మార్కు సువార్త 4 : 1 (IRVTE)
{విత్తనాలు చల్లేవాడి ఉపమానం} (మత్తయి 13:1-23; లూకా 8:4-15) [PS] మరొకసారి ఆయన సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన చుట్టూ చాలా మంది ప్రజలు ఉండడం వల్ల, ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. [PE][PS]
మార్కు సువార్త 4 : 2 (IRVTE)
ఆయన ఉదాహరణల సహాయంతో అనేక విషయాలు వారికి బోధించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు.
మార్కు సువార్త 4 : 3 (IRVTE)
“వినండి! ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు.
మార్కు సువార్త 4 : 4 (IRVTE)
విత్తనాలు చల్లుతూ ఉండగా, కొన్ని దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి. [PE][PS]
మార్కు సువార్త 4 : 5 (IRVTE)
మరికొన్ని విత్తనాలు, మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. అవి త్వరగానే మొలకెత్తాయి.
మార్కు సువార్త 4 : 6 (IRVTE)
కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి. [PE][PS]
మార్కు సువార్త 4 : 7 (IRVTE)
ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు పెరిగి మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు రాలేదు. [PE][PS]
మార్కు సువార్త 4 : 8 (IRVTE)
మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి ముప్ఫై రెట్లు, అరవై రెట్లు, వంద రెట్లు పండి కోతకు వచ్చాయి.”
మార్కు సువార్త 4 : 9 (IRVTE)
యేసు ఇలా చెప్పి, “వినడానికి చెవులు ఉన్నవాడు వినుగాక” అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 4 : 10 (IRVTE)
తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి ఆయనను అడిగారు.
మార్కు సువార్త 4 : 11 (IRVTE)
ఆయన వారితో, “దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం మీకు చెప్పాను. కాని బయటి వారికి ప్రతి విషయమూ ఉపమానాల రూపంలోనే లభిస్తుంది.
మార్కు సువార్త 4 : 12 (IRVTE)
ఎందుకంటే, [QBR] వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి. [QBR] వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. [QBR] లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.” [PS]
మార్కు సువార్త 4 : 13 (IRVTE)
{ఉపమానం వివరణ} (మత్తయి 13:18-23; లూకా 8:11-15) [PS] ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు?
మార్కు సువార్త 4 : 14 (IRVTE)
విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.
మార్కు సువార్త 4 : 15 (IRVTE)
దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు. [PE][PS]
మార్కు సువార్త 4 : 16 (IRVTE)
అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.
మార్కు సువార్త 4 : 17 (IRVTE)
కానీ వారిలో వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు.
మార్కు సువార్త 4 : 18 (IRVTE)
కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు.
మార్కు సువార్త 4 : 19 (IRVTE)
కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి. [PE][PS]
మార్కు సువార్త 4 : 20 (IRVTE)
మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు.” [PS]
మార్కు సువార్త 4 : 21 (IRVTE)
{దీపం ఉపమానం} (మత్తయి 5:15-16; లూకా 8:16; 11:33) [PS] ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “దీపాన్ని తెచ్చి బోర్లించిన పాత్ర కింద, లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాం గదా!
మార్కు సువార్త 4 : 22 (IRVTE)
దాచి ఉంచినవన్నీ బహిర్గతమౌతాయి. అన్ని రహస్యాలూ బయట పడిపోతాయి.
మార్కు సువార్త 4 : 23 (IRVTE)
వినడానికి చెవులు గలవాడు వినుగాక.” [PE][PS]
మార్కు సువార్త 4 : 24 (IRVTE)
యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు.
మార్కు సువార్త 4 : 25 (IRVTE)
కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు.” [PS]
మార్కు సువార్త 4 : 26 (IRVTE)
{లోలోపలి ఎదుగుదల} [PS] ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది.
మార్కు సువార్త 4 : 27 (IRVTE)
ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి.
మార్కు సువార్త 4 : 28 (IRVTE)
ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి.
మార్కు సువార్త 4 : 29 (IRVTE)
పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు.” మత్తయి 13:31, 32; లూకా 13:18-19 [PE][PS]
మార్కు సువార్త 4 : 30 (IRVTE)
{ఆవగింజ ఉపమానం} [PS] ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం?
మార్కు సువార్త 4 : 31 (IRVTE)
అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అది చిన్నది.
మార్కు సువార్త 4 : 32 (IRVTE)
కాని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి.” [PE][PS]
మార్కు సువార్త 4 : 33 (IRVTE)
యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు.
మార్కు సువార్త 4 : 34 (IRVTE)
ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు. [PE][PS]
మార్కు సువార్త 4 : 35 (IRVTE)
ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు.
మార్కు సువార్త 4 : 36 (IRVTE)
శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి.
మార్కు సువార్త 4 : 37 (IRVTE)
అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి.
మార్కు సువార్త 4 : 38 (IRVTE)
పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు.
మార్కు సువార్త 4 : 39 (IRVTE)
ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది. [PE][PS]
మార్కు సువార్త 4 : 40 (IRVTE)
అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు.
మార్కు సువార్త 4 : 41 (IRVTE)
వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41

BG:

Opacity:

Color:


Size:


Font: