యోహాను సువార్త 10 : 1 (IRVTE)
{మంచి కాపరి గురించిన ఉపదేశం} (కీర్త 23; హెబ్రీ 13:20; 1పేతు 5:4) [PS] మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.
యోహాను సువార్త 10 : 2 (IRVTE)
ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి.
యోహాను సువార్త 10 : 3 (IRVTE)
అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.
యోహాను సువార్త 10 : 4 (IRVTE)
తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.
యోహాను సువార్త 10 : 5 (IRVTE)
వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి. [PE][PS]
యోహాను సువార్త 10 : 6 (IRVTE)
యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు.
యోహాను సువార్త 10 : 7 (IRVTE)
అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే.
యోహాను సువార్త 10 : 8 (IRVTE)
నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు. [PE][PS]
యోహాను సువార్త 10 : 9 (IRVTE)
నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు.
యోహాను సువార్త 10 : 10 (IRVTE)
దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను. [PE][PS]
యోహాను సువార్త 10 : 11 (IRVTE)
నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.
యోహాను సువార్త 10 : 12 (IRVTE)
జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది.
యోహాను సువార్త 10 : 13 (IRVTE)
జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు. [PE][PS]
యోహాను సువార్త 10 : 14 (IRVTE)
నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.
యోహాను సువార్త 10 : 15 (IRVTE)
నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను.
యోహాను సువార్త 10 : 16 (IRVTE)
ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి. [PE][PS]
యోహాను సువార్త 10 : 17 (IRVTE)
నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.
యోహాను సువార్త 10 : 18 (IRVTE)
నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.” [PE][PS]
యోహాను సువార్త 10 : 19 (IRVTE)
ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి.
యోహాను సువార్త 10 : 20 (IRVTE)
వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు.
యోహాను సువార్త 10 : 21 (IRVTE)
ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు. యోహా 14:9; 20:28, 29 [PE][PS]
యోహాను సువార్త 10 : 22 (IRVTE)
{యేసు తన దైవత్వాన్ని రూఢి పరచడం} [PS] ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం.
యోహాను సువార్త 10 : 23 (IRVTE)
అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా
యోహాను సువార్త 10 : 24 (IRVTE)
యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. “ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు. [PE][PS]
యోహాను సువార్త 10 : 25 (IRVTE)
అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
యోహాను సువార్త 10 : 26 (IRVTE)
అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.
యోహాను సువార్త 10 : 27 (IRVTE)
నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.
యోహాను సువార్త 10 : 28 (IRVTE)
నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు.
యోహాను సువార్త 10 : 29 (IRVTE)
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు.
యోహాను సువార్త 10 : 30 (IRVTE)
నేను, నా తండ్రి, ఒకటే!” [PE][PS]
యోహాను సువార్త 10 : 31 (IRVTE)
అప్పుడు యూదులు ఆయనను కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు.
యోహాను సువార్త 10 : 32 (IRVTE)
యేసు వారితో, “తండ్రి నుంచి ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?” అన్నాడు.
యోహాను సువార్త 10 : 33 (IRVTE)
అందుకు యూదులు, “నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు” అని ఆయనతో అన్నారు.
యోహాను సువార్త 10 : 34 (IRVTE)
యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “ ‘మీరు దేవుళ్ళని నేనన్నాను’ అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా?
యోహాను సువార్త 10 : 35 (IRVTE)
లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే,
యోహాను సువార్త 10 : 36 (IRVTE)
తండ్రి పవిత్రంగా ఈ లోకంలోకి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అంటే ‘నువ్వు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా?
యోహాను సువార్త 10 : 37 (IRVTE)
నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి.
యోహాను సువార్త 10 : 38 (IRVTE)
అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”
యోహాను సువార్త 10 : 39 (IRVTE)
వారు మళ్ళీ ఆయనను పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకున్నాడు. [PE][PS]
యోహాను సువార్త 10 : 40 (IRVTE)
యేసు మళ్ళీ యొర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తిసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే.
యోహాను సువార్త 10 : 41 (IRVTE)
చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. వారు, “యోహాను ఏ సూచక క్రియలూ చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే” అన్నారు.
యోహాను సువార్త 10 : 42 (IRVTE)
అక్కడ చాలా మంది యేసుని నమ్మారు. [PE]
❮
❯