న్యాయాధిపతులు 8 : 1 (IRVTE)
జెబహును, సల్మున్నాను అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో “నువ్వు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని అతనితో తీవ్రంగా వాదించారు.
న్యాయాధిపతులు 8 : 2 (IRVTE)
అందుకు అతడు “మీరు చేసినదేమిటీ, నేను చేసినదేమిటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులు ఓరేబు, జెయేబు మీద మీకు జయం ఇచ్చాడు. మీరు చేసినట్టు నేను చెయ్యగలనా?” అన్నాడు
న్యాయాధిపతులు 8 : 3 (IRVTE)
అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వాళ్లకు కోపం తగ్గింది.
న్యాయాధిపతులు 8 : 4 (IRVTE)
గిద్యోను, అతనితో ఉన్న మూడువందల మందీ అలసట చెందినప్పటికీ మిద్యానీయుల శత్రువులను తరుముతూ, యొర్దాను దగ్గరికి వచ్చి, దాన్ని దాటారు.
న్యాయాధిపతులు 8 : 5 (IRVTE)
అతడు సుక్కోతు వాళ్ళతో “నా వెంట ఉన్న ప్రజలు అలసి ఉన్నారు, మేము మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాము. దయచేసి నాతో వస్తున్నవారికి రొట్టెలు ఇవ్వండి” అని అడిగాడు.
న్యాయాధిపతులు 8 : 6 (IRVTE)
సుక్కోతు అధిపతులు “జెబహు, సల్మున్నా అనే వాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?” అన్నారు.
న్యాయాధిపతులు 8 : 7 (IRVTE)
అందుకు గిద్యోను “జెబహు సల్మున్నా మీద యెహోవా నాకు జయం ఇచ్చిన తరువాత, ముళ్ళపొదలతోను, ఎడారి కంపలతోను మీ శరీరాలను చీరేస్తాను” అని చెప్పాడు.
న్యాయాధిపతులు 8 : 8 (IRVTE)
అక్కడనుంచి అతడు పెనూయేలుకు వెళ్ళి అలాగే వాళ్ళనూ అడిగినప్పుడు, సుక్కోతు వాళ్ళు జవాబిచ్చినట్టు పెనూయేలువాళ్ళు కూడా అతనికి జవాబిచ్చారు గనుక అతడు,
న్యాయాధిపతులు 8 : 9 (IRVTE)
“నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను” అని పెనూయేలు వాళ్ళతో చెప్పాడు.
న్యాయాధిపతులు 8 : 10 (IRVTE)
అప్పుడు జెబహు, సల్మున్నా వాళ్ళతో కూడా వాళ్ళ సైన్యాలు, అంటే తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలినవాళ్ళు ఇంచుమించు పదిహేను వేలమంది మాత్రమే, కర్కోరులో ఉన్నారు. లక్షా ఇరవైవేలమంది అప్పటికే చనిపోయారు.
న్యాయాధిపతులు 8 : 11 (IRVTE)
అప్పుడు గిద్యోను నోబహుకు, యొగేబ్బెహకు తూర్పున, దేశ సంచారుల మార్గాన శత్రు శిబిరానికి వెళ్ళి, శత్రుసైన్యం నిర్భయంగా ఉన్న కారణంగా ఆ సైన్యాన్ని ఓడించాడు.
న్యాయాధిపతులు 8 : 12 (IRVTE)
జెబహు, సల్మున్నా పారిపోయినప్పుడు అతడు వాళ్ళను తరిమి ఇద్దరు మిద్యాను రాజులు జెబహును, సల్మున్నాను పట్టుకుని ఆ సేనంతటిని చెదరగొట్టాడు.
న్యాయాధిపతులు 8 : 13 (IRVTE)
యుద్ధం ముగిసిన తరువాత యోవాషు కొడుకు గిద్యోను
న్యాయాధిపతులు 8 : 14 (IRVTE)
హెరెసు ఎగువనుంచి తిరిగి వచ్చి, సుక్కోతు వాళ్ళలో ఒక యువకుణ్ణి పట్టుకుని విచారణ చేయగా అతడు సుక్కోతు అధిపతులు, పెద్దల్లో డెబ్భై ఏడుగురి పేర్లు వివరంగా చెప్పాడు.
న్యాయాధిపతులు 8 : 15 (IRVTE)
అప్పుడతడు సుక్కోతు వాళ్ళ దగ్గరికి వచ్చి “ ‘జెబహు, సల్మున్నా అనేవాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?’ అని మీరు ఎవరి విషయంలో నన్ను దూషించారో, ఆ జెబహును, సల్మున్నాలను, చూడండి” అని చెప్పి
న్యాయాధిపతులు 8 : 16 (IRVTE)
ఆ ఊరిపెద్దలను పట్టుకుని, ముళ్ళకంపను, బొమ్మజెముడును తీసుకు వాటితో సుక్కోతు వాళ్ళకు బుద్ధి చెప్పాడు.
న్యాయాధిపతులు 8 : 17 (IRVTE)
అతడు పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివాళ్ళను చంపాడు.
న్యాయాధిపతులు 8 : 18 (IRVTE)
గిద్యోను, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎలాంటి వారని జెబహును సల్మున్నాను అడిగినప్పుడు వాళ్ళు “నీలాంటివాళ్ళే. వాళ్ళందరూ రాకుమారుల్లా ఉన్నారు” అన్నారు.
