విలాపవాక్యములు 3 : 1 (IRVTE)
విలాపం, నిరీక్షణ
విలాపవాక్యములు 3 : 2 (IRVTE)
నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి.
విలాపవాక్యములు 3 : 3 (IRVTE)
ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు.
విలాపవాక్యములు 3 : 4 (IRVTE)
నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు.
విలాపవాక్యములు 3 : 5 (IRVTE)
ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు.
విలాపవాక్యములు 3 : 6 (IRVTE)
నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు.
విలాపవాక్యములు 3 : 7 (IRVTE)
ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు.
విలాపవాక్యములు 3 : 8 (IRVTE)
ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు.
విలాపవాక్యములు 3 : 9 (IRVTE)
నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు. ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు.
విలాపవాక్యములు 3 : 10 (IRVTE)
నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు.
విలాపవాక్యములు 3 : 11 (IRVTE)
దాగి ఉన్న సింహంలా ఉన్నాడు.
విలాపవాక్యములు 3 : 12 (IRVTE)
నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు.
విలాపవాక్యములు 3 : 13 (IRVTE)
విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు.
విలాపవాక్యములు 3 : 14 (IRVTE)
తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు.
విలాపవాక్యములు 3 : 15 (IRVTE)
నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు.
విలాపవాక్యములు 3 : 16 (IRVTE)
చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు.
విలాపవాక్యములు 3 : 17 (IRVTE)
రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు.
విలాపవాక్యములు 3 : 18 (IRVTE)
నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు.
విలాపవాక్యములు 3 : 19 (IRVTE)
కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను.
విలాపవాక్యములు 3 : 20 (IRVTE)
నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను.
విలాపవాక్యములు 3 : 21 (IRVTE)
కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను.
విలాపవాక్యములు 3 : 22 (IRVTE)
కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.
విలాపవాక్యములు 3 : 23 (IRVTE)
యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.
విలాపవాక్యములు 3 : 24 (IRVTE)
ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!
విలాపవాక్యములు 3 : 25 (IRVTE)
“యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.
విలాపవాక్యములు 3 : 26 (IRVTE)
తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.
విలాపవాక్యములు 3 : 27 (IRVTE)
యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.
విలాపవాక్యములు 3 : 28 (IRVTE)
తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది.
విలాపవాక్యములు 3 : 29 (IRVTE)
అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి.
విలాపవాక్యములు 3 : 30 (IRVTE)
ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి.
విలాపవాక్యములు 3 : 31 (IRVTE)
అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి.
విలాపవాక్యములు 3 : 32 (IRVTE)
ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.
విలాపవాక్యములు 3 : 33 (IRVTE)
ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.
విలాపవాక్యములు 3 : 34 (IRVTE)
హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.
విలాపవాక్యములు 3 : 35 (IRVTE)
దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం,
విలాపవాక్యములు 3 : 36 (IRVTE)
మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం,
విలాపవాక్యములు 3 : 37 (IRVTE)
ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా?
విలాపవాక్యములు 3 : 38 (IRVTE)
ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు?
విలాపవాక్యములు 3 : 39 (IRVTE)
మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా?
విలాపవాక్యములు 3 : 40 (IRVTE)
బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు?
విలాపవాక్యములు 3 : 41 (IRVTE)
మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.
విలాపవాక్యములు 3 : 42 (IRVTE)
ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం.
విలాపవాక్యములు 3 : 43 (IRVTE)
మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు.
విలాపవాక్యములు 3 : 44 (IRVTE)
నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు.
విలాపవాక్యములు 3 : 45 (IRVTE)
మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు.
విలాపవాక్యములు 3 : 46 (IRVTE)
జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు.
విలాపవాక్యములు 3 : 47 (IRVTE)
మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు.
విలాపవాక్యములు 3 : 48 (IRVTE)
గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి.
విలాపవాక్యములు 3 : 49 (IRVTE)
నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది.
విలాపవాక్యములు 3 : 50 (IRVTE)
యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ,
విలాపవాక్యములు 3 : 51 (IRVTE)
నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది.
విలాపవాక్యములు 3 : 52 (IRVTE)
నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది.
విలాపవాక్యములు 3 : 53 (IRVTE)
ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు.
విలాపవాక్యములు 3 : 54 (IRVTE)
వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు.
విలాపవాక్యములు 3 : 55 (IRVTE)
నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను.
విలాపవాక్యములు 3 : 56 (IRVTE)
యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను.
విలాపవాక్యములు 3 : 57 (IRVTE)
సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు.
విలాపవాక్యములు 3 : 58 (IRVTE)
నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు.
విలాపవాక్యములు 3 : 59 (IRVTE)
ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు.
విలాపవాక్యములు 3 : 60 (IRVTE)
యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు.
విలాపవాక్యములు 3 : 61 (IRVTE)
నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు.
విలాపవాక్యములు 3 : 62 (IRVTE)
యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు.
విలాపవాక్యములు 3 : 63 (IRVTE)
నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు.
విలాపవాక్యములు 3 : 64 (IRVTE)
యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి.
విలాపవాక్యములు 3 : 65 (IRVTE)
యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు.
విలాపవాక్యములు 3 : 66 (IRVTE)
వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు. యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66