సామెతలు 21 : 2 (IRVTE)
రాజు హృదయం యెహోవా చేతిలో కాలవల్లాగా ఉంది. ఆయన తన ఇష్ట ప్రకారం దాన్ని మళ్ళిస్తాడు.
సామెతలు 21 : 3 (IRVTE)
ఒకడు ఎన్నుకున్న మార్గం అది ఎలాటిదైనా సరే, తన దృష్టికది న్యాయం గానే కనిపిస్తుంది. హృదయాలను పరిశీలించేది యెహోవాయే.
సామెతలు 21 : 4 (IRVTE)
బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాకు ప్రీతికరం.
సామెతలు 21 : 5 (IRVTE)
అహంకారం గర్విష్టి హృదయం భక్తిహీనులు వర్ధిల్లడం పాపం.
సామెతలు 21 : 6 (IRVTE)
శ్రద్ధగలవారి ఆలోచనలు లాభాన్ని తెస్తాయి. తొందరపాటుగా పనిచేసే వాడికి నష్టమే.
సామెతలు 21 : 7 (IRVTE)
అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం.
సామెతలు 21 : 8 (IRVTE)
భక్తిహీనులకు న్యాయం గిట్టదు. వారు చేసే దౌర్జన్యమే వారిని కొట్టుకు పోయేలా చేస్తుంది.
సామెతలు 21 : 9 (IRVTE)
దోషంతో నిండిన వాడి మార్గం వంకర మార్గం. పవిత్రులు రుజుమార్గంలో నడుచుకుంటారు.
సామెతలు 21 : 10 (IRVTE)
గయ్యాళితో భవంతిలో ఉండడం కంటే మిద్దెపై ఒక మూలన నివసించడం మేలు.
సామెతలు 21 : 11 (IRVTE)
భక్తిలేని వాడి మనస్సు అస్తమానం కీడు చేయాలని చూస్తుంటుంది. అతని పొరుగు వాడికి అతని కన్నుల్లో దయ ఎంతమాత్రం కనిపించదు.
సామెతలు 21 : 12 (IRVTE)
అపహాసకుడికి శిక్ష రావడం చూసి ఆజ్ఞాని బుద్ధి తెచ్చుకుంటాడు. ఉపదేశం మూలంగా జ్ఞానం గలవాడి తెలివి పెరుగుతుంది.
సామెతలు 21 : 13 (IRVTE)
న్యాయం చేసే వాడు భక్తిహీనుల ఇల్లు ఏమైపోతున్నదో కనిపెట్టి చూస్తుంటాడు. దుర్మార్గులను ఆయన పడగొట్టి నాశనం చేస్తాడు.
సామెతలు 21 : 14 (IRVTE)
దరిద్రుల మొర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టే సమయంలో దేవుడు దాన్ని వినిపించుకోడు.
సామెతలు 21 : 15 (IRVTE)
చాటున ఇచ్చిన కానుక కోపాన్ని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన బహుమానం తీవ్ర కోపాన్ని సైతం శాంతింప జేస్తుంది.
సామెతలు 21 : 16 (IRVTE)
న్యాయ క్రియలు చేయడం నీతిపరుడికి సంతోషం. పాపాత్ముడికి అది భయంకరం.
సామెతలు 21 : 17 (IRVTE)
వివేకమార్గం తప్పి తిరిగేవాడు ప్రేతాత్మల గుంపులో కాపురముంటాడు.
సామెతలు 21 : 18 (IRVTE)
సుఖభోగాల్లో వాంఛ గలవాడు దరిద్రుడౌతాడు. ద్రాక్షారసం, నూనెల కోసం వెంపర్లాడే వాడికి ఐశ్వర్యం కలగదు.
సామెతలు 21 : 19 (IRVTE)
నీతిపరుని కోసం దుర్మార్గులు విడుదల వెలగా ఉంటారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు పరిహారంగా ఉంటారు.
సామెతలు 21 : 20 (IRVTE)
ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురం చెయ్యడం కంటే ఎడారిలో నివసించడం మేలు.
సామెతలు 21 : 21 (IRVTE)
విలువైన నిధులు, నూనె జ్ఞానుల ఇళ్ళలో ఉంటాయి. బుద్ధిహీనుడు వాటిని నిర్లక్షంగా ఖర్చు చేస్తాడు.
సామెతలు 21 : 22 (IRVTE)
నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు.
సామెతలు 21 : 23 (IRVTE)
జ్ఞానవంతుడు పరాక్రమశాలుల నగరం పై దాడి చేస్తాడు. అతడు దాని భద్రమైన కోటను కూలదోస్తాడు.
సామెతలు 21 : 24 (IRVTE)
నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు.
సామెతలు 21 : 25 (IRVTE)
అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు.
సామెతలు 21 : 26 (IRVTE)
సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి.
సామెతలు 21 : 27 (IRVTE)
రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు.
సామెతలు 21 : 28 (IRVTE)
దుష్టులర్పించే బలులు అసహ్యం. ఆ బలులు వారు దురాలోచనతో అర్పిస్తే అవి మరింకెంత అసహ్యమో గదా.
సామెతలు 21 : 29 (IRVTE)
అబద్ధసాక్షి నాశనమై పోతాడు. శ్రద్ధగా వినేవాడు పలికే మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
సామెతలు 21 : 30 (IRVTE)
దుర్మార్గుడు ముఖం మాడ్చుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు.
సామెతలు 21 : 31 (IRVTE)
యెహోవాకు విరోధమైన జ్ఞానంగానీ వివేచనగానీ ఆలోచనగానీ నిలవదు. యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు. అయితే విజయం యెహోవాదే.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31