మత్తయి సువార్త 3 : 1 (IRVTE)
{బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య} [PS] (1-2) ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు.
మత్తయి సువార్త 3 : 2 (IRVTE)
పూర్వం యెషయా ప్రవక్త, [QBR] అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. [QBR] ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. [QBR] ఆయన దారులు తిన్నగా చేయండి, అని చెప్పింది ఇతని గురించే. [PE][PS]
మత్తయి సువార్త 3 : 3 (IRVTE)
ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
మత్తయి సువార్త 3 : 4 (IRVTE)
యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి,
మత్తయి సువార్త 3 : 5 (IRVTE)
తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు. [PE][PS]
మత్తయి సువార్త 3 : 6 (IRVTE)
చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
మత్తయి సువార్త 3 : 7 (IRVTE)
పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి.
మత్తయి సువార్త 3 : 8 (IRVTE)
‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను.
మత్తయి సువార్త 3 : 9 (IRVTE)
ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు. [PE][PS]
మత్తయి సువార్త 3 : 10 (IRVTE)
పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు. [PE][PS]
మత్తయి సువార్త 3 : 11 (IRVTE)
తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు” అని చెప్పాడు. [PS]
మత్తయి సువార్త 3 : 12 (IRVTE)
{యేసు బాప్తిసం} (మార్కు 1:9-11; లూకా 3:21-22; యోహా 1:31-34) [PS] ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు.
మత్తయి సువార్త 3 : 13 (IRVTE)
అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు.
మత్తయి సువార్త 3 : 14 (IRVTE)
కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు. [PE][PS]
మత్తయి సువార్త 3 : 15 (IRVTE)
యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు.
మత్తయి సువార్త 3 : 16 (IRVTE)
“ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది. [PE]
మత్తయి సువార్త 3 : 17 (IRVTE)

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: