యెహొషువ 15 : 1 (IRVTE)
యూదాకు కేటాయించిన సరిహద్దులు
15:15-19; న్యాయా 1:11-15
యూదాగోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు, ఎదోం దేశ సరిహద్దు వరకూ అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచివరి దక్షిణ భాగం వరకూ ఉంది.
యెహొషువ 15 : 2 (IRVTE)
వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు* ఉప్పు సముద్రపు మృత సముద్రం ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది.
యెహొషువ 15 : 3 (IRVTE)
వారి సరిహద్దు అక్రబ్బీము కొండకు దక్షిణంగా ఎక్కి, సీను వరకూ పోయి కాదేషు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి
యెహొషువ 15 : 4 (IRVTE)
అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు.
యెహొషువ 15 : 5 (IRVTE)
దాని తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకూ ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించింది.
యెహొషువ 15 : 6 (IRVTE)
ఆ సరిహద్దు బేత్‌హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది.
యెహొషువ 15 : 7 (IRVTE)
ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్‌రోగేలు దగ్గర ఉంది.
యెహొషువ 15 : 8 (IRVTE)
ఆ సరిహద్దు పడమట బెన్‌ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది.
యెహొషువ 15 : 9 (IRVTE)
ఆ సరిహద్దు ఆ కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది. ఆ సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది.
యెహొషువ 15 : 10 (IRVTE)
ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బేత్షెమెషు వరకూ దిగి తిమ్నా వైపుకు వ్యాపించింది.
యెహొషువ 15 : 11 (IRVTE)
ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది.
యెహొషువ 15 : 12 (IRVTE)
పడమటి సరిహద్దు మహాసముద్రం. వారి వారి వంశాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి.
యెహొషువ 15 : 13 (IRVTE)
యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను.
యెహొషువ 15 : 14 (IRVTE)
షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు.
యెహొషువ 15 : 15 (IRVTE)
అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు.
యెహొషువ 15 : 16 (IRVTE)
కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే
యెహొషువ 15 : 17 (IRVTE)
కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు.
యెహొషువ 15 : 18 (IRVTE)
ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు.
యెహొషువ 15 : 19 (IRVTE)
“నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి” అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.
యెహొషువ 15 : 20 (IRVTE)
యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది.
యెహొషువ 15 : 21 (IRVTE)
యూదా గోత్రం వారికి దక్షిణంగా ఎదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,
యెహొషువ 15 : 22 (IRVTE)
కీనా, దిమోనా, అదాదా,
యెహొషువ 15 : 23 (IRVTE)
కెదెషు, హాసోరు, ఇత్నాను,
యెహొషువ 15 : 24 (IRVTE)
జీఫు, తెలెము, బెయాలోతు,
యెహొషువ 15 : 25 (IRVTE)
హాసోరు, హదత్తా, కెరీయోతు, హెస్రోను అనే హాసోరు,
యెహొషువ 15 : 26 (IRVTE)
అమాము, షేమ, మోలాదా,
యెహొషువ 15 : 27 (IRVTE)
హసర్ గద్దా, హెష్మోను, బేత్పెలెతు,
యెహొషువ 15 : 28 (IRVTE)
హసర్ షువలు, బెయేర్షెబా, బిజియోతియా,
యెహొషువ 15 : 29 (IRVTE)
బాలా, ఈయ్యె, ఎజెము,
యెహొషువ 15 : 30 (IRVTE)
ఎల్తోలదు, కెసీలు, హోర్మా,
యెహొషువ 15 : 31 (IRVTE)
సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
యెహొషువ 15 : 32 (IRVTE)
లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.
యెహొషువ 15 : 33 (IRVTE)
మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,
యెహొషువ 15 : 34 (IRVTE)
జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,
యెహొషువ 15 : 35 (IRVTE)
యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
యెహొషువ 15 : 36 (IRVTE)
షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.
యెహొషువ 15 : 37 (IRVTE)
సెనాను, హదాషా, మిగ్దోల్గాదు,
యెహొషువ 15 : 38 (IRVTE)
దిలాను, మిజ్పా, యొక్తయేలు,
యెహొషువ 15 : 39 (IRVTE)
లాకీషు, బొస్కతు, ఎగ్లోను,
యెహొషువ 15 : 40 (IRVTE)
కబ్బోను, లహ్మాసు, కిత్లిషు,
యెహొషువ 15 : 41 (IRVTE)
గెదెరోతు, బేత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా పదహారు పట్టణాలు.
యెహొషువ 15 : 42 (IRVTE)
లిబ్నా, ఎతెరు, ఆషాను,
యెహొషువ 15 : 43 (IRVTE)
ఇప్తా, అష్నా, నెసీబు,
యెహొషువ 15 : 44 (IRVTE)
కెయీలా, అక్జీబు, మారేషా అనేవీ వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
యెహొషువ 15 : 45 (IRVTE)
ఎక్రోను దాని పట్టణాలు పల్లెలు, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా,
యెహొషువ 15 : 46 (IRVTE)
దాని పట్టణాలు పల్లెలు, ఐగుప్తు వాగు వరకూ మహా సముద్రం వరకూ, అష్డోదు వాటి పల్లెలు.
యెహొషువ 15 : 47 (IRVTE)
గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు,
యెహొషువ 15 : 48 (IRVTE)
మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,
యెహొషువ 15 : 49 (IRVTE)
దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా,
యెహొషువ 15 : 50 (IRVTE)
అనాబు, ఎష్టెమో, ఆనీము,
యెహొషువ 15 : 51 (IRVTE)
గోషెను, హోలోను గిలో అనేవి. వాటి పల్లెలు పోగా పదకొండు పట్టణాలు.
యెహొషువ 15 : 52 (IRVTE)
ఆరాబు, దూమా, ఎషాను,
యెహొషువ 15 : 53 (IRVTE)
యానీము, బేత్ తపూయ, అఫెకా,
యెహొషువ 15 : 54 (IRVTE)
హుమ్తా, కిర్యతర్బా అనే హెబ్రోను, సీయోరు అనేవి. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
యెహొషువ 15 : 55 (IRVTE)
మాయోను, కర్మెలు, జీఫు, యుట్టా,
యెహొషువ 15 : 56 (IRVTE)
యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ,
యెహొషువ 15 : 57 (IRVTE)
కయీను, గిబియా, తిమ్నా అనేవి. వాటి పల్లెలు పోగా పది పట్టణాలు.
యెహొషువ 15 : 58 (IRVTE)
హల్హూలు, బేత్సూరు, గెదోరు,
యెహొషువ 15 : 59 (IRVTE)
మారాతు, బేత్ అనోతు, ఎల్తెకోను అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
యెహొషువ 15 : 60 (IRVTE)
కిర్యత్యారీం అంటే కిర్యత్ బయలు, రబ్బా అనేవి. వాటి పల్లెలు పోగా రెండు పట్టణాలు.
యెహొషువ 15 : 61 (IRVTE)
అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా
యెహొషువ 15 : 62 (IRVTE)
ఉప్పు పట్టణం నిబ్షాను, ఈల్మెలహు ఏన్గెదీ అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
యెహొషువ 15 : 63 (IRVTE)
యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కాబట్టి యెబూసీయులు ఈ నాటికీ యెరూషలేములో యూదా వారితో కలిసి నివసిస్తున్నారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63