న్యాయాధిపతులు 8 : 19 (IRVTE)
గిద్యోను “వాళ్ళు నా తల్లి కుమారులు. నా సహోదరులు. మీరు వాళ్ళను బ్రతకనిచ్చి ఉంటే
న్యాయాధిపతులు 8 : 20 (IRVTE)
యెహోవా జీవం తోడు, మిమ్మల్ని చంపేవాణ్ణి కాదు” అని చెప్పి, తన పెద్ద కొడుకు యెతెరును చూసి “నువ్వు లేచి వాళ్ళని చంపు” అన్నాడు. అతడు పసి వాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.
న్యాయాధిపతులు 8 : 21 (IRVTE)
అప్పుడు జెబహు సల్మున్నాలు “వయస్సునుబట్టి మనిషికి శక్తి ఉంటుంది గనుక, నువ్వే లేచి, మమ్మల్ని చంపు” అన్నారు. గిద్యోను లేచి జెబహును, సల్మున్నాను చంపి, వాళ్ళ ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.
న్యాయాధిపతులు 8 : 22 (IRVTE)
గిద్యోను ఏఫోదు అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో “నువ్వు మిద్యానీయుల చేతిలోనుంచి మమ్మల్ని రక్షించావు గనుక నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, మమ్మల్ని పరిపాలించండి” అని చెప్పారు.
న్యాయాధిపతులు 8 : 23 (IRVTE)
అందుకు గిద్యోను “నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించకూడదు. యెహోవా మిమ్మల్ని పరిపాలిస్తాదు” అని చెప్పాడు.
న్యాయాధిపతులు 8 : 24 (IRVTE)
గిద్యోను “మీలో ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న చెవి పోగులను నాకు ఇవ్వండి అని మనవి చేస్తున్నాను” అన్నాడు. (మిద్యానీయులు ఇష్మాయేలీయులు గనుక వాళ్ళ చెవులకు పోగులు ఉన్నాయి.)
న్యాయాధిపతులు 8 : 25 (IRVTE)
అందుకు ఇశ్రాయేలీయులు “సంతోషంగా మేము వాటిని నీకు ఇస్తాము” అని చెప్పి ఒక బట్ట పరచి, ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దాని మీద వేశాడు.
న్యాయాధిపతులు 8 : 26 (IRVTE)
మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు, కర్ణభూషణాలు, ధూమ్రవర్ణపు దుస్తులు, ఒంటెల మెడల మీద ఉన్న గొలుసుల తూకం కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల తులాల బంగారం అయ్యింది. గిద్యోను దానితో ఒక ఏఫోదును* ఏఫోదును దేవుని సేవించటానికి ప్రధాన యాజకులు వాడే పై వస్త్రం. చేయించి తన సొంత ఊరు ఒఫ్రాలో దాన్ని ఉంచాడు.
న్యాయాధిపతులు 8 : 27 (IRVTE)
కాబట్టి ఇశ్రాయేలీయులంతా ద్రోహులై అక్కడికి వెళ్ళి దానికి మొక్కి వ్యభిచారులయ్యారు. అది గిద్యోనుకు, అతని ఇంటివాళ్ళకు ఒక ఉచ్చుగా అయ్యింది.
న్యాయాధిపతులు 8 : 28 (IRVTE)
గిద్యోనుమరణం ఇశ్రాయేలీయులు మిద్యానీయులను అణచి వేసిన తరువాత, ఇంక వాళ్ళు తలెత్త లేకపోయారు. గిద్యోను కాలంలో దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
న్యాయాధిపతులు 8 : 29 (IRVTE)
తరువాత యోవాషు కొడుకు యెరుబ్బయలు యెరుబ్బయలు గిద్యోను , తన సొంత ఇంట్లో నివాసం ఉండడానికి వెళ్ళిపోయాడు.
న్యాయాధిపతులు 8 : 30 (IRVTE)
గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్న కారణంగా అతని కడుపున పుట్టినవాళ్ళు డెబ్భై మంది కొడుకులు ఉన్నారు.
న్యాయాధిపతులు 8 : 31 (IRVTE)
షెకెములో ఉన్న అతని ఉపపత్ని కూడా అతనికి ఒక కొడుకును కన్నప్పుడు గిద్యోను అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు.
న్యాయాధిపతులు 8 : 32 (IRVTE)
యోవాషు కొడుకు గిద్యోను ముసలివాడై చనిపోయాడు. అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న అతని తండ్రి యోవాషు సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు.
న్యాయాధిపతులు 8 : 33 (IRVTE)
గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు తమ శత్రువుల చేతిలోనుంచి తమను విడిపించిన యెహోవా దేవుణ్ణి ఘనపరచక, ఆయన్ని జ్ఞాపకం చేసుకోక,
న్యాయాధిపతులు 8 : 34 (IRVTE)
మళ్ళీ బయలుదేవుళ్ళను అనుసరించి, వ్యభిచారులై, బయల్బెరీతును బయల్బెరీతును బయలుతో ఒప్పందం తమకు దేవుడుగా చేసుకున్నారు.
న్యాయాధిపతులు 8 : 35 (IRVTE)
వాళ్ళు యెరుబ్బయలు (అంటే గిద్యోను) ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతా మరచిపోయి, అతని యింటివాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారం, ఉపకారం చెయ్యలేదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35