సంఖ్యాకాండము 34 : 1 (IRVTE)
కనాను దేశంలో ఇశ్రాయేలీయుల సరిహద్దులు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,
సంఖ్యాకాండము 34 : 2 (IRVTE)
‘కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు.
సంఖ్యాకాండము 34 : 3 (IRVTE)
మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది.
సంఖ్యాకాండము 34 : 4 (IRVTE)
మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది.
సంఖ్యాకాండము 34 : 5 (IRVTE)
అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.
సంఖ్యాకాండము 34 : 6 (IRVTE)
మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.
సంఖ్యాకాండము 34 : 7 (IRVTE)
మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా,
సంఖ్యాకాండము 34 : 8 (IRVTE)
హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ,
సంఖ్యాకాండము 34 : 9 (IRVTE)
అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు.
సంఖ్యాకాండము 34 : 10 (IRVTE)
తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి.
సంఖ్యాకాండము 34 : 11 (IRVTE)
అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది.
సంఖ్యాకాండము 34 : 12 (IRVTE)
అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం’ అని వారితో చెప్పు.”
సంఖ్యాకాండము 34 : 13 (IRVTE)
మోషే ఇశ్రాయేలీయులతో “ఇది మీరు చీట్లు వేసుకుని పొందే దేశం. తొమ్మిది గోత్రాలకు, ఒక అర్థ గోత్రానికి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించాడు.
సంఖ్యాకాండము 34 : 14 (IRVTE)
ఎందుకంటే తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం రూబేనీయులు, గాదీయులు తమ వారసత్వాలను పొందారు.
సంఖ్యాకాండము 34 : 15 (IRVTE)
అలాగే మనష్షే అర్థగోత్రం కూడా వారసత్వం పొందింది. ఆ రెండు గోత్రాలు, అర్థ గోత్రం, సూర్యోదయం దిక్కున, అంటే తూర్పున యెరికో దగ్గర యొర్దాను అవతల తమ తమ వారసత్వాలను పొందారు” అని చెప్పాడు.
సంఖ్యాకాండము 34 : 16 (IRVTE)
అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
సంఖ్యాకాండము 34 : 17 (IRVTE)
“ఆ దేశాన్నిమీకు వారసత్వంగా పంచి పెట్టాల్సిన వ్యక్తులు ఎవరంటే, యాజకుడు ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ.
సంఖ్యాకాండము 34 : 18 (IRVTE)
వారు కాక ఆ దేశాన్ని మీకు పంచిపెట్టడానికి ప్రతి గోత్రం నుండి ఒక్క నాయకుణ్ణి ఎన్నుకోవాలి.
సంఖ్యాకాండము 34 : 19 (IRVTE)
వారెవరంటే, యూదా గోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు,
సంఖ్యాకాండము 34 : 20 (IRVTE)
షిమ్యోను గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేలు,
సంఖ్యాకాండము 34 : 21 (IRVTE)
బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు.
సంఖ్యాకాండము 34 : 22 (IRVTE)
దాను గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు.
సంఖ్యాకాండము 34 : 23 (IRVTE)
యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు,
సంఖ్యాకాండము 34 : 24 (IRVTE)
ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు,
సంఖ్యాకాండము 34 : 25 (IRVTE)
జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు,
సంఖ్యాకాండము 34 : 26 (IRVTE)
ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు,
సంఖ్యాకాండము 34 : 27 (IRVTE)
ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు.
సంఖ్యాకాండము 34 : 28 (IRVTE)
నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.”
సంఖ్యాకాండము 34 : 29 (IRVTE)
వీరంతా కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి వారసత్వాలను పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29