లూకా సువార్త 22 : 1 (IRVTE)
{యేసును పట్టివ్వడానికి యూదా లాలూచీ} [PS] పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది.
లూకా సువార్త 22 : 2 (IRVTE)
ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు. [PE][PS]
లూకా సువార్త 22 : 3 (IRVTE)
అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.
లూకా సువార్త 22 : 4 (IRVTE)
దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు.
లూకా సువార్త 22 : 5 (IRVTE)
దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు.
లూకా సువార్త 22 : 6 (IRVTE)
అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు. [PS]
లూకా సువార్త 22 : 7 (IRVTE)
{పస్కా ఏర్పాట్లు} (మత్తయి 26:17-19; మార్కు 14:12-16) [PS] పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది.
లూకా సువార్త 22 : 8 (IRVTE)
యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు.
లూకా సువార్త 22 : 9 (IRVTE)
వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు.
లూకా సువార్త 22 : 10 (IRVTE)
ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి.
లూకా సువార్త 22 : 11 (IRVTE)
మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి.
లూకా సువార్త 22 : 12 (IRVTE)
అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు.
లూకా సువార్త 22 : 13 (IRVTE)
సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు. [PS]
లూకా సువార్త 22 : 14 (IRVTE)
{చివరి పస్కా} (మత్తయి 26:20; మార్కు 14:17; యోహా 13) [PS] సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు.
లూకా సువార్త 22 : 15 (IRVTE)
అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను.
లూకా సువార్త 22 : 16 (IRVTE)
ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.”
లూకా సువార్త 22 : 17 (IRVTE)
తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి.
లూకా సువార్త 22 : 18 (IRVTE)
ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు. [PS]
లూకా సువార్త 22 : 19 (IRVTE)
{ప్రభు రాత్రి భోజన సంస్కారం స్థాపన} (మత్తయి 26:26-29; మార్కు 14:22-25) [PS] ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు.
లూకా సువార్త 22 : 20 (IRVTE)
అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన. [PS]
లూకా సువార్త 22 : 21 (IRVTE)
{యేసు తనకు జరగనైయున్న ద్రోహం గురించి వెల్లడించడం} (మత్తయి 26:21-25; మార్కు 14:18-21; యోహా 13:18-30) [PS] “వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు.
లూకా సువార్త 22 : 22 (IRVTE)
దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు” అన్నాడు,
లూకా సువార్త 22 : 23 (IRVTE)
ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. మత్తయి 20:25, 28; మార్కు 10:42-45 [PE][PS]
లూకా సువార్త 22 : 24 (IRVTE)
{తమలో ఎవరు గొప్పవారని శిష్యుల మధ్య వాదం} [PS] తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది.
లూకా సువార్త 22 : 25 (IRVTE)
అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు.
లూకా సువార్త 22 : 26 (IRVTE)
మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి.
లూకా సువార్త 22 : 27 (IRVTE)
అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను. [PS]
లూకా సువార్త 22 : 28 (IRVTE)
{రానున్న రాజ్యంలో అపొస్తలుల స్థానం} (మత్తయి 19:28; ప్రక 3:21) [PS] “నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు.
లూకా సువార్త 22 : 29 (IRVTE)
నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి,
లూకా సువార్త 22 : 30 (IRVTE)
సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను. [PS]
లూకా సువార్త 22 : 31 (IRVTE)
{పేతురు చెప్పనున్న అబద్ధం} (మత్తయి 26:33-35; మార్కు 14:29-31) [PS] “సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు.
లూకా సువార్త 22 : 32 (IRVTE)
నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.”
లూకా సువార్త 22 : 33 (IRVTE)
కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు.
లూకా సువార్త 22 : 34 (IRVTE)
అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు. [PS]
లూకా సువార్త 22 : 35 (IRVTE)
{వాటిల్లబోయే గడ్డు పరిస్థితి గురించి శిష్యులకు హెచ్చరికలు} [PS] ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు.
లూకా సువార్త 22 : 36 (IRVTE)
ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి. [PE][PS]
లూకా సువార్త 22 : 37 (IRVTE)
‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు.
లూకా సువార్త 22 : 38 (IRVTE)
శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు. మత్తయి 26:36-46; మార్కు 14:32, 42; యోహా 18:1 [PE][PS]
లూకా సువార్త 22 : 39 (IRVTE)
{గేత్సెమనే వనంలో యేసు} [PS] భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.
లూకా సువార్త 22 : 40 (IRVTE)
వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.
లూకా సువార్త 22 : 41 (IRVTE)
వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు.
లూకా సువార్త 22 : 42 (IRVTE)
“తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.”
లూకా సువార్త 22 : 43 (IRVTE)
అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు. [PE][PS]
లూకా సువార్త 22 : 44 (IRVTE)
ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది.
లూకా సువార్త 22 : 45 (IRVTE)
ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు.
లూకా సువార్త 22 : 46 (IRVTE)
వారితో, “మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి” అన్నాడు. [PS]
లూకా సువార్త 22 : 47 (IRVTE)
{యూదా ద్రోహం} (మత్తయి 26:47-56; మార్కు 14:43-50; యోహా 18:3-11) [PS] ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు.
లూకా సువార్త 22 : 48 (IRVTE)
అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు.
లూకా సువార్త 22 : 49 (IRVTE)
ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి, “ప్రభూ, కత్తితో నరకమంటావా?” అని అడిగారు.
లూకా సువార్త 22 : 50 (IRVTE)
ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు.
లూకా సువార్త 22 : 51 (IRVTE)
దానికి యేసు, “అంతటితో ఆగండి” అని అతని చెవిని తాకి బాగుచేశాడు. [PE][PS]
లూకా సువార్త 22 : 52 (IRVTE)
తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో, “ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా?
లూకా సువార్త 22 : 53 (IRVTE)
నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ఆధిపత్యం” అన్నాడు. యేసును బంధించడం. పేతురు అబద్ధం మత్తయి 26:57, 69-75; మార్కు 14:53, 54, 66-72; యోహా 18:12, 15-18, 25-27 [PE][PS]
లూకా సువార్త 22 : 54 (IRVTE)
వారు ఆయనను పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు.
లూకా సువార్త 22 : 55 (IRVTE)
అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వెళ్ళి వారితో కూర్చున్నాడు. [PE][PS]
లూకా సువార్త 22 : 56 (IRVTE)
అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి, “ఈ మనిషి కూడా అతనితో ఉన్నవాడే” అంది.
లూకా సువార్త 22 : 57 (IRVTE)
దానికి పేతురు, “అమ్మాయీ, అతనెవరో నాకు తెలియదు” అన్నాడు.
లూకా సువార్త 22 : 58 (IRVTE)
కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు.
లూకా సువార్త 22 : 59 (IRVTE)
మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి, “ఇతడు కచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయ వాడే” అని నొక్కి చెప్పాడు.
లూకా సువార్త 22 : 60 (IRVTE)
అందుకు పేతురు, “నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు” అన్నాడు. అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది.
లూకా సువార్త 22 : 61 (IRVTE)
అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. “నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని” ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది.
లూకా సువార్త 22 : 62 (IRVTE)
దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు. మత్తయి 26:67, 68; మార్కు 14:65; యోహా 18:22, 23 [PE][PS]
లూకా సువార్త 22 : 63 (IRVTE)
{యేసును కొట్టడం} [PS] యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు.
లూకా సువార్త 22 : 64 (IRVTE)
ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు.
లూకా సువార్త 22 : 65 (IRVTE)
ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు. [PS]
లూకా సువార్త 22 : 66 (IRVTE)
{సన్ హెడ్రిన్ సభ ఎదుట యేసు} (మత్తయి 26:59-68; మార్కు 14:55-65; యోహా 18:19-24) [PS] ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు.
లూకా సువార్త 22 : 67 (IRVTE)
“నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు” అన్నారు. అందుకాయన, “నేను మీతో చెప్పినా మీరు నమ్మరు.
లూకా సువార్త 22 : 68 (IRVTE)
అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు.
లూకా సువార్త 22 : 69 (IRVTE)
అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు” అన్నాడు.
లూకా సువార్త 22 : 70 (IRVTE)
“అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు.
లూకా సువార్త 22 : 71 (IRVTE)
అందుకు వారు, “మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటి మాట మనమే విన్నాం కదా” అన్నారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71

BG:

Opacity:

Color:


Size:


Font: