సంఖ్యాకాండము 26 : 1 (IRVTE)
రెండోసారి జనాభా లెక్కలు ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో మాట్లాడుతూ,
సంఖ్యాకాండము 26 : 2 (IRVTE)
“మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకుని ఆ పై వయస్సు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చెయ్యగల సామర్థ్యం ఉన్న వారిని, తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి” అన్నాడు.
సంఖ్యాకాండము 26 : 3 (IRVTE)
కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యోర్దాను తీరంలో మోయాబు మైదానాల్లో సమాజమంతటితో మాట్లాడుతూ,
సంఖ్యాకాండము 26 : 4 (IRVTE)
“20 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగి, ఐగుప్తులోనుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అన్నారు.
సంఖ్యాకాండము 26 : 5 (IRVTE)
ఇశ్రాయేలు పెద్దకొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి హనోకీయులు హనోకు వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 6 (IRVTE)
పల్లువీయులు పల్లు వంశస్థులు. హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 7 (IRVTE)
వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 8 (IRVTE)
పల్లు కొడుకు ఏలీయాబు. ఏలీయాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము.
సంఖ్యాకాండము 26 : 9 (IRVTE)
కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.
సంఖ్యాకాండము 26 : 10 (IRVTE)
ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.
సంఖ్యాకాండము 26 : 11 (IRVTE)
అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.
సంఖ్యాకాండము 26 : 12 (IRVTE)
షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 13 (IRVTE)
జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 14 (IRVTE)
ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 15 (IRVTE)
గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 16 (IRVTE)
ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 17 (IRVTE)
ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 18 (IRVTE)
వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40, 500 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 19 (IRVTE)
యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.
సంఖ్యాకాండము 26 : 20 (IRVTE)
యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 21 (IRVTE)
పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 22 (IRVTE)
వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 23 (IRVTE)
ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 24 (IRVTE)
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 300 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 25 (IRVTE)
జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 26 (IRVTE)
ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 27 (IRVTE)
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60, 500 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 28 (IRVTE)
యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.
సంఖ్యాకాండము 26 : 29 (IRVTE)
మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు.
సంఖ్యాకాండము 26 : 30 (IRVTE)
ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 31 (IRVTE)
అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 32 (IRVTE)
షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 33 (IRVTE)
హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళేగాని కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
సంఖ్యాకాండము 26 : 34 (IRVTE)
వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52, 700 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 35 (IRVTE)
ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు-షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 36 (IRVTE)
షూతలహు వంశస్థుడు ఏరాను. అతని వంశం ఏరాను వంశం.
సంఖ్యాకాండము 26 : 37 (IRVTE)
వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32, 500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 38 (IRVTE)
బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 39 (IRVTE)
అహీరామీయులు అహీరాము వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 40 (IRVTE)
షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 41 (IRVTE)
వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 600 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 42 (IRVTE)
దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 43 (IRVTE)
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 400 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 44 (IRVTE)
ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 45 (IRVTE)
బెరీయానీయుల్లో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 46 (IRVTE)
ఆషేరు కూతురు పేరు శెరహు.
సంఖ్యాకాండము 26 : 47 (IRVTE)
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53, 400 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 48 (IRVTE)
నఫ్తాలీ కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 49 (IRVTE)
యేసెరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 50 (IRVTE)
వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 400 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 51 (IRVTE)
ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు.
సంఖ్యాకాండము 26 : 52 (IRVTE)
యెహోవా మోషేతో “వీళ్ళ పేర్ల లెక్క ప్రకారం ఆ దేశాన్ని వీళ్ళకు స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.
సంఖ్యాకాండము 26 : 53 (IRVTE)
తమ తమ లెక్క ప్రకారం ఆ స్వాస్థ్యం వాళ్లకు ఇవ్వాలి.
సంఖ్యాకాండము 26 : 54 (IRVTE)
ఎక్కువమంది ఉన్న వంశాలకు ఎక్కువ స్వాస్థ్యం, తక్కువమంది ఉన్నవారికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. తమ తమ లెక్కను బట్టి వివిధ గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వాలి.
సంఖ్యాకాండము 26 : 55 (IRVTE)
చీటీలు వేసి ఆ భూమిని పంచిపెట్టాలి. వారు తమ తమ పితరుల గోత్రాల జనాభా లెక్క ప్రకారం స్వాస్థ్యం పొందాలి.
సంఖ్యాకాండము 26 : 56 (IRVTE)
ఎక్కువ మందికైనా తక్కువ మందికైనా చీటీలు వేసి, ఎవరి స్వాస్థ్యం వారికి పంచిపెట్టాలి.”
సంఖ్యాకాండము 26 : 57 (IRVTE)
వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 58 (IRVTE)
లేవీయుల వంశాలు ఏవంటే, లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశం.
సంఖ్యాకాండము 26 : 59 (IRVTE)
కహాతు అమ్రాము తండ్రి. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కూతురు. ఆమె ఐగుప్తులో లేవీకి పుట్టింది. ఆమె అమ్రామువల్ల అహరోను, మోషే, వీళ్ళ సహోదరి మిర్యాములను కన్నది.
సంఖ్యాకాండము 26 : 60 (IRVTE)
అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.
సంఖ్యాకాండము 26 : 61 (IRVTE)
నాదాబు అబీహులు యెహోవా సన్నిధిలో అంగీకారం కాని అగ్ని అర్పణ చేసినప్పుడు చనిపోయారు.
సంఖ్యాకాండము 26 : 62 (IRVTE)
వారిల్లో నెల మొదలుకొని పై వయస్సు కలిగి లెక్కకు వచ్చిన వాళ్లందరూ 23,000 మంది పురుషులు. వారు ఇశ్రాయేలీయుల్లో లెక్కకు రాని వారు గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్లకు స్వాస్థ్యం దక్కలేదు.
సంఖ్యాకాండము 26 : 63 (IRVTE)
యెరికో ప్రాంతాల్లో యొర్దాను దగ్గరున్న మోయాబు మైదానాల్లో మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారు వీరు.
సంఖ్యాకాండము 26 : 64 (IRVTE)
మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు.
సంఖ్యాకాండము 26 : 65 (IRVTE)
ఎందుకంటే వారు కచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెపున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిల్లో ఒక్కడైనా మిగల్లేదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65