సంఖ్యాకాండము 31 : 1 (IRVTE)
మిద్యానీయులు మీద ప్రతీకారం యెహోవా “మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోండి.
సంఖ్యాకాండము 31 : 2 (IRVTE)
ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు” అని మోషేకు చెప్పాడు.
సంఖ్యాకాండము 31 : 3 (IRVTE)
అప్పుడు మోషే “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి పోయి వారికి యెహోవా విధించిన ప్రతిదండన చేయండి.
సంఖ్యాకాండము 31 : 4 (IRVTE)
ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుండి వెయ్యిమంది చొప్పున యుద్ధానికి పంపండి” అని ప్రజలతో అన్నాడు.
సంఖ్యాకాండము 31 : 5 (IRVTE)
ఆ విధంగా గోత్రానికి వెయ్యి మంది చొప్పున, ఇశ్రాయేలీయుల మొత్తం సైన్యంలో నుండి పన్నెండు వేల మంది యుద్ధ వీరులను సిద్ధం చేశారు.
సంఖ్యాకాండము 31 : 6 (IRVTE)
మోషే వారిని, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసుతో పంపించాడు. అతనికి పరిశుద్ధమైన కొన్ని వస్తువులు, యుద్ధంలో ఊదటానికి బాకాలు పంపాడు.
సంఖ్యాకాండము 31 : 7 (IRVTE)
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపేశారు.
సంఖ్యాకాండము 31 : 8 (IRVTE)
వారు కాక మిద్యాను రాజులు, ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే ఐదుగుర్ని చంపారు. బెయోరు కొడుకు బిలామును కత్తితో చంపేశారు.
సంఖ్యాకాండము 31 : 9 (IRVTE)
వారు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని, వారి పశువులు, గొర్రెలు, మేకలు అన్నిటిని, వారి సమస్తాన్ని దోచుకున్నారు.
సంఖ్యాకాండము 31 : 10 (IRVTE)
వారి పట్టణాలు, కోటలు అన్నిటిని తగలబెట్టారు.
సంఖ్యాకాండము 31 : 11 (IRVTE)
వారు మనుషులను గాని పశువులను గాని మిద్యానీయుల ఆస్తి అంతటినీ కొల్లగొట్టారు.
సంఖ్యాకాండము 31 : 12 (IRVTE)
తరువాత వారు దానంతటినీ, చెరపట్టిన వారిని మోయాబు మైదానాల్లో యెరికో దగ్గర యొర్దాను పక్కన విడిది చేసి ఉన్న మోషే, యాజకుడు ఎలియాజరు దగ్గరికి, ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరికి తీసుకు వచ్చారు.
సంఖ్యాకాండము 31 : 13 (IRVTE)
అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు, సమాజ నాయకులంతా విడిది బయటికి వారికి ఎదురు వెళ్ళారు.
సంఖ్యాకాండము 31 : 14 (IRVTE)
అప్పుడు మోషే యుద్ధం నుండి వచ్చిన సహస్రాధిపతులు, శతాధిపతుల పైన కోపపడ్డాడు.
సంఖ్యాకాండము 31 : 15 (IRVTE)
అతడు వారితో “మీరు మిద్యాను స్త్రీలను ఎందుకు బతకనిచ్చారు?
సంఖ్యాకాండము 31 : 16 (IRVTE)
బిలాము సలహా ప్రకారం పెయోరు విషయంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఎదురు తిరిగేలా చేసింది వారే కదా! అందుచేత యెహోవా మన సమాజంలో తెగులు పుట్టించాడు కదా.
సంఖ్యాకాండము 31 : 17 (IRVTE)
కాబట్టి మీరు మగ పిల్లలందరినీ మగవారితో సంబంధం ఉన్న ప్రతి స్త్రీనీ చంపండి.
సంఖ్యాకాండము 31 : 18 (IRVTE)
మగవారితో సంబంధం లేని ప్రతి ఆడపిల్లను మీ కోసం బతకనీయండి.
సంఖ్యాకాండము 31 : 19 (IRVTE)
మీరు ఏడు రోజులు విడిది బయట ఉండాలి. మీలో మనిషిని చంపిన ప్రతివాడూ, చనిపోయిన వారిని తాకిన ప్రతివాడూ, మీరు, మీరు చెరగా పట్టుకొచ్చిన వారు, మూడో రోజున, ఏడో రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి.
సంఖ్యాకాండము 31 : 20 (IRVTE)
మీరు మీ వస్త్రాలను, చర్మంతో, మేక వెండ్రుకలతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను అన్నిటినీ శుద్ధి చేయాలి.”
సంఖ్యాకాండము 31 : 21 (IRVTE)
అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధానికి వెళ్ళిన సైనికులతో “యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
సంఖ్యాకాండము 31 : 22 (IRVTE)
‘అగ్నితో చెడిపోని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, వీటితో చేసిన వస్తువులన్నిటినీ
సంఖ్యాకాండము 31 : 23 (IRVTE)
మంటల్లో వేసి తీయడం ద్వారా శుద్ధి చేయాలి. వాటిని పాపపరిహార జలంతో కూడా శుద్ధి చేయాలి. అగ్నితో చెడిపోయే ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయాలి.
సంఖ్యాకాండము 31 : 24 (IRVTE)
ఏడో రోజు మీరు మీ బట్టలు ఉతుక్కొని శుద్ధి అయిన తరవాత విడిదిలోకి రావచ్చు.’ ” అన్నాడు.
సంఖ్యాకాండము 31 : 25 (IRVTE)
చెరగా పట్టుకున్నవి రెండు భాగాలు యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు,
సంఖ్యాకాండము 31 : 26 (IRVTE)
“నువ్వూ యాజకుడు ఎలియాజరు సమాజంలోని పూర్వీకుల వంశాల నాయకులు మీరు చెరగా పట్టుకున్న మనుషులను, పశువులను లెక్కబెట్టి రెండు భాగాలు చేయండి.
సంఖ్యాకాండము 31 : 27 (IRVTE)
సైన్యంగా యుద్ధానికి వెళ్ళిన వారికి సగం, మిగిలిన సర్వసమాజానికి సగం పంచిపెట్టండి.
సంఖ్యాకాండము 31 : 28 (IRVTE)
యుద్ధానికి వెళ్ళిన సైనికులపై యెహోవా కోసం పన్ను వేసి, ఆ మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగభాగంలో నుండి తీసుకుని
సంఖ్యాకాండము 31 : 29 (IRVTE)
యెహోవాకు అర్పణగా యాజకుడు ఎలియాజరుకు ఇవ్వాలి.
సంఖ్యాకాండము 31 : 30 (IRVTE)
అదే విధంగా మిగిలిన ఇశ్రాయేలీయుల సగంలో నుండి మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో, అన్ని రకాల జంతువుల్లోనుండి 50 కి ఒకటి చొప్పున తీసుకుని యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇవ్వాలి.”
సంఖ్యాకాండము 31 : 31 (IRVTE)
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా మోషే, యాజకుడు ఎలియాజరు చేశారు.
సంఖ్యాకాండము 31 : 32 (IRVTE)
ఆ సైనికులు దోచుకున్నది గాక మిగిలింది
సంఖ్యాకాండము 31 : 33 (IRVTE)
6, 75,000 గొర్రెలు లేక మేకలు,
సంఖ్యాకాండము 31 : 34 (IRVTE)
72,000 పశువులు, 61,000 గాడిదలు,
సంఖ్యాకాండము 31 : 35 (IRVTE)
32,000 మంది మగవారితో సంబంధం లేని స్త్రీలు ఉన్నారు.
సంఖ్యాకాండము 31 : 36 (IRVTE)
అందులో సగం యుద్ధానికి వెళ్ళిన వారి వంతు, గొర్రె మేకలు 3, 37, 500 వాటిలో యెహోవాకు చెందిన పన్ను 675. పశువుల్లో సగం 36,000.
సంఖ్యాకాండము 31 : 37 (IRVTE)
సంఖ్యాకాండము 31 : 38 (IRVTE)
సంఖ్యాకాండము 31 : 39 (IRVTE)
సంఖ్యాకాండము 31 : 40 (IRVTE)
మనుషుల్లో సగం 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32 మంది.
సంఖ్యాకాండము 31 : 41 (IRVTE)
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా అతడు యెహోవాకు చెందాల్సిన అర్పణను యాజకుడు ఎలియాజరుకు ఇచ్చాడు.
సంఖ్యాకాండము 31 : 42 (IRVTE)
మోషే సైనికుల నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగంలో నుండి లేవీయులకు ఇచ్చాడు.
సంఖ్యాకాండము 31 : 43 (IRVTE)
సంఖ్యాకాండము 31 : 44 (IRVTE)
36,000 పశువులు, 30, 500 గాడిదలు,
సంఖ్యాకాండము 31 : 45 (IRVTE)
16,000 మంది మనుషులు సమాజానికి రావలసిన సగం.
సంఖ్యాకాండము 31 : 46 (IRVTE)
మోషే ఆ సగం నుండి మనుషుల్లో, జంతువుల్లో,
సంఖ్యాకాండము 31 : 47 (IRVTE)
50 కి ఒకటి చొప్పున తీసి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన విధంగా యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇచ్చాడు.
సంఖ్యాకాండము 31 : 48 (IRVTE)
అప్పుడు సైన్యంలో వేలమందికి, వందల మందికి అధిపతులు మోషే దగ్గరికి వచ్చి
సంఖ్యాకాండము 31 : 49 (IRVTE)
“నీ సేవకులైన మేము మా కింద ఉన్న సైనికులందరినీ లెక్కపెట్టాం. మొత్తానికి ఒక్కడు కూడా తగ్గలేదు.
సంఖ్యాకాండము 31 : 50 (IRVTE)
కాబట్టి యెహోవా సన్నిధిలో మా కోసం ప్రాయశ్చిత్తం కలిగేలా మాలో ప్రతి ఒక్కడికి దొరికిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు యెహోవాకు అర్పణ తెచ్చాం” అని చెప్పారు.
సంఖ్యాకాండము 31 : 51 (IRVTE)
మోషే, యాజకుడు ఎలియాజరు ఆ బంగారు నగలను వారి నుండి తీసుకున్నారు.
సంఖ్యాకాండము 31 : 52 (IRVTE)
వేలమందికి, వందల మందికి అధిపతులైన నాయకులు యెహోవాకు అర్పించిన బంగారం మొత్తం 16, 750 తులాలు.
సంఖ్యాకాండము 31 : 53 (IRVTE)
ఆ సైనికుల్లో ప్రతివాడూ తన మట్టుకు తాను దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు.
సంఖ్యాకాండము 31 : 54 (IRVTE)
అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు వేలమందికి, వందల మందికి అధిపతుల దగ్గర తీసుకున్న బంగారాన్ని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంలో ఉంచారు.
❮
❯