సంఖ్యాకాండము 33 : 1 (IRVTE)
ఐగుప్తుదేశం నుండి మోయాబు వరకు ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు.
సంఖ్యాకాండము 33 : 2 (IRVTE)
యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు.
సంఖ్యాకాండము 33 : 3 (IRVTE)
మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు.
సంఖ్యాకాండము 33 : 4 (IRVTE)
ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.
సంఖ్యాకాండము 33 : 5 (IRVTE)
ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 6 (IRVTE)
సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 7 (IRVTE)
ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు.
సంఖ్యాకాండము 33 : 8 (IRVTE)
పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 9 (IRVTE)
ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు.
సంఖ్యాకాండము 33 : 10 (IRVTE)
ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 11 (IRVTE)
అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు.
సంఖ్యాకాండము 33 : 12 (IRVTE)
సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 13 (IRVTE)
దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 14 (IRVTE)
ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.
సంఖ్యాకాండము 33 : 15 (IRVTE)
రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.
సంఖ్యాకాండము 33 : 16 (IRVTE)
అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 17 (IRVTE)
కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 18 (IRVTE)
హజేరోతు నుండి రిత్మా వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 19 (IRVTE)
రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 20 (IRVTE)
రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 21 (IRVTE)
లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 22 (IRVTE)
రీసా నుండి కెహేలాతాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 23 (IRVTE)
కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు.
సంఖ్యాకాండము 33 : 24 (IRVTE)
షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 25 (IRVTE)
హరాదా నుండి మకెలోతుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 26 (IRVTE)
మకెలోతు నుండి తాహతుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 27 (IRVTE)
తాహతు నుండి తారహుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 28 (IRVTE)
తారహు నుండి మిత్కాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 29 (IRVTE)
మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 30 (IRVTE)
హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 31 (IRVTE)
మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 32 (IRVTE)
బెనేయాకాను నుండి హోర్హగ్గిద్గాదుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 33 (IRVTE)
హోర్హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 34 (IRVTE)
యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 35 (IRVTE)
ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 36 (IRVTE)
ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 37 (IRVTE)
కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు.
సంఖ్యాకాండము 33 : 38 (IRVTE)
యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు.
సంఖ్యాకాండము 33 : 39 (IRVTE)
అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
సంఖ్యాకాండము 33 : 40 (IRVTE)
అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు.
సంఖ్యాకాండము 33 : 41 (IRVTE)
వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 42 (IRVTE)
సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 43 (IRVTE)
పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 44 (IRVTE)
ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 45 (IRVTE)
ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 46 (IRVTE)
దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 47 (IRVTE)
అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 48 (IRVTE)
అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు.
సంఖ్యాకాండము 33 : 49 (IRVTE)
వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు.
సంఖ్యాకాండము 33 : 50 (IRVTE)
యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
సంఖ్యాకాండము 33 : 51 (IRVTE)
“నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ‘మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత
సంఖ్యాకాండము 33 : 52 (IRVTE)
ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి.
సంఖ్యాకాండము 33 : 53 (IRVTE)
ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
సంఖ్యాకాండము 33 : 54 (IRVTE)
54 మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
సంఖ్యాకాండము 33 : 55 (IRVTE)
అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు.
సంఖ్యాకాండము 33 : 56 (IRVTE)
అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.’ ”
❮
❯