యోవేలు 2 : 1 (IRVTE)
{మిడుతల సైన్యం} [PS] సీయోనులో బాకా ఊదండి, [QBR] నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! [QBR] యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ [QBR] దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక. [QBR]
యోవేలు 2 : 2 (IRVTE)
అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. [QBR] కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. [QBR] పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు [QBR] బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. [QBR] అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. [QBR] తరతరాల తరువాత కూడా అది ఉండదు. [PE][PS]
యోవేలు 2 : 3 (IRVTE)
దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది. [QBR] వాటి వెనుక, మంట మండుతూ ఉంది. [QBR] అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది. [QBR] అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది. [QBR] దానినుంచి ఏదీ తప్పించుకోలేదు. [PE][PS]
యోవేలు 2 : 4 (IRVTE)
సేన రూపం, గుర్రాల లాగా ఉంది. [QBR] వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు. [QBR]
యోవేలు 2 : 5 (IRVTE)
వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. [QBR] ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, [QBR] యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు. [PE][PS]
యోవేలు 2 : 6 (IRVTE)
వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, [QBR] అందరి ముఖాలు పాలిపోతున్నాయి. [QBR]
యోవేలు 2 : 7 (IRVTE)
అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి. [QBR] సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి. [QBR] అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి. [QBR]
యోవేలు 2 : 8 (IRVTE)
ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. [QBR] ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు. [QBR]
యోవేలు 2 : 9 (IRVTE)
పట్టణంలో చొరబడుతున్నాయి. [QBR] గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి. [PE][PS]
యోవేలు 2 : 10 (IRVTE)
వాటి ముందు భూమి కంపిస్తున్నది, [QBR] ఆకాశాలు వణుకుతున్నాయి. [QBR] సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. [QBR] నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి. [QBR]
యోవేలు 2 : 11 (IRVTE)
యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, [QBR] ఆయన యోధులు చాలా ఎక్కువమంది. [QBR] ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. [QBR] యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. [QBR] దాన్ని ఎవరు వైపుకోగలరు? [PS]
యోవేలు 2 : 12 (IRVTE)
{పశ్చాతపనికి పిలుపు} [PS] యెహోవా ఇలా అంటున్నాడు, [QBR] “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ [QBR] హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.” [QBR]
యోవేలు 2 : 13 (IRVTE)
మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. [QBR] త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. [QBR] శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. [QBR] కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక [QBR] మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి. [PE][PS]
యోవేలు 2 : 14 (IRVTE)
ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. [QBR] మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, [QBR] పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు? [PE][PS]
యోవేలు 2 : 15 (IRVTE)
సీయోనులో బాకా ఊదండి. [QBR] ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి. [QBR]
యోవేలు 2 : 16 (IRVTE)
ప్రజలను సమకూర్చండి. [QBR] సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. [QBR] పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. [QBR] పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, [QBR] పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి. [PE][PS]
యోవేలు 2 : 17 (IRVTE)
యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు [QBR] మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. [QBR] “యెహోవా, నీ ప్రజలను కనికరించు. [QBR] నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. [QBR] వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. [QBR] వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?” [PS]
యోవేలు 2 : 18 (IRVTE)
{పశ్చాతాపం ద్వారా విమోచన} [PS] అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు. [QBR] తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు. [QBR]
యోవేలు 2 : 19 (IRVTE)
యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు, [QBR] “నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. [QBR] మీరు వాటితో తృప్తి చెందుతారు. [QBR] ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను. [QBR]
యోవేలు 2 : 20 (IRVTE)
ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. [QBR] వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. [QBR] దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. [QBR] అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. [QBR] నేను గొప్ప పనులు చేస్తాను.” [QBR]
యోవేలు 2 : 21 (IRVTE)
దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి. [QBR] యెహోవా గొప్ప పనులు చేశాడు. [QBR]
యోవేలు 2 : 22 (IRVTE)
పశువులారా, భయపడవద్దు. గడ్డిబీళ్లలో పచ్చిక మొలుస్తుంది. [QBR] చెట్లు కాయలు కాస్తాయి. అంజూరపుచెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. [QBR]
యోవేలు 2 : 23 (IRVTE)
సీయోను ప్రజలారా, ఆనందించండి. [QBR] మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి. [QBR] ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు. [QBR] ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు. [PE][PS]
యోవేలు 2 : 24 (IRVTE)
కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి. [QBR] కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి. [QBR]
యోవేలు 2 : 25 (IRVTE)
“ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ, [QBR] ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను. [PE][PS]
యోవేలు 2 : 26 (IRVTE)
మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు. [QBR] మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి [QBR] మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు. [QBR] నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. [QBR]
యోవేలు 2 : 27 (IRVTE)
అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ, [QBR] నేనే మీ యెహోవా దేవుడిననీ, [QBR] నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు. [QBR] నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. [PS]
యోవేలు 2 : 28 (IRVTE)
{దీవుని ఆత్మ ప్రోక్షణకు సంబంధించిన వాగ్దానం} [PS] తరువాత నేను ప్రజలందరి మీద [QBR] నా ఆత్మను కుమ్మరిస్తాను. [QBR] మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. [QBR] మీ ముసలివారు కలలుకంటారు. [QBR] మీ యువకులకు దర్శనాలు వస్తాయి. [QBR]
యోవేలు 2 : 29 (IRVTE)
ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. [PE][PS]
యోవేలు 2 : 30 (IRVTE)
ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. [QBR] భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను. [QBR]
యోవేలు 2 : 31 (IRVTE)
యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు [QBR] సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి. [QBR]
యోవేలు 2 : 32 (IRVTE)
యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. [QBR] యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. [QBR] యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.” [PE]
❮
❯