యోవేలు 1 : 2 (IRVTE)
పెతూయేలు కొడుకు యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు. మిడతల తెగులు పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి. మీ రోజుల్లో గానీ మీ పూర్వీకుల రోజుల్లో గానీ ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా?
యోవేలు 1 : 3 (IRVTE)
దాన్ని గురించి మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలు తమ పిల్లలకు, వాళ్ళ పిల్లలు తరువాత తరానికి చెబుతారు.
యోవేలు 1 : 4 (IRVTE)
ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి. పెద్ద మిడతలు విడిచిపెట్టిన దాన్ని మిడత పిల్లలు తినేశాయి. మిడత పిల్లలు విడిచిపెట్టిన దాన్ని గొంగళిపురుగులు తినేశాయి.
యోవేలు 1 : 5 (IRVTE)
తాగుబోతులారా, లేచి ఏడవండి. ద్రాక్షసారాయి తాగే మీరు గట్టిగా ఏడవండి. ఎందుకంటే కొత్త ద్రాక్షసారాయి మీ నోటికి అందడం లేదు.
యోవేలు 1 : 6 (IRVTE)
ఒక రాజ్యం నా దేశం మీదికి వచ్చింది. బలమైన వారుగా లెక్కలేనంత మంది వచ్చారు. దాని పళ్లు సింహపు పళ్ళలా ఉన్నాయి. అతనికి ఆడసింహం పళ్ళున్నాయి* అతనికి ఆడసింహం పళ్ళున్నాయి ప్రకటన 9:7-10 .
యోవేలు 1 : 7 (IRVTE)
అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు. నా అంజూరపు చెట్టును ఒలిచి వేశాడు. దాని బెరడు ఒలిచి పారేశాడు. వాటి కొమ్మలు తెల్లబారాయి.
యోవేలు 1 : 9 (IRVTE)
తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు. నైవేద్యం, పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచి పోయాయి. యెహోవా సేవకులు, యాజకులు ఏడుస్తున్నారు.
యోవేలు 1 : 10 (IRVTE)
పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది. ధాన్యం నాశనమైంది. కొత్త ద్రాక్షారసం లేదు. నూనె ఒలికి పోయింది.
యోవేలు 1 : 11 (IRVTE)
గోదుమ, బార్లీ గురించి రైతులారా, సిగ్గుపడండి, ద్రాక్ష రైతులారా దుఖించండి, పొలం పంట నాశనమయింది.
యోవేలు 1 : 12 (IRVTE)
ద్రాక్షతీగలు వాడిపోయాయి, అంజూరు చెట్లు ఎండిపోయాయి. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, ఆపిల్ చెట్లు, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి. మనుషులకు సంతోషమే లేదు.
యోవేలు 1 : 13 (IRVTE)
పశ్చాతపనికి పిలుపు యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి! బలిపీఠం దగ్గర సేవకులారా, ఏడవండి. నా దేవుని సేవకులారా, గోనెసంచి కట్టుకుని రాత్రంతా గడపండి. నైవేద్యం, పానార్పణం, మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయాయి.
యోవేలు 1 : 14 (IRVTE)
ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి. యెహోవాను బతిమాలడానికి పెద్దలనూ దేశ నివాసులందరినీ మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చండి.
యోవేలు 1 : 15 (IRVTE)
యెహోవా దినం దగ్గర పడింది. అయ్యో, అది ఎంత భయంకరమైన దినం! సర్వశక్తుని దగ్గర నుంచి నాశనంగా అది వస్తుంది.
యోవేలు 1 : 16 (IRVTE)
మన కళ్ళముందే ఆహారం, మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా?
యోవేలు 1 : 17 (IRVTE)
విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి, పైరు ఎండిపోవడంతో ధాన్యపుకొట్లు ఖాళీగా ఉన్నాయి, కళ్లపుకొట్లు నేలమట్టమయ్యాయి.
యోవేలు 1 : 18 (IRVTE)
మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి! పశువుల మందలూ గొర్రెల మందలూ ఎంతగా అలమటిస్తున్నాయి!
యోవేలు 1 : 19 (IRVTE)
యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను. అగ్ని అరణ్యంలోని మేతస్థలాలను కాల్చి వేసింది, మంటలు తోటచెట్లన్నిటినీ కాల్చివేశాయి.
యోవేలు 1 : 20 (IRVTE)
కాలవలు ఎండిపోయాయి, అరణ్యంలోని మేత స్థలాలు కాలిపోవడంతో పొలాల్లోని పశువులు నీ కోసం దాహంగా ఉన్నాయి.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20