యోవేలు 3 : 1 (IRVTE)
యూదా శత్రువులపై తీర్పు ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు,
యోవేలు 3 : 2 (IRVTE)
ఇతర ప్రజలందరినీ సమకూర్చి, యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి నేను అక్కడ వారిని శిక్షిస్తాను. వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి నా దేశాన్ని పంచుకున్నారు.
యోవేలు 3 : 3 (IRVTE)
వారు నా ప్రజలకు చీట్లు వేసి, ఒక పసివాణ్ణి ఇచ్చి వేశ్యను తీసుకున్నారు. తాగడానికి ద్రాక్ష మద్యం కోసం ఒక పిల్లను అమ్మేశారు.
యోవేలు 3 : 4 (IRVTE)
తూరు, సీదోను, ఫిలిష్తీయ ప్రాంత నివాసులారా, నా మీద మీకెందుకు కోపం? నా మీద ప్రతీకారం చూపిస్తారా? మీరు నా మీద ప్రతీకారం చూపించినా మీరు చేసినదాన్ని త్వరలోనే మీ నెత్తి మీదికి రప్పిస్తాను.
యోవేలు 3 : 5 (IRVTE)
మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు. నా విలువైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్లలో ఉంచుకున్నారు.
యోవేలు 3 : 6 (IRVTE)
యూదావారూ యెరూషలేము నగరవాసులూ తమ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని మీరు వారిని గ్రీకులకు అమ్మేశారు.
యోవేలు 3 : 7 (IRVTE)
మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రప్పిస్తాను. మీరు వారిని అమ్మి పంపేసిన స్థలాలనుంచి వారు తిరిగి వచ్చేలా చేస్తాను.
యోవేలు 3 : 8 (IRVTE)
మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను. వారు దూరంగా ఉండే షెబాయీయులకు వారిని అమ్మేస్తారు. యెహోవా ఈ మాట చెప్పాడు.
యోవేలు 3 : 9 (IRVTE)
రాజ్యాల్లో ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి. శూరులను రేపండి. వారిని దగ్గరికి రమ్మనండి. సైనికులంతా రావాలి.
యోవేలు 3 : 10 (IRVTE)
మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి. మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి. “నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి.
యోవేలు 3 : 11 (IRVTE)
చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా, మీరంతా త్వరగా సమకూడిరండి. యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా.
యోవేలు 3 : 12 (IRVTE)
రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. చుట్టు పక్కలుండే రాజ్యాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.
యోవేలు 3 : 13 (IRVTE)
పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. తొట్లు పొర్లి పారుతున్నాయి. వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది.
యోవేలు 3 : 14 (IRVTE)
తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది. తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు.
యోవేలు 3 : 15 (IRVTE)
సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది.
యోవేలు 3 : 16 (IRVTE)
యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. భూమ్యాకాశాలు కంపిస్తాయి. అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు.
యోవేలు 3 : 17 (IRVTE)
దేవుని ప్రజలకు నిత్యదీవవెనలు మీ యెహోవా దేవుణ్ణి నేనే, నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు.
యోవేలు 3 : 18 (IRVTE)
ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది. కొండల మీద నుంచి పాలు ప్రవహిస్తాయి. యూదా వాగులన్నిటిలో నీళ్లు పారుతాయి. యెహోవా మందిరంలో నుంచి నీటి ఊట ఉబికి పారి, షిత్తీము లోయను తడుపుతుంది.
యోవేలు 3 : 19 (IRVTE)
కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది. ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు.
యోవేలు 3 : 20 (IRVTE)
యూదాలో ప్రజలు కలకాలం నివసిస్తారు. తరతరాలకు యెరూషలేము నివాస స్థలంగా ఉంటుంది.
యోవేలు 3 : 21 (IRVTE)
వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను. యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21