సంఖ్యాకాండము 2 : 1 (IRVTE)
యెహోవా మరోసారి మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
సంఖ్యాకాండము 2 : 2 (IRVTE)
“ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 3 (IRVTE)
యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి.
సంఖ్యాకాండము 2 : 4 (IRVTE)
యూదా దళంలో నమోదైన వారు 74, 600 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 5 (IRVTE)
యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు.
సంఖ్యాకాండము 2 : 6 (IRVTE)
నెతనేలుతో ఉన్న సైన్యంలో 54, 400 మంది పురుషులు నమోదయ్యారు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 7 (IRVTE)
ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు.
సంఖ్యాకాండము 2 : 8 (IRVTE)
అతని దళంలో నమోదైన వారు 57, 400 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 9 (IRVTE)
యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 86, 400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 10 (IRVTE)
దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు.
సంఖ్యాకాండము 2 : 11 (IRVTE)
అతని సైన్యంలో నమోదైన వారు 46, 500 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 12 (IRVTE)
రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు.
సంఖ్యాకాండము 2 : 13 (IRVTE)
అతని దళంలో నమోదైన వారు 59, 300 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 14 (IRVTE)
తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి.
సంఖ్యాకాండము 2 : 15 (IRVTE)
అతని సైన్యంలో నమోదైన వారు 45, 650 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 16 (IRVTE)
కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1, 51, 450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 17 (IRVTE)
సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 18 (IRVTE)
ఎఫ్రాయిము గోత్రం సన్నిధి గుడారానికి పడమటి వైపున ఉండాలి. అమీహూదు కొడుకు ఎలీషామా ఎఫ్రాయిము సైన్యాలకు నాయకత్వం వహించాలి.
సంఖ్యాకాండము 2 : 19 (IRVTE)
ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40, 500 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 20 (IRVTE)
మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
సంఖ్యాకాండము 2 : 21 (IRVTE)
అతని సైన్యంగా నమోదైన వారు 32, 200 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 22 (IRVTE)
మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
సంఖ్యాకాండము 2 : 23 (IRVTE)
అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 24 (IRVTE)
కాబట్టి ఎఫ్రాయిము గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,08,100 మంది పురుషులు ఉన్నారు. వారింతా మూడో వరుసలో శిబిరం నుండి కదలాలి. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 25 (IRVTE)
దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.
సంఖ్యాకాండము 2 : 26 (IRVTE)
దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62, 700 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 27 (IRVTE)
అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి.
సంఖ్యాకాండము 2 : 28 (IRVTE)
అతని సైన్యంగా 41, 500 మంది పురుషులు నమోదయ్యారు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 29 (IRVTE)
ఆషేరు గోత్రం వాళ్లకు దగ్గరలోనే నఫ్తాలి గోత్రం వారుండాలి. ఏనాను కొడుకు అహీర నఫ్తాలి గోత్రం వాళ్లకు నాయకుడిగా ఉండాలి.
సంఖ్యాకాండము 2 : 30 (IRVTE)
నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53, 400 మంది పురుషులు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 31 (IRVTE)
కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 57, 600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.” [PE][PS]
సంఖ్యాకాండము 2 : 32 (IRVTE)
ఇశ్రాయేలు ప్రజల్లో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. వీరు మొత్తం 6,03,550 మంది పురుషులు.
సంఖ్యాకాండము 2 : 33 (IRVTE)
అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం లేవీయుల సంఖ్య లెక్కపెట్టలేదు. [PE][PS]
సంఖ్యాకాండము 2 : 34 (IRVTE)
ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: