సామెతలు 17 : 1 (IRVTE)
ఎంత రుచికరమైన భోజనం ఉన్నా కలహాలతో ఉన్న ఇంట్లో ఉండడం కంటే ప్రశాంతంగా వట్టి రొట్టెముక్క తినడం మంచిది. [PE][PS]
సామెతలు 17 : 2 (IRVTE)
బుద్ధిమంతుడైన సేవకుడు సిగ్గు కలిగించే కొడుకు మీద అధికారం సంపాదించుకుంటాడు. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచు కుంటాడు. [PE][PS]
సామెతలు 17 : 3 (IRVTE)
వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే. [PE][PS]
సామెతలు 17 : 4 (IRVTE)
చెడు నడవడిక గలవాడు చెప్పుడు మాటలు వింటాడు. హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు శ్రద్ధగా వింటాడు. [PE][PS]
సామెతలు 17 : 5 (IRVTE)
పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు. [PE][PS]
సామెతలు 17 : 6 (IRVTE)
మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే. [PE][PS]
సామెతలు 17 : 7 (IRVTE)
అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు. [PE][PS]
సామెతలు 17 : 8 (IRVTE)
లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది. [PE][PS]
సామెతలు 17 : 9 (IRVTE)
ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు. [PE][PS]
సామెతలు 17 : 10 (IRVTE)
బుద్ధిహీనుడికి నూరుదెబ్బల కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట మరింత లోతుగా నాటుతుంది. [PE][PS]
సామెతలు 17 : 11 (IRVTE)
దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు. [PE][PS]
సామెతలు 17 : 12 (IRVTE)
మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం. [PE][PS]
సామెతలు 17 : 13 (IRVTE)
మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు. [PE][PS]
సామెతలు 17 : 14 (IRVTE)
పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి. [PE][PS]
సామెతలు 17 : 15 (IRVTE)
దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం. [PE][PS]
సామెతలు 17 : 16 (IRVTE)
బుద్ధిహీనుడు జ్ఞానం సంపాదించడానికి డబ్బు ఇవ్వడం దేనికి? నేర్చుకునే సామర్థ్యం వాడికి లేదు గదా? [PE][PS]
సామెతలు 17 : 17 (IRVTE)
స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది. [PE][PS]
సామెతలు 17 : 18 (IRVTE)
తన పొరుగువాడికి జామీను ఉండి అతడి అప్పులకు హామీ ఉండే వాడు తెలివితక్కువ వాడు. [PE][PS]
సామెతలు 17 : 19 (IRVTE)
కలహాలంటే ఇష్టం ఉన్నవాడు పాపాన్ని ప్రేమించేవాడు. తన ఇంటి వాకిళ్ళు ఎత్తు పెంచేవాడు ఎముకలు విరగడానికి కారణం అవుతాడు. [PE][PS]
సామెతలు 17 : 20 (IRVTE)
దుష్ట హృదయం గలవాడికి మేలు జరగదు. కుటిలంగా మాట్లాడే వాడు ప్రమాదంలో చిక్కుకుంటాడు. [PE][PS]
సామెతలు 17 : 21 (IRVTE)
బుద్ధిలేని వాడి తండ్రికి దుఃఖమే. తెలివిలేని వాణ్ణి కన్నవాడికి సంతోషం లేదు. [PE][PS]
సామెతలు 17 : 22 (IRVTE)
ఆహ్లాదకరమైన మనస్సు మంచి ఔషధం. చితికిపోయిన మనస్సు వల్ల ఎముకలు ఎండిపోతాయి. [PE][PS]
సామెతలు 17 : 23 (IRVTE)
న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు. [PE][PS]
సామెతలు 17 : 24 (IRVTE)
వివేకం గలవాడు తన ముఖాన్ని జ్ఞానం కేసి తిప్పుకుంటాడు. బుద్ధిలేని వాడి కళ్ళు భూమి కొనల వైపు తిరిగి ఉంటాయి. [PE][PS]
సామెతలు 17 : 25 (IRVTE)
బుద్ధిలేని కొడుకు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. కన్న తల్లికి వాడు వేదన కలిగిస్తాడు. [PE][PS]
సామెతలు 17 : 26 (IRVTE)
మంచి చేసే వారిని శిక్షించడం న్యాయం కాదు. యథార్థత గల ఉదాత్తులను కొరడాలతో కొట్టడం తగదు. [PE][PS]
సామెతలు 17 : 27 (IRVTE)
జ్ఞానం గలవాడు తక్కువగా మాట్లాడతాడు. అవగాహన గలవాడు శాంత గుణం కలిగి ఉంటాడు. [PE][PS]
సామెతలు 17 : 28 (IRVTE)
మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: