మార్కు సువార్త 15 : 1 (IRVTE)
{పిలాతు ముందు యేసు} [PS] తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు.
మార్కు సువార్త 15 : 2 (IRVTE)
పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ప్రశ్నించాడు. అందుకు యేసు, “నువ్వే అంటున్నావుగా” అని అతనికి జవాబిచ్చాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 3 (IRVTE)
ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు.
మార్కు సువార్త 15 : 4 (IRVTE)
కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, “వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు! నీవేమీ జవాబు చెప్పవా?” అన్నాడు.
మార్కు సువార్త 15 : 5 (IRVTE)
అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. [PS]
మార్కు సువార్త 15 : 6 (IRVTE)
{యేసు కాదు బరబ్బాయే} (మత్తయి 27:16-26; లూకా 23:16-25; యోహా 18:40) [PS] పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ.
మార్కు సువార్త 15 : 7 (IRVTE)
బరబ్బ అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఉన్నాడు.
మార్కు సువార్త 15 : 8 (IRVTE)
జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 9 (IRVTE)
పిలాతు, “యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అని అన్నాడు.
మార్కు సువార్త 15 : 10 (IRVTE)
ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు.
మార్కు సువార్త 15 : 11 (IRVTE)
కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 12 (IRVTE)
పిలాతు, “అలాగైతే ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు?” అని అడిగాడు.
మార్కు సువార్త 15 : 13 (IRVTE)
వారు కేకలు వేస్తూ, “సిలువ వేయండి” అన్నారు.
మార్కు సువార్త 15 : 14 (IRVTE)
పిలాతు, “ఎందుకు? అతడు చేసిన నేరమేంటి?” అన్నాడు. జనసమూహం, “సిలువ వేయండి” అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.
మార్కు సువార్త 15 : 15 (IRVTE)
ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు. [PS]
మార్కు సువార్త 15 : 16 (IRVTE)
{ముళ్ళ కిరీటం} (మత్తయి 27:27-31) [PS] సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు.
మార్కు సువార్త 15 : 17 (IRVTE)
వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు.
మార్కు సువార్త 15 : 18 (IRVTE)
ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు.
మార్కు సువార్త 15 : 19 (IRVTE)
రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 20 (IRVTE)
ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు.
మార్కు సువార్త 15 : 21 (IRVTE)
కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 22 (IRVTE)
వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం.
మార్కు సువార్త 15 : 23 (IRVTE)
అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు. [PS]
మార్కు సువార్త 15 : 24 (IRVTE)
{యేసు సిలువ శిక్ష} (మత్తయి 27:33-56; యోహా 19:17-37) [PS] ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు.
మార్కు సువార్త 15 : 25 (IRVTE)
ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు.
మార్కు సువార్త 15 : 26 (IRVTE)
“యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు.
మార్కు సువార్త 15 : 27 (IRVTE)
ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువ వేశారు.
మార్కు సువార్త 15 : 28 (IRVTE)
‘ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది. [PE][PS]
మార్కు సువార్త 15 : 29 (IRVTE)
ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ, “దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా!
మార్కు సువార్త 15 : 30 (IRVTE)
ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు.
మార్కు సువార్త 15 : 31 (IRVTE)
ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, “వీడు ఇతరులను రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు!
మార్కు సువార్త 15 : 32 (IRVTE)
‘క్రీస్తు’ అనే ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 33 (IRVTE)
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.
మార్కు సువార్త 15 : 34 (IRVTE)
మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం.
మార్కు సువార్త 15 : 35 (IRVTE)
దగ్గర నిలుచున్న కొందరు అది విని, “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 36 (IRVTE)
ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్ళి స్పాంజ్ ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. “ఏలీయా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అని అతడు అన్నాడు.
మార్కు సువార్త 15 : 37 (IRVTE)
అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.
మార్కు సువార్త 15 : 38 (IRVTE)
ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది. [PE][PS]
మార్కు సువార్త 15 : 39 (IRVTE)
యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు.
మార్కు సువార్త 15 : 40 (IRVTE)
కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఉన్నారు.
మార్కు సువార్త 15 : 41 (IRVTE)
యేసు గలిలయలో ఉన్నపుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. [PS]
మార్కు సువార్త 15 : 42 (IRVTE)
{సమాధి} (మత్తయి 27:57-61; లూకా 23:50-56; యోహా 19:38-42) [PS] అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు.
మార్కు సువార్త 15 : 43 (IRVTE)
యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 44 (IRVTE)
యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు.
మార్కు సువార్త 15 : 45 (IRVTE)
ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు.
మార్కు సువార్త 15 : 46 (IRVTE)
యోసేపు సన్న నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు.
మార్కు సువార్త 15 : 47 (IRVTE)
మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47

BG:

Opacity:

Color:


Size:


Font: