సంఖ్యాకాండము 1 : 1 (IRVTE)
జనాభా లెక్కలు యెహోవా సీనాయి అరణ్యంలో ఉన్న సన్నిధి గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేదీన జరిగింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
సంఖ్యాకాండము 1 : 2 (IRVTE)
“ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు.
సంఖ్యాకాండము 1 : 3 (IRVTE)
ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి.
సంఖ్యాకాండము 1 : 4 (IRVTE)
మీతో కలసి సేవ చేయడానికి ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి గోత్ర నాయకుడిగా ఉండాలి. అతడు తన తెగలో ప్రముఖుడై ఉండాలి.
సంఖ్యాకాండము 1 : 5 (IRVTE)
మీతో కలసి పోరాటాల్లో పాల్గొనే నాయకులు వీరు. రూబేను గోత్రం నుండి షెదేయూరు కొడుకు ఏలీసూరు,
సంఖ్యాకాండము 1 : 6 (IRVTE)
షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు,
సంఖ్యాకాండము 1 : 7 (IRVTE)
యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను,
సంఖ్యాకాండము 1 : 8 (IRVTE)
ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు
సంఖ్యాకాండము 1 : 9 (IRVTE)
జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
సంఖ్యాకాండము 1 : 10 (IRVTE)
యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,
సంఖ్యాకాండము 1 : 11 (IRVTE)
బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
సంఖ్యాకాండము 1 : 12 (IRVTE)
దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,
సంఖ్యాకాండము 1 : 13 (IRVTE)
ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
సంఖ్యాకాండము 1 : 14 (IRVTE)
గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
సంఖ్యాకాండము 1 : 15 (IRVTE)
నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.”
సంఖ్యాకాండము 1 : 16 (IRVTE)
సంఖ్యాకాండము 1 : 17 (IRVTE)
వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు * వెయ్యి మందికి నాయకులుగా ఉన్నారు. పెద్దలుగానూ ఉన్నారు. ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.
సంఖ్యాకాండము 1 : 18 (IRVTE)
వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.
సంఖ్యాకాండము 1 : 19 (IRVTE)
అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు.
సంఖ్యాకాండము 1 : 20 (IRVTE)
ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 21 (IRVTE)
అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 22 (IRVTE)
షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 23 (IRVTE)
అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 24 (IRVTE)
గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 25 (IRVTE)
అలా గాదు గోత్రం నుండి 45, 650 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 26 (IRVTE)
యూదా సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 27 (IRVTE)
అలా యూదా గోత్రం నుండి 74, 600 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 28 (IRVTE)
ఇశ్శాఖారు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 29 (IRVTE)
అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54, 400 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 30 (IRVTE)
జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 31 (IRVTE)
అలా జెబూలూను గోత్రం నుండి 57, 400 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 32 (IRVTE)
యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 33 (IRVTE)
అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40, 500 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 34 (IRVTE)
మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 35 (IRVTE)
అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 36 (IRVTE)
బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 37 (IRVTE)
అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 38 (IRVTE)
దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 39 (IRVTE)
అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 40 (IRVTE)
ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 41 (IRVTE)
అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 42 (IRVTE)
నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 43 (IRVTE)
అలా నఫ్తాలి గోత్రం నుండి 53, 400 మందిని లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 44 (IRVTE)
ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 45 (IRVTE)
ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధాలకు వెళ్ళగలిగే వారిందర్నీ వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 46 (IRVTE)
వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు.
సంఖ్యాకాండము 1 : 47 (IRVTE)
కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు.
సంఖ్యాకాండము 1 : 48 (IRVTE)
ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు.
సంఖ్యాకాండము 1 : 49 (IRVTE)
“లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.
సంఖ్యాకాండము 1 : 50 (IRVTE)
సంఖ్యాకాండము 1 : 51 (IRVTE)
వాళ్లకు నిబంధన శాసనాల గుడారం బాధ్యతలు అప్పగించు. శాసనాల గుడారం లోని అలంకరణలూ, వస్తువులన్నిటినీ వారు చూసుకోవాలి. లేవీయులే గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. దానిలో ఉన్న వస్తువులను వారే మోయాలి. దాని చుట్టూ వారు తమ గుడారాలు వేసుకోవాలి. గుడారాన్ని మరో స్థలానికి తరలించాల్సి వస్తే లేవీయులే దాన్ని ఊడదీయాలి. తిరిగి గుడారాన్ని నిలపాలన్నా లేవీయులే దాన్ని నిలపాలి. ఎవరన్నా పరాయి వ్యక్తి గుడారాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.
సంఖ్యాకాండము 1 : 52 (IRVTE)
ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి.
సంఖ్యాకాండము 1 : 53 (IRVTE)
నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.”
సంఖ్యాకాండము 1 : 54 (IRVTE)
ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు.
❮
❯