యిర్మీయా 8 : 1 (IRVTE)
యెహోవా చెప్పేదేమంటే ఆ సమయంలో మీ శత్రువులు యూదా రాజుల, వారి అధిపతుల ఎముకలను, యాజకుల, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను వారి సమాధుల్లో నుండి బయటికి తీస్తారు.
యిర్మీయా 8 : 2 (IRVTE)
వాటిని తెచ్చి వారు వేటినైతే ప్రేమిస్తున్నారో, పూజిస్తున్నారో, వేటి ఎదుట విచారణ చేస్తున్నారో, నమస్కరిస్తున్నారో ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఎదుట వాటిని పరుస్తారు. వాటిని పోగు చేసి పాతిపెట్టడం జరగదు. భూమి మీద పెంటలాగా అవి పడి ఉంటాయి.
యిర్మీయా 8 : 3 (IRVTE)
ఈ దుర్మార్గ దేశంలో ఇంకా మిగిలి ఉన్నవారు నేను వారిని చెదర గొట్టిన స్థలాల్లో జీవానికి బదులు చావును కోరుకుంటారు. సేనల ప్రభువైన యెహోవా వాక్కు ఇదే. పాపం, శిక్ష [PE][PS]
యిర్మీయా 8 : 4 (IRVTE)
యెహోవా ఇలా చెబుతున్నాడని వారితో చెప్పు. “కిందపడిన మనుషులు లేవకుండా ఉంటారా? దారి తప్పిపోయిన వారు తిరిగి రావడానికి ప్రయత్నించకుండా ఉంటారా?” [QBR]
యిర్మీయా 8 : 5 (IRVTE)
మరి ఈ ప్రజలు, యెరూషలేము ఎందుకు దారి తప్పి శాశ్వతంగా తిరిగి రాకుండా ఉన్నారు? [QBR] వారు ఎందుకు మోసంలో నిలిచి ఉండి పశ్చాత్తాప పడడానికి ఒప్పుకోవడం లేదు? [QBR]
యిర్మీయా 8 : 6 (IRVTE)
నేను వారి మాటలు జాగ్రత్తగా ఆలకించాను. కానీ వారు ఒక్కటి కూడా మంచి మాట పలకలేదు. [QBR] “నేనిలా చేశానేమిటి?” అని తన తన చెడ్డ పని గురించి పశ్చాత్తాపపడే వాడు ఒక్కడూ లేడు. [QBR] యుద్ధంలోకి చొరబడే గుర్రం లాగా ప్రతివాడూ తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు. [QBR]
యిర్మీయా 8 : 7 (IRVTE)
ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు దాని కాలాలు తెలుసు. తెల్ల గువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకులకు అవి తిరిగి రావలసిన సమయాలు తెలుసు. [QBR] అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధి తెలియదు. [QBR]
యిర్మీయా 8 : 8 (IRVTE)
“మేము జ్ఞానులం, యెహోవా ధర్మశాస్త్రం మాతో ఉంది” అని మీరెందుకు అంటున్నారు? [QBR] నిజమే గానీ శాస్త్రులు మోసంతో దానికి పెడర్థాలు రాశారు. [QBR]
యిర్మీయా 8 : 9 (IRVTE)
జ్ఞానులు అవమానం పాలవుతారు. వారు విస్మయంతో చిక్కుల్లో పడ్డారు. [QBR] వారు యెహోవా వాక్యాన్ని తోసిపుచ్చారు. ఇక వారి జ్ఞానం వలన ఏం ప్రయోజనం? [QBR]
యిర్మీయా 8 : 10 (IRVTE)
కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. వారి పొలాలు ఇతరుల స్వాధీనం చేస్తాను. [QBR] చిన్నలు, పెద్దలు, అందరూ విపరీతమైన దురాశాపరులు. ప్రవక్తలు, యాజకులు, అంతా నయవంచకులు. [QBR]
యిర్మీయా 8 : 11 (IRVTE)
శాంతి లేని సమయంలో వారు “శాంతి సమాధానాలు, శాంతి సమాధానాలు” అని పలుకుతూ నా ప్రజల గాయాలకు పైపై పూత పూస్తారు. [QBR]
యిర్మీయా 8 : 12 (IRVTE)
వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు. [QBR] అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు. [QBR] నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు. [QBR]
యిర్మీయా 8 : 13 (IRVTE)
నేను వారిని పూర్తిగా కొట్టివేస్తున్నాను [* పూర్తిగా కొట్టివేస్తున్నాను ఒక చోటికి తీసుకోని వచ్చినప్పుడు] . ఇక ద్రాక్షతీగెకు ద్రాక్షలు, అంజూరు చెట్టుకు అంజూరపండ్లు కాయవు. వాటి ఆకులు వాడిపోతాయి. [QBR] నేను వారికి ఇచ్చినదంతా నశించిపోతుంది. ఇదే యెహోవా వాక్కు. [QBR]
యిర్మీయా 8 : 14 (IRVTE)
“మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం? మనమంతా కలిసి ప్రాకారాలున్న పట్టణాల్లోకి వెళ్ళి అక్కడే చచ్చిపోదాం రండి. [QBR] యెహోవాయే మనలను నాశనం చేస్తున్నాడు. మనం ఆయనకు విరోధంగా పాపం చేశాం కాబట్టి మన దేవుడు యెహోవా మనకు విషజలం తాగించాడు. [QBR]
యిర్మీయా 8 : 15 (IRVTE)
మనం శాంతి సమాధానాల కోసం కనిపెట్టుకుని ఉన్నాం గానీ మనకేమీ మంచి జరగలేదు. [QBR] క్షేమం కోసం కనిపెడుతున్నాం గానీ భయమే కలుగుతూ ఉంది అని వారు చెబుతారు. [QBR]
యిర్మీయా 8 : 16 (IRVTE)
దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది. [QBR] వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు. [QBR]
యిర్మీయా 8 : 17 (IRVTE)
యెహోవా చెప్పేదేమంటే, ‘నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.’ ” [QBR]
యిర్మీయా 8 : 18 (IRVTE)
నా గుండె నా లోపల సొమ్మసిల్లి పోతున్నది. నాకు దుఃఖ నివారణ ఎలా దొరుకుతుంది? [QBR]
యిర్మీయా 8 : 19 (IRVTE)
యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఆమెలో లేడా? అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదనలు వినబడుతున్నాయి. [QBR] వారి విగ్రహాలను ఇతర దేశాల మాయ దేవుళ్ళను పెట్టుకుని నాకు ఎందుకు కోపం తెప్పించారు? [QBR]
యిర్మీయా 8 : 20 (IRVTE)
కోత కాలం గతించిపోయింది. ఎండాకాలం దాటిపోయింది. మనకింకా రక్షణ దొరకలేదు అని చెబుతారు. [QBR]
యిర్మీయా 8 : 21 (IRVTE)
నా జనుల వేదన చూసి నేనూ వేదన చెందుతున్నాను, వారికి జరిగిన ఘోరమైన సంగతులను బట్టి నేను రోదిస్తున్నాను. విపరీతమైన భయం నన్ను ఆవరించింది. [QBR]
యిర్మీయా 8 : 22 (IRVTE)
గిలాదులో ఔషధం ఏమీ లేదా? అక్కడ వైద్యుడెవరూ లేరా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగడం లేదు? [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: