యోవేలు 3 : 1 (IRVTE)
{యూదా శత్రువులపై తీర్పు} [PS] ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు, [QBR]
యోవేలు 3 : 2 (IRVTE)
ఇతర ప్రజలందరినీ సమకూర్చి, [QBR] యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. [QBR] నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి [QBR] నేను అక్కడ వారిని శిక్షిస్తాను. [QBR] వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి [QBR] నా దేశాన్ని పంచుకున్నారు. [QBR]
యోవేలు 3 : 3 (IRVTE)
వారు నా ప్రజలకు చీట్లు వేసి, ఒక పసివాణ్ణి ఇచ్చి వేశ్యను తీసుకున్నారు. [QBR] తాగడానికి ద్రాక్ష మద్యం కోసం ఒక పిల్లను అమ్మేశారు. [PE][PS]
యోవేలు 3 : 4 (IRVTE)
తూరు, సీదోను, ఫిలిష్తీయ ప్రాంత నివాసులారా, [QBR] నా మీద మీకెందుకు కోపం? నా మీద ప్రతీకారం చూపిస్తారా? [QBR] మీరు నా మీద ప్రతీకారం చూపించినా [QBR] మీరు చేసినదాన్ని త్వరలోనే మీ నెత్తి మీదికి రప్పిస్తాను. [QBR]
యోవేలు 3 : 5 (IRVTE)
మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు. [QBR] నా విలువైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్లలో ఉంచుకున్నారు. [QBR]
యోవేలు 3 : 6 (IRVTE)
యూదావారూ యెరూషలేము నగరవాసులూ [QBR] తమ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని [QBR] మీరు వారిని గ్రీకులకు అమ్మేశారు. [PE][PS]
యోవేలు 3 : 7 (IRVTE)
మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రప్పిస్తాను. [QBR] మీరు వారిని అమ్మి పంపేసిన స్థలాలనుంచి వారు తిరిగి వచ్చేలా చేస్తాను. [QBR]
యోవేలు 3 : 8 (IRVTE)
మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను. [QBR] వారు దూరంగా ఉండే షెబాయీయులకు వారిని అమ్మేస్తారు. [QBR] యెహోవా ఈ మాట చెప్పాడు. [PE][PS]
యోవేలు 3 : 9 (IRVTE)
రాజ్యాల్లో ఈ విషయం చాటించండి, [QBR] యుద్ధానికి సిద్ధపడండి. శూరులను రేపండి. [QBR] వారిని దగ్గరికి రమ్మనండి. సైనికులంతా రావాలి. [QBR]
యోవేలు 3 : 10 (IRVTE)
మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి. [QBR] మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి. [QBR] “నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి. [PE][PS]
యోవేలు 3 : 11 (IRVTE)
చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా, [QBR] మీరంతా త్వరగా సమకూడిరండి. [QBR] యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా. [QBR]
యోవేలు 3 : 12 (IRVTE)
రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. [QBR] చుట్టు పక్కలుండే రాజ్యాలకు [QBR] తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను. [QBR]
యోవేలు 3 : 13 (IRVTE)
పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. [QBR] రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. [QBR] తొట్లు పొర్లి పారుతున్నాయి. [QBR] వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది. [PE][PS]
యోవేలు 3 : 14 (IRVTE)
తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది. [QBR] తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. [QBR]
యోవేలు 3 : 15 (IRVTE)
సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది. [PE][PS]
యోవేలు 3 : 16 (IRVTE)
యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. [QBR] యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. [QBR] భూమ్యాకాశాలు కంపిస్తాయి. [QBR] అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. [QBR] ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు.
యోవేలు 3 : 17 (IRVTE)
{దేవుని ప్రజలకు నిత్యదీవవెనలు} [PS] మీ యెహోవా దేవుణ్ణి నేనే, [QBR] నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. [QBR] అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. [QBR] వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు. [PE][PS]
యోవేలు 3 : 18 (IRVTE)
ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది. [QBR] కొండల మీద నుంచి పాలు ప్రవహిస్తాయి. [QBR] యూదా వాగులన్నిటిలో నీళ్లు పారుతాయి. [QBR] యెహోవా మందిరంలో నుంచి నీటి ఊట ఉబికి పారి, [QBR] షిత్తీము లోయను తడుపుతుంది. [QBR]
యోవేలు 3 : 19 (IRVTE)
కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది. [QBR] ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. [QBR] ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, [QBR] వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు. [QBR]
యోవేలు 3 : 20 (IRVTE)
యూదాలో ప్రజలు కలకాలం నివసిస్తారు. [QBR] తరతరాలకు యెరూషలేము నివాస స్థలంగా ఉంటుంది. [QBR]
యోవేలు 3 : 21 (IRVTE)
వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను. [PE][PS] యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు. [PE]
❮
❯