లూకా సువార్త 1 : 1 (IRVTE)
{పరిచయం} [PS] ఘనులైన తియొఫిలా,
లూకా సువార్త 1 : 2 (IRVTE)
మొదటి నుంచీ కళ్ళారా చూసిన వాక్య సేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలా మంది పూనుకున్నారు.
లూకా సువార్త 1 : 3 (IRVTE)
కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు కచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటిని మొదటి నుండీ పరిశోధించి కూలంకషంగా తెలుసుకున్న నేను నీ కోసం
లూకా సువార్త 1 : 4 (IRVTE)
వాటన్నిటినీ క్రమపద్ధతిలో రాయడం మంచిదని నాకు అనిపించింది. [PS]
లూకా సువార్త 1 : 5 (IRVTE)
{బాప్తిసమిచ్చే యోహాను జనన ప్రకటన} [PS] యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు.
లూకా సువార్త 1 : 6 (IRVTE)
వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు.
లూకా సువార్త 1 : 7 (IRVTE)
అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు. [PE][PS]
లూకా సువార్త 1 : 8 (IRVTE)
జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా
లూకా సువార్త 1 : 9 (IRVTE)
యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది.
లూకా సువార్త 1 : 10 (IRVTE)
ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు. [PE][PS]
లూకా సువార్త 1 : 11 (IRVTE)
ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు.
లూకా సువార్త 1 : 12 (IRVTE)
జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు.
లూకా సువార్త 1 : 13 (IRVTE)
అప్పుడా దూత అతనితో, “జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు.
లూకా సువార్త 1 : 14 (IRVTE)
అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది. అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు. [PE][PS]
లూకా సువార్త 1 : 15 (IRVTE)
అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు.
లూకా సువార్త 1 : 16 (IRVTE)
ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు.
లూకా సువార్త 1 : 17 (IRVTE)
తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్ళించి, అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు. తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు” అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 18 (IRVTE)
దేవదూతతో జెకర్యా, “ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు” అన్నాడు
లూకా సువార్త 1 : 19 (IRVTE)
దూత, “నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు.
లూకా సువార్త 1 : 20 (IRVTE)
నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు” అని అతనితో అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 21 (IRVTE)
ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు.
లూకా సువార్త 1 : 22 (IRVTE)
అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.
లూకా సువార్త 1 : 23 (IRVTE)
అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరవాత ఇంటికి వెళ్ళి పోయాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 24 (IRVTE)
ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు.
లూకా సువార్త 1 : 25 (IRVTE)
ఆమె, “దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు” అనుకుంది. [PS]
లూకా సువార్త 1 : 26 (IRVTE)
{క్రీస్తు జనన ప్రకటన} [PS] ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో
లూకా సువార్త 1 : 27 (IRVTE)
దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ. [PE][PS]
లూకా సువార్త 1 : 28 (IRVTE)
ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, “అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు” అని పలికాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 29 (IRVTE)
ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా,
లూకా సువార్త 1 : 30 (IRVTE)
దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది.
లూకా సువార్త 1 : 31 (IRVTE)
ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
లూకా సువార్త 1 : 32 (IRVTE)
ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.
లూకా సువార్త 1 : 33 (IRVTE)
ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 34 (IRVTE)
మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది.
లూకా సువార్త 1 : 35 (IRVTE)
ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.
లూకా సువార్త 1 : 36 (IRVTE)
పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల.
లూకా సువార్త 1 : 37 (IRVTE)
దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు. [PE][PS]
లూకా సువార్త 1 : 38 (IRVTE)
అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు. [PS]
లూకా సువార్త 1 : 39 (IRVTE)
{మరియ ఎలీసబెతును సందర్శించడం} [PS] (39-40) ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది.
లూకా సువార్త 1 : 40 (IRVTE)
లూకా సువార్త 1 : 41 (IRVTE)
ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది. [PE][PS]
లూకా సువార్త 1 : 42 (IRVTE)
“స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది.
లూకా సువార్త 1 : 43 (IRVTE)
నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!
లూకా సువార్త 1 : 44 (IRVTE)
నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు.
లూకా సువార్త 1 : 45 (IRVTE)
ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు” అంది.
లూకా సువార్త 1 : 46 (IRVTE)
{మరియ స్తోత్ర పాఠం} (1సమూ 2:1-10) [PS] అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది. [QBR]
లూకా సువార్త 1 : 47 (IRVTE)
ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు. [QBR]
లూకా సువార్త 1 : 48 (IRVTE)
(48-49) నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. [QBR] సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం. [QBR]
లూకా సువార్త 1 : 49 (IRVTE)
లూకా సువార్త 1 : 50 (IRVTE)
ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది. [QBR]
లూకా సువార్త 1 : 51 (IRVTE)
ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు. [QBR]
లూకా సువార్త 1 : 52 (IRVTE)
బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు [QBR]
లూకా సువార్త 1 : 53 (IRVTE)
ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు. [QBR]
లూకా సువార్త 1 : 54 (IRVTE)
(54-55) అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి, [QBR] వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు, [QBR] ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.” [PE][PS]
లూకా సువార్త 1 : 55 (IRVTE)
లూకా సువార్త 1 : 56 (IRVTE)
మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది. [PS]
లూకా సువార్త 1 : 57 (IRVTE)
{బాప్తిసమిచ్చే యోహాను జననం} [PS] ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది.
లూకా సువార్త 1 : 58 (IRVTE)
అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు.
లూకా సువార్త 1 : 59 (IRVTE)
వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా
లూకా సువార్త 1 : 60 (IRVTE)
తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది.
లూకా సువార్త 1 : 61 (IRVTE)
అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని,
లూకా సువార్త 1 : 62 (IRVTE)
“వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు.
లూకా సువార్త 1 : 63 (IRVTE)
అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు.
లూకా సువార్త 1 : 64 (IRVTE)
వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు.
లూకా సువార్త 1 : 65 (IRVTE)
అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు.
లూకా సువార్త 1 : 66 (IRVTE)
జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు.
లూకా సువార్త 1 : 67 (IRVTE)
అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు, [QBR]
లూకా సువార్త 1 : 68 (IRVTE)
“ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక. [QBR] ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు. [QBR]
లూకా సువార్త 1 : 69 (IRVTE)
తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు. [QBR]
లూకా సువార్త 1 : 70 (IRVTE)
(70-73) మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు. [QBR] దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు. [QBR] ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను, [QBR] అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు. [QBR]
లూకా సువార్త 1 : 71 (IRVTE)
లూకా సువార్త 1 : 72 (IRVTE)
లూకా సువార్త 1 : 73 (IRVTE)
లూకా సువార్త 1 : 74 (IRVTE)
(74-75) మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, [QBR] పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, [QBR] పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, [QBR] భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, [QBR] మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం. [QBR]
లూకా సువార్త 1 : 75 (IRVTE)
లూకా సువార్త 1 : 76 (IRVTE)
(76-78) ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. [QBR] మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, [QBR] వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, [QBR] ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు. [QBR]
లూకా సువార్త 1 : 77 (IRVTE)
లూకా సువార్త 1 : 78 (IRVTE)
లూకా సువార్త 1 : 79 (IRVTE)
మన పాదాలను శాంతి మార్గంలో [QBR] నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది. [QBR] ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.” [PE][PS]
లూకా సువార్త 1 : 80 (IRVTE)
ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80

BG:

Opacity:

Color:


Size:


Font: