విలాపవాక్యములు 5 : 1 (IRVTE)
కృప కోసం ప్రార్థన
విలాపవాక్యములు 5 : 2 (IRVTE)
యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు.
విలాపవాక్యములు 5 : 3 (IRVTE)
మా స్వాస్థ్యం పరదేశుల వశం అయ్యింది. మా ఇళ్ళు అన్యుల స్వాధీనం అయ్యాయి.
విలాపవాక్యములు 5 : 4 (IRVTE)
మేము అనాథలం అయ్యాం. తండ్రులు ఇంక లేరు. మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు.
విలాపవాక్యములు 5 : 5 (IRVTE)
మా నీళ్లు మేము డబ్బుతో కొనుక్కుని తాగాం. మా కట్టెలు మాకే అమ్మారు.
విలాపవాక్యములు 5 : 6 (IRVTE)
వాళ్ళు మమ్మల్ని తరిమారు. మేము అలసిపోయాం. మాకు విశ్రాంతి లేదు.
విలాపవాక్యములు 5 : 7 (IRVTE)
అన్నం కోసం ఐగుప్తీయులకూ అష్షూరీయులకూ చెయ్యి చాపాం.
విలాపవాక్యములు 5 : 8 (IRVTE)
మా పితరులు* పితరులుపూర్వీకులు పాపం చేసి చనిపోయారు. మేము వాళ్ళ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం.
విలాపవాక్యములు 5 : 9 (IRVTE)
దాసులు మమ్మల్ని ఏలుతున్నారు. వాళ్ళ వశం నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరు.
విలాపవాక్యములు 5 : 10 (IRVTE)
ఎడారి ప్రజల కత్తి భయంతో ప్రాణానికి తెగించి మా ఆహారం తెచ్చుకుంటున్నాం.
విలాపవాక్యములు 5 : 11 (IRVTE)
కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది.
విలాపవాక్యములు 5 : 12 (IRVTE)
శత్రువులు సీయోనులో స్త్రీలను, యూదా పట్టణాల్లో కన్యకలను మానభంగం చేశారు.
విలాపవాక్యములు 5 : 13 (IRVTE)
అధిపతులను వాళ్ళు ఉరి తీశారు. పెద్దలను ఘనపరచలేదు.
విలాపవాక్యములు 5 : 14 (IRVTE)
బలమైన యువకులను గానుగల దగ్గరికి తీసుకొచ్చారు. యువకులు కొయ్య దుంగలు మొయ్యలేక తూలిపడ్డారు.
విలాపవాక్యములు 5 : 15 (IRVTE)
పెద్దలను గుమ్మాల దగ్గర కూర్చోకుండా తొలగించారు. యువకులను సంగీతం నుంచి దూరం చేశారు.
విలాపవాక్యములు 5 : 16 (IRVTE)
మా గుండెల్లో ఆనందం అడుగంటింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది.
విలాపవాక్యములు 5 : 17 (IRVTE)
మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ!
విలాపవాక్యములు 5 : 18 (IRVTE)
మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి.
విలాపవాక్యములు 5 : 19 (IRVTE)
సీయోను పర్వతం నిర్జీవంగా ఉంది. దాని మీద నక్కలు తిరుగులాడుతున్నాయి.
విలాపవాక్యములు 5 : 20 (IRVTE)
యెహోవా, నువ్వు నిత్యం పరిపాలిస్తావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.
విలాపవాక్యములు 5 : 21 (IRVTE)
నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు? మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా?
విలాపవాక్యములు 5 : 22 (IRVTE)
యెహోవా, నువ్వు మమ్మల్ని నీ వైపుకు మళ్ళీ తిప్పు. మేము తిరుగుతాం. నువ్వు మమ్మల్ని పూర్తిగా విడిచి పెట్టకపోతే, మా మీద నీకు విపరీతమైన కోపం లేకపోతే మా పూర్వస్థితి మళ్ళీ మాకు కలిగించు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22