మత్తయి సువార్త 24 : 1 (IRVTE)
యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు.
మత్తయి సువార్త 24 : 2 (IRVTE)
అందుకాయన, “మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు” అని వారితో అన్నాడు. [PS]
మత్తయి సువార్త 24 : 3 (IRVTE)
{శిష్యుల మూడు ప్రశ్నలు} (మార్కు 13:3-4; లూకా 21:7) [PS] ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు. మార్కు 13:5, 13; లూకా 21:8-19 [PE][PS]
మత్తయి సువార్త 24 : 4 (IRVTE)
{ఈ యుగం పరిణామాలు} [PS] యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి.
మత్తయి సువార్త 24 : 5 (IRVTE)
చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు.
మత్తయి సువార్త 24 : 6 (IRVTE)
అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు.
మత్తయి సువార్త 24 : 7 (IRVTE)
జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి.
మత్తయి సువార్త 24 : 8 (IRVTE)
ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే. [PE][PS]
మత్తయి సువార్త 24 : 9 (IRVTE)
“అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు.
మత్తయి సువార్త 24 : 10 (IRVTE)
ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు.
మత్తయి సువార్త 24 : 11 (IRVTE)
అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు.
మత్తయి సువార్త 24 : 12 (IRVTE)
అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది.
మత్తయి సువార్త 24 : 13 (IRVTE)
కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది.
మత్తయి సువార్త 24 : 14 (IRVTE)
రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది. [PS]
మత్తయి సువార్త 24 : 15 (IRVTE)
{మహా బాధల కాలం} (మార్కు 13:14-23) [PS] “కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక),
మత్తయి సువార్త 24 : 16 (IRVTE)
యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.
మత్తయి సువార్త 24 : 17 (IRVTE)
మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు.
మత్తయి సువార్త 24 : 18 (IRVTE)
పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు. [PE][PS]
మత్తయి సువార్త 24 : 19 (IRVTE)
అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.
మత్తయి సువార్త 24 : 20 (IRVTE)
అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి.
మత్తయి సువార్త 24 : 21 (IRVTE)
ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు.
మత్తయి సువార్త 24 : 22 (IRVTE)
ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు. [PE][PS]
మత్తయి సువార్త 24 : 23 (IRVTE)
“ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు.
మత్తయి సువార్త 24 : 24 (IRVTE)
కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.
మత్తయి సువార్త 24 : 25 (IRVTE)
ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను.
మత్తయి సువార్త 24 : 26 (IRVTE)
కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు. [PS]
మత్తయి సువార్త 24 : 27 (IRVTE)
{మహిమ సహితంగా రాజు రాక} (మార్కు 13:24-37; లూకా 21:25-36) [PS] “మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది.
మత్తయి సువార్త 24 : 28 (IRVTE)
శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి. [PE][PS]
మత్తయి సువార్త 24 : 29 (IRVTE)
“ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.
మత్తయి సువార్త 24 : 30 (IRVTE)
అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు.
మత్తయి సువార్త 24 : 31 (IRVTE)
ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు. [PS]
మత్తయి సువార్త 24 : 32 (IRVTE)
{అంజూరు చెట్టు ఉపమానం} (మార్కు 13:28-29; లూకా 21:29-31) [PS] “అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.
మత్తయి సువార్త 24 : 33 (IRVTE)
అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.
మత్తయి సువార్త 24 : 34 (IRVTE)
ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
మత్తయి సువార్త 24 : 35 (IRVTE)
ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు. [PE][PS]
మత్తయి సువార్త 24 : 36 (IRVTE)
“అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు.
మత్తయి సువార్త 24 : 37 (IRVTE)
నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది.
మత్తయి సువార్త 24 : 38 (IRVTE)
జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు.
మత్తయి సువార్త 24 : 39 (IRVTE)
జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది. [PE][PS]
మత్తయి సువార్త 24 : 40 (IRVTE)
ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు.
మత్తయి సువార్త 24 : 41 (IRVTE)
ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది.
మత్తయి సువార్త 24 : 42 (IRVTE)
ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి.
మత్తయి సువార్త 24 : 43 (IRVTE)
దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా!
మత్తయి సువార్త 24 : 44 (IRVTE)
మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. [PE][PS]
మత్తయి సువార్త 24 : 45 (IRVTE)
“ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు?
మత్తయి సువార్త 24 : 46 (IRVTE)
యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు.
మత్తయి సువార్త 24 : 47 (IRVTE)
ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
మత్తయి సువార్త 24 : 48 (IRVTE)
కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని
మత్తయి సువార్త 24 : 49 (IRVTE)
తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే,
మత్తయి సువార్త 24 : 50 (IRVTE)
అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు.
మత్తయి సువార్త 24 : 51 (IRVTE)
వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51

BG:

Opacity:

Color:


Size:


Font: