సామెతలు 23 : 1 (IRVTE)
నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు. [PE][PS]
సామెతలు 23 : 2 (IRVTE)
నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో. [PE][PS]
సామెతలు 23 : 3 (IRVTE)
అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి. [PE][PS]
సామెతలు 23 : 4 (IRVTE)
ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి. [PE][PS]
సామెతలు 23 : 5 (IRVTE)
డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది. [PE][PS]
సామెతలు 23 : 6 (IRVTE)
దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు. [PE][PS]
సామెతలు 23 : 7 (IRVTE)
ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు. [PE][PS]
సామెతలు 23 : 8 (IRVTE)
నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది. [PE][PS]
సామెతలు 23 : 9 (IRVTE)
బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. [PE][PS]
సామెతలు 23 : 10 (IRVTE)
పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి చొరబడవద్దు. [PE][PS]
సామెతలు 23 : 11 (IRVTE)
వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు. [PE][PS]
సామెతలు 23 : 12 (IRVTE)
ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు. [PE][PS]
సామెతలు 23 : 13 (IRVTE)
నీ పిల్లలను శిక్షించడం మానవద్దు. బెత్తంతో వాణ్ణి కొట్టినట్టయితే వాడు చావడు. [PE][PS]
సామెతలు 23 : 14 (IRVTE)
బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు. [PE][PS]
సామెతలు 23 : 15 (IRVTE)
కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది. [PE][PS]
సామెతలు 23 : 16 (IRVTE)
నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది. [PE][PS]
సామెతలు 23 : 17 (IRVTE)
పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు. [PE][PS]
సామెతలు 23 : 18 (IRVTE)
నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు. [PE][PS]
సామెతలు 23 : 19 (IRVTE)
కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో. [PE][PS]
సామెతలు 23 : 20 (IRVTE)
ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు. [PE][PS]
సామెతలు 23 : 21 (IRVTE)
తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది. [PE][PS]
సామెతలు 23 : 22 (IRVTE)
నీ కన్నతండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. [PE][PS]
సామెతలు 23 : 23 (IRVTE)
సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో. [PE][PS]
సామెతలు 23 : 24 (IRVTE)
ఉత్తముడి తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణ్ణి కన్నవాడు వాడివల్ల ఆనందపడతాడు. [PE][PS]
సామెతలు 23 : 25 (IRVTE)
నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి. [PE][PS]
సామెతలు 23 : 26 (IRVTE)
కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి. [PE][PS]
సామెతలు 23 : 27 (IRVTE)
వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట. [PE][PS]
సామెతలు 23 : 28 (IRVTE)
దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది. [PE][PS]
సామెతలు 23 : 29 (IRVTE)
ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు? ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు? [PE][PS]
సామెతలు 23 : 30 (IRVTE)
ద్రాక్షారసంతో పొద్దుపుచ్చే వారికే గదా. కలిపిన ద్రాక్షారసం సేవించే వారికే గదా. [PE][PS]
సామెతలు 23 : 31 (IRVTE)
ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు. [PE][PS]
సామెతలు 23 : 32 (IRVTE)
అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది. [PE][PS]
సామెతలు 23 : 33 (IRVTE)
నీ కళ్ళకు విపరితమైనవి కనిపిస్తాయి. నీవు వెర్రిమాటలు పలుకుతావు. [PE][PS]
సామెతలు 23 : 34 (IRVTE)
నీవు నడిసముద్రంలో పడుకున్నవాడి లాగా ఉంటావు. ఓడ తెరచాప కొయ్య చివరన తల వాల్చుకున్నవాడి లాగా ఉంటావు. [PE][PS]
సామెతలు 23 : 35 (IRVTE)
“నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: