సంఖ్యాకాండము 1 : 1 (IRVTE)
{జనాభా లెక్కలు} [PS] యెహోవా సీనాయి అరణ్యంలో ఉన్న సన్నిధి గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేదీన జరిగింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
సంఖ్యాకాండము 1 : 2 (IRVTE)
“ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు.
సంఖ్యాకాండము 1 : 3 (IRVTE)
ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 4 (IRVTE)
మీతో కలసి సేవ చేయడానికి ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి గోత్ర నాయకుడిగా ఉండాలి. అతడు తన తెగలో ప్రముఖుడై ఉండాలి.
సంఖ్యాకాండము 1 : 5 (IRVTE)
మీతో కలసి పోరాటాల్లో పాల్గొనే నాయకులు వీరు. రూబేను గోత్రం నుండి షెదేయూరు కొడుకు ఏలీసూరు,
సంఖ్యాకాండము 1 : 6 (IRVTE)
షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు,
సంఖ్యాకాండము 1 : 7 (IRVTE)
యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను,
సంఖ్యాకాండము 1 : 8 (IRVTE)
ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు
సంఖ్యాకాండము 1 : 9 (IRVTE)
జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 10 (IRVTE)
యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,
సంఖ్యాకాండము 1 : 11 (IRVTE)
బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
సంఖ్యాకాండము 1 : 12 (IRVTE)
దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,
సంఖ్యాకాండము 1 : 13 (IRVTE)
ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
సంఖ్యాకాండము 1 : 14 (IRVTE)
గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
సంఖ్యాకాండము 1 : 15 (IRVTE)
నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.” [PE][PS]
సంఖ్యాకాండము 1 : 16 (IRVTE)
వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు [* వెయ్యి మందికి నాయకులుగా ఉన్నారు.] పెద్దలుగానూ ఉన్నారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 17 (IRVTE)
ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.
సంఖ్యాకాండము 1 : 18 (IRVTE)
వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.
సంఖ్యాకాండము 1 : 19 (IRVTE)
అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 20 (IRVTE)
ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 21 (IRVTE)
అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 22 (IRVTE)
షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 23 (IRVTE)
అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 24 (IRVTE)
గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 25 (IRVTE)
అలా గాదు గోత్రం నుండి 45, 650 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 26 (IRVTE)
యూదా సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 27 (IRVTE)
అలా యూదా గోత్రం నుండి 74, 600 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 28 (IRVTE)
ఇశ్శాఖారు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 29 (IRVTE)
అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54, 400 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 30 (IRVTE)
జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 31 (IRVTE)
అలా జెబూలూను గోత్రం నుండి 57, 400 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 32 (IRVTE)
యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 33 (IRVTE)
అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40, 500 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 34 (IRVTE)
మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 35 (IRVTE)
అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 36 (IRVTE)
బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 37 (IRVTE)
అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 38 (IRVTE)
దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 39 (IRVTE)
అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 40 (IRVTE)
ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 41 (IRVTE)
అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 42 (IRVTE)
నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
సంఖ్యాకాండము 1 : 43 (IRVTE)
అలా నఫ్తాలి గోత్రం నుండి 53, 400 మందిని లెక్కించారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 44 (IRVTE)
ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 45 (IRVTE)
ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధాలకు వెళ్ళగలిగే వారిందర్నీ వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించారు.
సంఖ్యాకాండము 1 : 46 (IRVTE)
వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 47 (IRVTE)
కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు.
సంఖ్యాకాండము 1 : 48 (IRVTE)
ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు.
సంఖ్యాకాండము 1 : 49 (IRVTE)
“లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 50 (IRVTE)
వాళ్లకు నిబంధన శాసనాల గుడారం బాధ్యతలు అప్పగించు. శాసనాల గుడారం లోని అలంకరణలూ, వస్తువులన్నిటినీ వారు చూసుకోవాలి. లేవీయులే గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. దానిలో ఉన్న వస్తువులను వారే మోయాలి. దాని చుట్టూ వారు తమ గుడారాలు వేసుకోవాలి. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 51 (IRVTE)
గుడారాన్ని మరో స్థలానికి తరలించాల్సి వస్తే లేవీయులే దాన్ని ఊడదీయాలి. తిరిగి గుడారాన్ని నిలపాలన్నా లేవీయులే దాన్ని నిలపాలి. ఎవరన్నా పరాయి వ్యక్తి గుడారాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.
సంఖ్యాకాండము 1 : 52 (IRVTE)
ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి. [PE][PS]
సంఖ్యాకాండము 1 : 53 (IRVTE)
నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.”
సంఖ్యాకాండము 1 : 54 (IRVTE)
ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు. [PE]
❮
❯