మీకా 5 : 1 (IRVTE)
బేత్లెహేముకు రాబోయే పాలకుడు యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి. నీ పట్టణం చుట్టూ గోడ ఉంది. అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు.
మీకా 5 : 2 (IRVTE)
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు.
మీకా 5 : 3 (IRVTE)
కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు. అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు.
మీకా 5 : 4 (IRVTE)
ఆయన యెహోవా బలంతో తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో నిలబడి తన మంద మేపుతాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు.
మీకా 5 : 5 (IRVTE)
విధ్వంసం, విమోచన అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. ఆయనే మనకు శాంతి.
మీకా 5 : 6 (IRVTE)
వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన మనలను ఇలా కాపాడతాడు.
మీకా 5 : 7 (IRVTE)
యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ, యెహోవా కురిపించే మంచులాగా, మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ, గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.
మీకా 5 : 8 (IRVTE)
యాకోబు సంతానంలో మిగిలినవారు రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య అడవి జంతువుల్లోని సింహం లాగా, గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.
మీకా 5 : 9 (IRVTE)
నీ చెయ్యి నీ శత్రువుల మీద ఎత్తి ఉంటుంది. అది వారిని నిర్మూలం చేస్తుంది.
మీకా 5 : 10 (IRVTE)
యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను. నీ రథాలను ధ్వంసం చేస్తాను.
మీకా 5 : 11 (IRVTE)
నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను. నీ కోటలన్నిటినీ పడగొడతాను.
మీకా 5 : 12 (IRVTE)
మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు.
మీకా 5 : 13 (IRVTE)
చెక్కిన విగ్రహాలూ దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను. అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు.
మీకా 5 : 14 (IRVTE)
మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను. నీ పట్టణాలను పడగొడతాను.
మీకా 5 : 15 (IRVTE)
నేను మహా కోపంతో ఉగ్రతతో నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15