మత్తయి సువార్త 2 : 1 (IRVTE)
{జ్ఞానుల సందర్శన} [PS] హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి,
మత్తయి సువార్త 2 : 2 (IRVTE)
“యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం” అన్నారు. [PE][PS]
మత్తయి సువార్త 2 : 3 (IRVTE)
హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు.
మత్తయి సువార్త 2 : 4 (IRVTE)
కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, “క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు.
మత్తయి సువార్త 2 : 5 (IRVTE)
అందుకు వారు, “యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే. ఎందుకంటే, [QBR]
మత్తయి సువార్త 2 : 6 (IRVTE)
‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! [QBR] యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. [QBR] నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు. [PE][PS]
మత్తయి సువార్త 2 : 7 (IRVTE)
అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు.
మత్తయి సువార్త 2 : 8 (IRVTE)
తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ, “మీరు వెళ్ళి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పాడు. [PE][PS]
మత్తయి సువార్త 2 : 9 (IRVTE)
వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది. [PE][PS]
మత్తయి సువార్త 2 : 10 (IRVTE)
ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు.
మత్తయి సువార్త 2 : 11 (IRVTE)
ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు.
మత్తయి సువార్త 2 : 12 (IRVTE)
హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు. [PS]
మత్తయి సువార్త 2 : 13 (IRVTE)
{ఈజిప్టుకు పలాయనం} [PS] వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “లేచి బాలుణ్ణీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు” అని అతనితో చెప్పాడు.
మత్తయి సువార్త 2 : 14 (IRVTE)
యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు.
మత్తయి సువార్త 2 : 15 (IRVTE)
హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు. [QBR] ‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’ [QBR] అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది. [PS]
మత్తయి సువార్త 2 : 16 (IRVTE)
{పసి పిల్లల వధ} [PS] ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు. [QBR]
మత్తయి సువార్త 2 : 17 (IRVTE)
(17-18) “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది. [QBR] రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది. [QBR] వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది” [QBR] అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి. [PS]
మత్తయి సువార్త 2 : 18 (IRVTE)
{ఈజిప్టు నుంచి నజరేతుకు రాక} (లూకా 2:39-40) [PS] హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి,
మత్తయి సువార్త 2 : 19 (IRVTE)
“లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. బాలుడి ప్రాణం తీయాలని చూసేవారు చనిపోయారు” అని చెప్పాడు.
మత్తయి సువార్త 2 : 20 (IRVTE)
అప్పుడు యోసేపు లేచి పిల్లవాణ్ణీ తల్లినీ ఇశ్రాయేలు దేశానికి తీసుకు వచ్చాడు. [PE][PS]
మత్తయి సువార్త 2 : 21 (IRVTE)
అయితే అర్కెలా తన తండ్రి హేరోదు స్థానంలో యూదయ ప్రాంతాన్ని పాలిస్తున్నాడని విని, అక్కడికి వెళ్ళడానికి యోసేపు భయపడ్డాడు. దేవుడు అతన్ని కలలో హెచ్చరించగా గలిలయ ప్రాంతానికి వెళ్ళి,
మత్తయి సువార్త 2 : 22 (IRVTE)
నజరేతు అనే ఊరిలో నివసించాడు. యేసును నజరేయుడు అని పిలుస్తారు అని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది. [PE]
మత్తయి సువార్త 2 : 23 (IRVTE)

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: