. [QBR] మనిషైనా, జంతువైనా దానిలో నివసించరు. వాళ్ళంతా పారిపోతారు.” [QBR]
యిర్మీయా 50 : 4 (IRVTE)
ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “ఆ రోజుల్లో ఆ సమయంలో యూదా ప్రజలూ, ఇశ్రాయేలు ప్రజలూ [QBR] ఏడుస్తూ తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కలిసి వస్తారు. [QBR]
యిర్మీయా 50 : 5 (IRVTE)
సీయోనుకు వెళ్ళే మార్గం ఏది అంటూ వాకబు చేస్తారు. ఆ మార్గంలో ప్రయాణం మొదలు పెడతారు. [QBR] ఉల్లంఘించలేని శాశ్వత నిబంధనలో యెహోవాను కలవడానికి కలిసి వెళ్తారు. [PE][PS]
యిర్మీయా 50 : 6 (IRVTE)
నా ప్రజలు దారి తప్పిన గొర్రెలు. వారి కాపరులు వారిని పర్వతాల పైకి తీసుకు వెళ్లి దారి మళ్ళించారు. [QBR] ఒక కొండ నుండి మరో కొండకు వాళ్ళని తిప్పారు. వాళ్ళు వెళ్ళారు. చివరకు తాము నివసించిన చోటు మర్చిపోయారు. [QBR]
యిర్మీయా 50 : 7 (IRVTE)
వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారంతా వాళ్ళను మింగివేస్తూ వచ్చారు. వాళ్ళ శత్రువులు ‘మేం అపరాధులం కాము. [QBR] ఎందుకంటే వీళ్ళు తమ నిజమైన నివాసం, తమ పూర్వీకులకు ఆధారం అయిన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు.’ అన్నారు. [QBR]
యిర్మీయా 50 : 8 (IRVTE)
బబులోనులో నుండి బయల్దేరండి. కల్దీయుల దేశంలో నుండి పారిపోండి. [QBR] మందకు ముందు నడిచే మేకపోతుల్లా ప్రజలకు ముందు నడవండి. [QBR]
యిర్మీయా 50 : 9 (IRVTE)
ఎందుకంటే చూడండి, నేను బబులోనుకు విరోధంగా ఉత్తర దిక్కునుండి కొన్ని గొప్ప దేశాల సముదాయాన్ని రేపుతున్నాను. [QBR] వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. బబులోనును వాళ్ళు పట్టుకుంటారు. [QBR] వాళ్ళ బాణాలు నైపుణ్యం కల్గిన వీర యోధుల్లా ఉన్నాయి. అవి వ్యర్ధంగా తిరిగి రావు. [QBR]
యిర్మీయా 50 : 10 (IRVTE)
కల్దీయుల దేశం దోపుడు సొమ్ము అవుతుంది. దాన్ని దోచుకునే వాళ్ళంతా సంతృప్తి చెందుతారు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. [QBR]
యిర్మీయా 50 : 11 (IRVTE)
“నా సొమ్మును మీరు దోచుకుని మీరు సంతోషించారు. [QBR] పచ్చిక నేలపై గంతులు వేసే లేగ దూడలాగా మీరు గంతులు వేశారు. [QBR] బలమైన గుర్రాల్లా సకిలిస్తూ ఉన్నారు. [QBR]
యిర్మీయా 50 : 12 (IRVTE)
కాబట్టి మీ తల్లి ఎంతో అవమానం పాలవుతుంది. మిమ్మల్ని కడుపున కన్న ఆమె ఎంతో చీకాకుపడుతుంది. [QBR] జనాలన్నిటిలో ఆమె నీచమైనదిగా ఉంటుంది. ఆమె ఎడారిగానూ, ఎండిన భూమిగానూ, అడవిగానూ ఉంటుంది. [QBR]
యిర్మీయా 50 : 13 (IRVTE)
యెహోవాకు కలిగిన క్రోధాన్ని బట్టి బబులోను నిర్మానుష్యమవుతుంది. సర్వనాశనమవుతుంది. [QBR] బబులోను దారి గుండా వెళ్ళే వాళ్ళందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దాని గాయాలను చూసి దాన్ని తిరస్కరిస్తారు. [QBR]
యిర్మీయా 50 : 14 (IRVTE)
బబులోనుకు చుట్టూ బారులు తీరండి. విల్లును వంచగలిగిన ప్రతి ఒక్కడూ ఆమెపై బాణం వెయ్యాలి. [QBR] ఆమె యెహోవాకు విరోధంగా పాపం చేసింది. కాబట్టి మీ బాణాలు దాచుకోవద్దు. [QBR]
యిర్మీయా 50 : 15 (IRVTE)
దాని చుట్టూ నిలిచి జయజయ ధ్వానాలు చేయండి. ఆమె తన అధికారాన్ని వదులుకుంది. ఆమె గోపురాలు కూలిపోయాయి. [QBR] దాని గోడలు పడిపోతున్నాయి. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. [QBR] అది ఇతర దేశాలకు చేసినట్టే మీరు దానికి చేయండి. [QBR]
యిర్మీయా 50 : 16 (IRVTE)
బబులోనులో విత్తనాలు చల్లే వాణ్ణీ, కొడవలి తీసుకుని పంట కోసే వాణ్ణీ ఉండకుండా వాళ్ళను నిర్మూలం చేయండి. [QBR] క్రూరమైన ఖడ్గానికి భయపడి వారందరు తమ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు తమ తమ దేశాలకు పారిపోతున్నారు. [QBR]
యిర్మీయా 50 : 17 (IRVTE)
ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు. సింహాలు వాటిని చెదరగొట్టి, తరిమాయి. మొదటిగా అష్షూరు రాజు వాళ్ళను మింగివేశాడు. [QBR] దాని తర్వాత బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వాళ్ళ ఎముకలు విరగ్గొట్టాడు.”
యిర్మీయా 50 : 18 (IRVTE)
కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, అష్షూరు రాజును నేను దండించినట్టు బబులోను రాజునూ అతని దేశాన్నీ దండించ బోతున్నాను. [QBR]
యిర్మీయా 50 : 19 (IRVTE)
ఇశ్రాయేలును తన స్వదేశానికి నేను చేరుస్తాను. అతడు కర్మెలు, బాషానులపై మేత మేస్తాడు. [QBR] ఎఫ్రాయిము, గిలాదు మన్య ప్రాంతాల ద్వారా అతడు తృప్తి చెందుతాడు.” [QBR]
యిర్మీయా 50 : 20 (IRVTE)
యెహోవా ఇలా చెప్తున్నాడు. “ఆ రోజుల్లో, ఆ సమయంలో ఇశ్రాయేలులో అతిక్రమాల కోసం వెదుకుతారు, కానీ ఎంత వెదికినా అవి కనపడవు. [QBR] యూదా ప్రజల పాపాల కోసం వాకబు చేస్తాను కానీ అవి దొరకవు. మిగిలి ఉన్న వాళ్ళను నేను క్షమిస్తాను. [QBR]
యిర్మీయా 50 : 21 (IRVTE)
మెరాతయీయుల దేశంపైకి దండెత్తి వెళ్ళండి. అలాగే పెకోదీయుల దేశం పైకి వెళ్ళండి. [QBR] వాళ్ళని కత్తితో అంతం చెయ్యి. వాళ్ళను నాశనం చెయ్యి.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. [QBR] “నేను ఆజ్ఞాపించిన ప్రకారం చెయ్యి. [QBR]
యిర్మీయా 50 : 22 (IRVTE)
వినండి, యుద్ధమూ, మహా వినాశనమూ జరుగుతున్న ధ్వని వినిపిస్తున్నది. [QBR]
యిర్మీయా 50 : 23 (IRVTE)
అన్ని దేశాలనూ అణగ గొట్టే సుత్తి ఎలా విరిగి పోయిందో చూడండి. [QBR] దేశాల మధ్య బబులోను ఎలా ఒక భయానక దృశ్యంలా ఉందో చూడండి [QBR]
యిర్మీయా 50 : 24 (IRVTE)
బబులోనూ, నేను నీ కోసం ఒక బోను పెట్టాను. నువ్వు అందులో చిక్కావు. కానీ ఆ సంగతి నీకు తెలియలేదు. [QBR] యెహోవా అనే నన్ను సవాలు చేశావు. కాబట్టి నిన్ను వెతికి పట్టుకున్నాను.” [QBR]
యిర్మీయా 50 : 25 (IRVTE)
కల్దీయుల దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు చేయాల్సిన పని ఉంది. [QBR] ఆయన తన క్రోధాన్ని చూపడానికి తన ఆయుధాగారాన్ని తెరచి ఆయుధాలను బయటకు తీస్తున్నాడు. [QBR]
యిర్మీయా 50 : 26 (IRVTE)
దూరం నుండే ఆమెపై దాడి చేయండి. ఆమె ధాన్యాగారాన్ని తెరవండి. ధాన్యం కుప్పలు పోసినట్టుగా ఆమెను కుప్పలుగా వేయండి. [QBR] ఆమెను నాశనం చేయండి. ఆమెలో ఏదీ మిగల్చకుండా నాశనం చేయండి. [QBR]
యిర్మీయా 50 : 27 (IRVTE)
ఆమె యెడ్లన్నిటినీ చంపండి. వధశాలకు వాటిని పంపండి. [QBR] అయ్యో, వాళ్ళకు బాధ. వాళ్ళ దినం, వాళ్ళ శిక్షాకాలం వచ్చింది. [QBR]
యిర్మీయా 50 : 28 (IRVTE)
వినండి. బబులోనులో నుండి తప్పించుకుని పారిపోతున్న వాళ్ళ శబ్దం వినిపిస్తుంది. [QBR] సీయోను విషయంలోనూ, తన మందిరం విషయంలోనూ మన దేవుడైన యెహోవా చేస్తున్న ప్రతీకారాన్ని ప్రకటించండి. [QBR]
యిర్మీయా 50 : 29 (IRVTE)
“బబులోనుకు రమ్మని బాణాలు వేసే వాళ్ళను పిలవండి. తమ విల్లును వంచే వాళ్ళందరినీ పిలవండి. [QBR] మీరు దాని చుట్టూ శిబిరం వేయండి. ఎవర్నీ తప్పించుకోనీయవద్దు. [QBR] ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఆమెకు చెల్లించండి. [QBR] ఆమె చేసిన పనులను బట్టి ఆమెకూ చేయండి. [QBR] ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను అవమానించింది.
యిర్మీయా 50 : 30 (IRVTE)
కాబట్టి ఆమె యువకులు పట్టణం వీధుల మూలల్లో పడిపోతారు. ఆమె కోసం యుద్ధం చేసే వీరులందరూ ఆ రోజున నాశనమౌతారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. [QBR]
యిర్మీయా 50 : 31 (IRVTE)
సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “అహంకారీ, నేను నీకు విరోధంగా ఉన్నాను. [QBR] నిన్ను శిక్షించే రోజూ, సమయమూ వచ్చాయి. [QBR]
యిర్మీయా 50 : 32 (IRVTE)
అహంకారి తడబడి కింద పడతాడు. వాణ్ణి ఎవరూ పైకి లేపరు. [QBR] నేను అతడి పట్టణాల్లో అగ్ని రాజేస్తాను. అతని చుట్టూ ఉన్నదాన్ని అది మింగి వేస్తుంది.” [QBR]
యిర్మీయా 50 : 33 (IRVTE)
సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారితో పాటు అణచివేతకు గురయ్యారు. [QBR] వాళ్ళను చెర పట్టిన వాళ్ళందరూ వాళ్ళని ఇంకా పట్టుకునే ఉన్నారు. వాళ్ళను విడిచి పెట్టడానికి ఒప్పుకోవడం లేదు. [QBR]
యిర్మీయా 50 : 34 (IRVTE)
వాళ్ళను విడుదల చేసే వాడు శక్తి గలిగిన వాడు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా. భూమికి విశ్రాంతి కలగజేయడానికీ, బబులోను నివాసుల్లో కలహం పుట్టించడానికీ ఆయన తన ప్రజల పక్షం వహిస్తాడు.” [QBR]
యిర్మీయా 50 : 35 (IRVTE)
ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “కల్దీయులకూ. బబులోను నివాసులకూ వాళ్ళ నాయకులకూ, [QBR] వాళ్ళల్లో జ్ఞానులకూ విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. [QBR]
యిర్మీయా 50 : 36 (IRVTE)
తమను తాము మూర్ఖుల్లా కనపరచుకోడానికి వాళ్ళలో జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. [QBR] సైనికులు భయకంపితులు అయ్యేలా ఒక కత్తి వాళ్ళకు విరోధంగా వస్తూ ఉంది. [QBR]
యిర్మీయా 50 : 37 (IRVTE)
వాళ్ళ గుర్రాలకూ, రథాలకూ, బబులోనులో ఉన్న వాళ్ళందరికీ విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. [QBR] అందుచేత వాళ్ళు స్త్రీల వలే బలహీనులౌతారు. ఆమె గిడ్డంగులకు విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. వాటిని దోచుకుంటారు. [QBR]
యిర్మీయా 50 : 38 (IRVTE)
ఒక కత్తి ఆమె నీళ్ళకు విరోధంగా వస్తూ ఉంది. ఊటలు ఇంకి పోయి నీటిఎద్దడి ఏర్పడుతుంది. [QBR] ఎందుకంటే అది పనికిమాలిన విగ్రహాలున్న దేశం. ఈ భయంకరమైన విగ్రహాలను బట్టి ప్రజలు పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు. [QBR]
యిర్మీయా 50 : 39 (IRVTE)
కాబట్టి నక్కలతో పాటు ఎడారి జంతువులు అక్కడ నివాసముంటాయి. అక్కడే నిప్పుకోళ్ళూ నివసిస్తాయి. [QBR] ఇకమీదట అది ఎప్పుడూ నివాస స్థలంలా ఉండదు. తరతరాల్లో అక్కడ ఎవరూ నివసించరు.” [QBR]
యిర్మీయా 50 : 40 (IRVTE)
ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “దేవుడు సొదొమనూ గొమొర్రానూ వాటి చుట్టూ ఉన్న పట్టణాలనూ శిక్షించినప్పుడు జరిగినట్టే ఇప్పుడూ జరుగుతుంది. [QBR] అక్కడ ఎవరూ నివసించరు. ఆ పట్టణంలో ఎవరూ కాపురముండరు. [QBR]
యిర్మీయా 50 : 41 (IRVTE)
ప్రజలు ఉత్తర దిక్కునుండి వస్తున్నారు. దూరప్రాంతంలోని ఒక గొప్ప జనం, అనేకమంది రాజులూ ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. [QBR]
యిర్మీయా 50 : 42 (IRVTE)
వాళ్ళు వింటినీ, బల్లేలనూ పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు క్రూరులు. వాళ్ళలో కనికరం లేదు. [QBR] వాళ్ళ స్వరం సముద్రపు ఘోషలా ఉంది. బబులోను కుమారీ, వాళ్ళు యుద్ధ వీరుల్లా బారులు తీరి తమ గుర్రాలపై వస్తున్నారు. [QBR]
యిర్మీయా 50 : 43 (IRVTE)
బబులోను రాజు వాళ్ళను గూర్చిన సమాచారం విన్నాడు. భయంతో అతని చేతులు చచ్చుబడి పోయాయి. [QBR] ప్రసవించ బోయే స్త్రీకి కలిగే వేదన లాంటిది అతనికి కలిగింది. [QBR]
యిర్మీయా 50 : 44 (IRVTE)
చూడండి! యొర్దాను ఉన్నత ప్రదేశం నుండి నిరంతరం నిలిచే పచ్చిక భూమిలోకి వచ్చే సింహంలా ఆయన వస్తున్నాడు. [QBR] ఆ సింహాన్ని ఎదుర్కోలేక వాళ్ళు వెంటనే పారిపోయేలా చేస్తాను. దానికి అధికారిగా నేను ఎంపిక చేసిన వాణ్ణి నియమిస్తాను. నేనెవరిని ఏర్పరుస్తానో వాణ్ణి దాని మీద నియమిస్తాను. నాలాటి వాడెవడు? నన్ను ఆక్షేపించే వాడెవడు? నన్ను ఎదిరించగల కాపరి ఏడీ? [QBR]
యిర్మీయా 50 : 45 (IRVTE)
బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినండి. [QBR] కల్దీయుల దేశాన్ని గూర్చి ఆయన ఉద్దేశించినది వినండి. నిశ్చయంగా మందలోని అల్పులైన వారిని వారు లాగుతారు. [QBR] నిశ్చయంగా వారిని బట్టి వారు నివసించిన ప్రదేశం నిర్ఘాంతపోతుంది. [QBR]
యిర్మీయా 50 : 46 (IRVTE)
బబులోనును ఆక్రమించుకుంటున్నారు అనే వార్త విని భూమి కంపిస్తున్నది. జనాల్లో అంగలార్పు వినబడుతున్నది.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46

BG:

Opacity:

Color:


Size:


Font: