యెహొషువ 16 : 1 (IRVTE)
మనష్షే, ఎఫ్రాయిం యోసేపు సంతతి వారికి వచ్చిన వంతు యెరికో దగ్గర యొర్దాను నుండి
యెహొషువ 16 : 2 (IRVTE)
తూర్పున ఉన్న యెరికో నీటి ఊటలు వరకూ, యెరికో నుండి బేతేలు కొండ సీమ వరకూ ఉంది.
యెహొషువ 16 : 3 (IRVTE)
అది బేతేలు నుండి లూజు వరకూ పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకూ సాగి కింద బేత్‌హోరోను వరకూ గెజెరు వరకూ పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకూ వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం దగ్గర అంతం అయింది.
యెహొషువ 16 : 4 (IRVTE)
అక్కడ యోసేపు కుమారులు, మనష్షే ఎఫ్రాయిం సంతతి వారు స్వాస్థ్యాన్ని పొందారు.
యెహొషువ 16 : 5 (IRVTE)
ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అంటే వారి వంశాల ప్రకారం వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి ఎగువ బేత్‌ హోరోను వరకూ తూర్పుగా వ్యాపించింది.
యెహొషువ 16 : 6 (IRVTE)
వారి సరిహద్దు మిక్మెతాతు దగ్గర ఉన్న సముద్రం వరకూ పశ్చిమోత్తరంగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్ షిలోహు వరకూ తూర్పువైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకూ తూర్పున దాని దాటి
యెహొషువ 16 : 7 (IRVTE)
యానోహా నుండి అతారోతు వరకూ, నారా వరకూ యెరికోకు తగిలి యొర్దాను దగ్గర అంతమయింది.
యెహొషువ 16 : 8 (IRVTE)
తప్పూయ మొదలు ఆ సరిహద్దు కానా వాగు వరకూ పశ్చిమంగా వ్యాపించింది. అది వారి వంశాల ప్రకారం ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం.
యెహొషువ 16 : 9 (IRVTE)
ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడ ఇవ్వబడిన పట్టణాలు పోతే ఆ పట్టణాలన్నీ వాటి పల్లెలు మనష్షీయుల స్వాస్థ్యంలో ఉన్నాయి.
యెహొషువ 16 : 10 (IRVTE)
అయితే గెజెరులో నివసించిన కనానీయులను వారు వెళ్ళగొట్ట లేదు. ఇప్పటి వరకూ ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు.

1 2 3 4 5 6 7 8 9 10