సంఖ్యాకాండము 28 : 1 (IRVTE)
{ప్రతి రోజు అర్పణలు} [PS] యెహోవా మోషేతో మాట్లాడుతూ,
సంఖ్యాకాండము 28 : 2 (IRVTE)
“నువ్వు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో చెప్పు. నాకు ఇష్టమైన సువాసనగా మీరు దహనబలి అర్పణగా నాకు అర్పించే ఆహారం నియామక కాలంలో నా దగ్గరికి తేవడానికి జాగ్రత్త పడాలి. [PE][PS]
సంఖ్యాకాండము 28 : 3 (IRVTE)
ఇంకా నువ్వు వాళ్లకు ఈ విధంగా ఆజ్ఞాపించు. మీరు యెహోవాకు నిత్యం జరిగే దహనబలిగా ప్రతి రోజూ ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న రెండు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
సంఖ్యాకాండము 28 : 4 (IRVTE)
వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయాన, రెండోదాన్ని సాయంకాలం అర్పించాలి.
సంఖ్యాకాండము 28 : 5 (IRVTE)
మెత్తగా దంచిన ఒక కిలో పిండిని ఒక లీటరు నూనెతో కలిపి పదోవంతు నైవేద్యంగా అర్పించాలి. [PE][PS]
సంఖ్యాకాండము 28 : 6 (IRVTE)
అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా సీనాయి కొండ మీద నియమించిన నిత్యం జరిగే దహనబలి.
సంఖ్యాకాండము 28 : 7 (IRVTE)
ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించాల్సిన పానార్పణ ముప్పావు లీటరు. పవిత్రస్థలంలో యెహోవాకు మద్యం పానార్పణగా పొయ్యాలి.
సంఖ్యాకాండము 28 : 8 (IRVTE)
ఉదయ నైవేద్యం, దాని పానార్పణ అర్పించినట్టే యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా ఆ రెండో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి. [PS]
సంఖ్యాకాండము 28 : 9 (IRVTE)
{విశ్రాంతి రోజు అర్పణలు} [PS] విశ్రాంతి రోజున ఒక సంవత్సరం వయస్సు ఉండి, ఏ దోషం లేని రెండు గొర్రెపిల్లలను నైవేద్యంగాను, దానితో పాటు పానార్పణ, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు అర్పించాలి.
సంఖ్యాకాండము 28 : 10 (IRVTE)
నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా, ఇది ప్రతి విశ్రాంతి రోజు చెయ్యాల్సిన దహనబలి. [PS]
సంఖ్యాకాండము 28 : 11 (IRVTE)
{ప్రతినెల అర్పణలు} [PS] ప్రతినెల మొదటి రోజు యెహోవాకు దహన బలి అర్పించాలి. రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు గొర్రెపిల్లలు అర్పించాలి. వాటిలో ప్రతి లేగ దూడతో
సంఖ్యాకాండము 28 : 12 (IRVTE)
నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో మూడు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క పొట్టేలుతో, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో ఒక్క పదో వంతు నైవేద్యంగా అర్పించాలి.
సంఖ్యాకాండము 28 : 13 (IRVTE)
అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలి. [PE][PS]
సంఖ్యాకాండము 28 : 14 (IRVTE)
వాటి పానార్పణలు ఒక్కొక్క దున్నపోతుతో ఒక లీటరు ద్రాక్షారసం, పొట్టేలుతో ఒక లీటరు, గొర్రెపిల్లతో ముప్పావు లీటరు ఉండాలి. ఇది సంవత్సరంలో ప్రతినెలా జరగాల్సిన దహనబలి.
సంఖ్యాకాండము 28 : 15 (IRVTE)
నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా ఒక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పించాలి. [PS]
సంఖ్యాకాండము 28 : 16 (IRVTE)
{పస్కాపండగ} [PS] మొదటి నెల 14 వ రోజు యెహోవా పస్కాపండగ వస్తుంది.
సంఖ్యాకాండము 28 : 17 (IRVTE)
ఆ నెల 15 వ రోజు పండగ జరుగుతుంది. ఏడు రోజులు పొంగని రొట్టెలే తినాలి.
సంఖ్యాకాండము 28 : 18 (IRVTE)
మొదటి రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు. [PE][PS]
సంఖ్యాకాండము 28 : 19 (IRVTE)
అయితే, యెహోవాకు దహనబలిగా మీరు రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు మగ గొర్రెపిల్లలు అర్పించాలి. అవి మీ మందల్లో ఏ దోషం లేనివిగా ఉండాలి.
సంఖ్యాకాండము 28 : 20 (IRVTE)
వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి.
సంఖ్యాకాండము 28 : 21 (IRVTE)
ఒక్కొక్క దున్నపోతుతో నూనెతో కలిపిన ఆరు లీటర్ల మెత్తని పిండి, పొట్టేలుతో నూనెతో కలిపిన నాలుగు లీటర్ల మెత్తని పిండి, ఆ ఏడు గొర్రెపిల్లల్లో ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన రెండు లీటర్ల మెత్తని పిండి అర్పించాలి.
సంఖ్యాకాండము 28 : 22 (IRVTE)
మీకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పించాలి. [PE][PS]
సంఖ్యాకాండము 28 : 23 (IRVTE)
ఉదయాన మీరు నిత్యం అర్పించే దహనబలి కాకుండా వీటిని మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 28 : 24 (IRVTE)
ఆ విధంగానే, ఆ ఏడు రోజుల్లో ప్రతిరోజూ యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే పదార్థం ఆహారంగా అర్పించాలి. నిత్యం జరిగే దహనబలి, దాని పానార్పణ కాకుండా దాన్ని కూడా అర్పించాలి.
సంఖ్యాకాండము 28 : 25 (IRVTE)
ఏడో రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు. [PS]
సంఖ్యాకాండము 28 : 26 (IRVTE)
{వారాల పండగ} [PS] ఇంకా, ప్రథమ ఫలాలు అర్పించే రోజు, అంటే, వారాల పండగరోజు మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పవిత్ర సంఘంగా సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు. [PE][PS]
సంఖ్యాకాండము 28 : 27 (IRVTE)
యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలిగా మీరు రెండు దున్నపోతు దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు మగ గొర్రెపిల్లలను, వాటికి నైవేద్యంగా ప్రతి దున్నపోతు దూడతో
సంఖ్యాకాండము 28 : 28 (IRVTE)
నూనెతో కలిపిన ఆరు కిలోల మెత్తని పిండిలో మూడు పదో వంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదో వంతులు,
సంఖ్యాకాండము 28 : 29 (IRVTE)
ఆ ఏడు గొర్రెపిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదో వంతు,
సంఖ్యాకాండము 28 : 30 (IRVTE)
మీ కోసం ప్రాయశ్చిత్తం చెయ్యడానికి ఒక మేకపిల్ల, అర్పించాలి.
సంఖ్యాకాండము 28 : 31 (IRVTE)
నిత్యం జరిగే దహనబలి, దాని నైవేద్యం కాకుండా వాటినీ, వాటి పానార్పణను అర్పించాలి. అవి ఏ దోషం లేనివిగా ఉండాలి.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: