యెహొషువ 12 : 1 (IRVTE)
{ఓడిపోయిన రాజులు} [PS] ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ తూర్పు మైదానమంతటిలో ఉన్న వారిని ఓడించి వారి దేశాలను ఆక్రమించుకొన్న రాజులు ఎవరంటే,
యెహొషువ 12 : 2 (IRVTE)
అమోరీయుల రాజు సీహోను. అతడు హెష్బోనులో నివసిస్తూ అర్నోను నదీ తీరంలోని అరోయేరు నుండి, అంటే ఆ నదీ లోయ మధ్య నుండి గిలాదు అర్థభాగమూ అమ్మోనీయులకు సరిహద్దుగా ఉన్న యబ్బోకు నది లోయ వరకూ
యెహొషువ 12 : 3 (IRVTE)
తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకూ తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గంలో ఉప్పు సముద్రంగా నున్న అరాబా సముద్రం వరకూ దక్షిణం వైపున పిస్గాకొండ చరియల కింద ఉన్న మైదానం వరకూ పరిపాలించాడు.
యెహొషువ 12 : 4 (IRVTE)
ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగును పట్టుకున్నారు. అతడు రెఫాయీయుల్లో మిగిలిన వారిలో ఒకడు. అతడు అష్తారోతులో ఎద్రెయిలో నివసించి గెషూరీయుల, మాయకాతీయుల సరిహద్దు వరకూ బాషాను అంతటా సల్కా,
యెహొషువ 12 : 5 (IRVTE)
హెర్మోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకూ గిలాదు అర్థభాగంలో పాలించినవాడు. [PE][PS]
యెహొషువ 12 : 6 (IRVTE)
యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులూ వారిని ఓడించారు. యెహోవా సేవకుడు మోషే, ఆ భూమిని రూబేనీయులకూ గాదీయులకూ మనష్షే అర్థగోత్రపు వారికీ స్వాస్థ్యంగా ఇచ్చాడు.
యెహొషువ 12 : 7 (IRVTE)
యొర్దానుకు అవతల, అంటే పడమరగా లెబానోను లోయలో ఉన్న బయల్గాదు నుండి శేయీరు వరకూ వ్యాపించిన హాలాకు కొండవరకూ ఉన్న దేశాల రాజులను యెహోషువ, ఇశ్రాయేలీయులు జయించారు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం స్వాస్థ్యంగా ఇచ్చాడు.
యెహొషువ 12 : 8 (IRVTE)
కొండ ప్రాంతాల్లో, లోయలో షెఫేలా ప్రదేశంలో చరియల ప్రదేశాల్లో అరణ్యంలో దక్షిణ దేశంలో ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ అనేవారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు.
యెహొషువ 12 : 9 (IRVTE)
వారెవరంటే, యెరికో రాజు, బేతేలు పక్కన ఉన్న హాయి రాజు, యెరూషలేము రాజు,
యెహొషువ 12 : 10 (IRVTE)
హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
యెహొషువ 12 : 11 (IRVTE)
లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
యెహొషువ 12 : 12 (IRVTE)
గెజెరు రాజు, దెబీరు రాజు,
యెహొషువ 12 : 13 (IRVTE)
గెదెరు రాజు, హోర్మా రాజు,
యెహొషువ 12 : 14 (IRVTE)
అరాదు రాజు, లిబ్నా రాజు,
యెహొషువ 12 : 15 (IRVTE)
అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
యెహొషువ 12 : 16 (IRVTE)
బేతేలు రాజు, తప్పూయ రాజు,
యెహొషువ 12 : 17 (IRVTE)
హెపెరు రాజు, ఆఫెకు రాజు,
యెహొషువ 12 : 18 (IRVTE)
లష్షారోను రాజు, మాదోను రాజు,
యెహొషువ 12 : 19 (IRVTE)
హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
యెహొషువ 12 : 20 (IRVTE)
అక్షాపు రాజు, తానాకు రాజు,
యెహొషువ 12 : 21 (IRVTE)
మెగిద్దో రాజు, కెదెషు రాజు.
యెహొషువ 12 : 22 (IRVTE)
కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెరక ప్రాంతాల్లో ఉన్న దోరు రాజు,
యెహొషువ 12 : 23 (IRVTE)
గిల్గాలులో గోయీయుల రాజు, తిర్సా రాజు.
యెహొషువ 12 : 24 (IRVTE)
వారంతా కలిసి ముప్ఫై ఒక్క మంది రాజులు. [PE]
❮
❯